Facebook: ఫేస్‌బుక్ ఉద్యోగులకు మీ పాస్‌వర్డ్ తెలుసు... ఇలా జాగ్రత్తపడండి

Facebook | కొన్నేళ్లుగా మీ పాస్‌వర్డ్స్ ఇలా రిస్క్‌లో ఉన్నాయని KrebsOnSecurity సంస్థ బయటపెట్టింది. సుమారు 20-60 కోట్ల మంది ఫేస్‌బుక్ యూజర్ల పాస్‌వర్డ్స్ ప్లెయిన్ టెక్స్ట్‌లో సేవ్ చేశారని, ఫేస్‌బుక్‌లో పనిచేసే 20,000 మంది ఉద్యోగులు వాటిని యాక్సెస్ చేయొచ్చన్నది ఆ కథనం సారాంశం.

news18-telugu
Updated: March 22, 2019, 4:36 PM IST
Facebook: ఫేస్‌బుక్ ఉద్యోగులకు మీ పాస్‌వర్డ్ తెలుసు... ఇలా జాగ్రత్తపడండి
Facebook: ఫేస్‌బుక్ ఉద్యోగులకు మీ పాస్‌వర్డ్ తెలుసు... ఇలా జాగ్రత్తపడండి (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: March 22, 2019, 4:36 PM IST
మీ ఫేస్‌బుక్ పాస్‌వర్డ్‌ సీక్రెట్ ఏమీ కాదు. మీ పాస్‌వర్డ్ ఏంటో ఫేస్‍బుక్ ఉద్యోగులకు తెలుసు. మీదే కాదు... కోట్లాది మంది యూజర్ల పాస్‌వర్డ్స్ మొత్తం కేవలం ఓ టెక్స్ట్‌ ఫైల్‌లో ఉన్నాయని, వాటిని ఫేస్‌బుక్ ఉద్యోగులు సులువుగా తెలుసుకోవచ్చన్న విషయం తాజాగా కలకలం రేపుతోంది. ఇప్పుడు కాదు... కొన్నేళ్లుగా మీ పాస్‌వర్డ్స్ ఇలా రిస్క్‌లో ఉన్నాయని KrebsOnSecurity సంస్థ బయటపెట్టింది. సుమారు 20-60 కోట్ల మంది ఫేస్‌బుక్ యూజర్ల పాస్‌వర్డ్స్ ప్లెయిన్ టెక్స్ట్‌లో సేవ్ చేశారని, ఫేస్‌బుక్‌లో పనిచేసే 20,000 మంది ఉద్యోగులు వాటిని యాక్సెస్ చేయొచ్చన్నది ఆ కథనం సారాంశం.

Read this: CIBIL Score: మీ సిబిల్ స్కోర్ ఇక వాట్సప్‌లో... ఇలా తెలుసుకోవచ్చు

ఇలా సెక్యూరిటీ లోపాలతో ఫేస్‌బుక్ బజారునపడటం కొత్తేమీ కాదు. ఈ లోపాలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ ఎక్స్‌పర్ట్స్, సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఎప్పట్నుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీక్ పాస్‌వర్డ్స్ వాడుతున్నవాళ్లు స్ట్రాంగ్ పాస్‌వర్డ్, 2- ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ సెట్ చేసుకొని జాగ్రత్తపడాలంటున్నారు నిపుణులు. సైబర్ సెక్యూరిటీ సంస్థలో సీనియర్ టెక్నాలజిస్ట్‌గా పనిచేస్తున్న జాన్ షీర్ ఇస్తున్న సలహాలు ఇవే.

Read this: Smartphone Tip: మీ స్మార్ట్‌ఫోన్ వాటర్‌ప్రూఫేనా? ఇలా తెలుసుకోవచ్చు



మీ పాస్‌వర్డ్ ఇతరులకు తెలిసిందని అనుమానం ఉందా? అయితే వెంటనే మార్చెయ్యండి.
మీ పాస్‌వర్డ్ ఎవరికీ చెప్పొద్దు.
ఒక్కసారి పాస్‌వర్డ్ లీకైందంటే మీ ఫేస్‌బుక్ హ్యాకవుతుంది.
Loading...
2-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ తప్పనిసరి.
ఫేస్‌బుక్ అనే కాదు ఏ అకౌంట్ అయినా 2-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ సెట్ చేసుకోవాలి.
2-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఉంటే మీ పాస్‌వర్డ్ తెలిసినా ఎవరూ ఏమీ చేయలేరు.
ఫేస్‌బుక్‌కు మీ ఫోన్ నెంబర్ ఇవ్వడం ఇష్టం లేకపోతే యాప్-బేస్డ్ ఆథెంటికేషన్ సెట్ చేసుకోవచ్చు.
యాప్-బేస్డ్ ఆథెంటికేషన్‌తో లాగిన్ చేసిన ప్రతీసారి వన్ టైమ్ కోడ్ వస్తుంది.

Photos: ఈ లేడీ బైకర్ ఆన్‌‌లైన్ సెన్సేషన్... అమ్మాయిలకు ఇన్‌స్పిరేషన్

ఇవి కూడా చదవండి:

Food Safety Jobs: ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌లో 275 ఖాళీలు

LIC Navjeevan Plan: ఎల్ఐసీ నుంచి కొత్త పాలసీ... నవజీవన్ ప్లాన్‌తో లాభాలు ఇవే

Google Apps: ఏప్రిల్ 2న రెండు గూగుల్ యాప్స్ షట్‌డౌన్

March 31 Deadline: ఈ 5 పనులకు మార్చి 31 డెడ్‌లైన్... త్వరగా పూర్తిచేయండి
First published: March 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...