• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • FACEBOOK DOWN FOR USERS GLOBALLY WHATSAPP INSTAGRAM AFFECTED TOO BA

Facebook Down: సరిగా పనిచేయని వాట్సాప్, ఇన్ స్టా గ్రామ్

Facebook Down: సరిగా పనిచేయని వాట్సాప్, ఇన్ స్టా గ్రామ్

వాట్సప్, ఫేస్ బుక్

భారత్‌తో పాటు పలు దేశాల్లో ఫేస్ బుక్, వాట్సప్, ఇన్‌స్టా గ్రామ్ నెమ్మదించాయి. దీంతో యూజర్లు ఇబ్బంది పడ్డారు.

  • Share this:
    ప్రపంచవ్యాప్తంగా ఫేస్ బుక్ నెమ్మదించింది. భారత్‌లో కూడా చాలా మంది యూజర్లు ఫేస్ బుక్‌ డౌన్ అయిన విషయాన్ని గుర్తించారు. డెస్క్ ‌టాప్ వెర్షన్లలో ఫేస్ బుక్ పనిచేయడం లేదంటూ పెద్ద ఎత్తున ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు. ఫేస్ బుక్‌తో పాటు ఆ సంస్థకు చెందిన వాట్సప్, ఇన్‌స్టా గ్రామ్ కూడా సరిగా పనిచేయడం లేదనే ఫిర్యాదులు వచ్చాయి. డౌన్ డిటెక్టర్ అనే వెబ్‌సైట్ పరిశీలనలో భారత్‌లో ఫేస్ బుక్ ఉదయం 6.28 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నెమ్మదించిందని గుర్తించినట్టు హిందుస్తాన్ టైమ్స్ తెలిపింది. ఒక్క ఇండియాలోనే కాదు అమెరికా, మలేసియా, టర్కీ లాంటి దేశాల్లో కూడా ఫేస్ బుక్ డౌన్ అయినట్టు ఆ లైవ్ ట్రాకింగ్ సిస్టమ్‌ గుర్తించింది.

    ది వెర్జ్ కథనం ప్రకారం ఫేస్ బుక్, ఇన్‌స్టా గ్రామ్, వాట్సప్ సరిగా పనిచేయడం లేదు. ఈ స్టోరీ రాసే సమయానికి (సాయంత్రం 5.30) కూడా ఫేస్ బుక్, వాట్సప్ మెరుగుపడలేదు. గత నెలలో కూడా ఈ మూడు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లు సమస్యను ఎదుర్కొన్నాయి. ఇప్పుడు మరోసారి ఇలా జరిగింది. దీంతో చాలా మంది యూజర్లు తమ అనుభవాలను ట్విట్టర్‌లో పంచుకుంటున్నారు.

    First published: