Facebook: ఫేస్​బుక్​ నుంచి అదిరిపోయే శుభవార్త.. ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​తో కొత్త యాప్​

ప్రతీకాత్మక చిత్రం

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ ఆర్టిఫిజియల్ ఇంటెలిజెన్స్ తో ఓ కొత్త యాప్ రూపొందిస్తోంది. వీడియోల లైవ్​లను రికార్డు చేయడంతో పాటు వాటిలోని సమాచారాన్ని విశ్లేషిస్తోంది. ఇది మీ రోజువారీ కార్యక్రమాల్లో చాలా ఉపయోగపడుతుందని ఫేస్ బుక్ చెబుతోంది.

  • Share this:
Facebook:  సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ (Facebook) ఆర్టిఫిజియల్ ఇంటెలిజెన్స్ తో ఓ కొత్త యాప్ రూపొందిస్తోంది. వీడియోల లైవ్​లనురికార్డు చేయడంతో పాటు వాటిలోని సమాచారాన్నివిశ్లేషిస్తోంది. ఇది మీరోజువారీ కార్యక్రమాల్లో చాలా ఉపయోగపడుతుందని ఫేస్ బుక్ (Facebook) చెబుతోంది. ఉదాహరణకు డ్రమ్ వాయించే పాఠాలు నేర్చుకునేప్పుడు మీ యొక్క వేళ్లు ఖచ్ఛితంగా స్టిక్స్ పట్టుకున్నాయా? లేదా? అనే విషయాన్ని ఏఆర్ పరికరం చూపిస్తుంది. వంటకాల తయారీలో సూచనలు, టైపింగ్ చేసేప్పుడు ఏవైనా కీస్ మరచిపోతే వాటిని గుర్తు చేయడం, హెలోగ్రామ్స్ ద్వారా పాతజ్ఙాపకాలు కూడా ఈ కొత్త యాప్గుర్తు చేస్తుంది.ఈ యాప్ కు ఇగో4డీ గా పేరు పెట్టినట్టు ఫేస్ బుక్ (Facebook) ఏఐ ప్రకటించింది. అహంకార అవగాహన (egocentric perception) పై ఉన్న అనేక సవాళ్లను దీర్ఘకాలంపాటు సాగే ఈ ప్రాజెక్టు ద్వారా పరిష్కారం లభిస్తుందని ఫేస్ బుక్ (Facebook) ప్రకటించింది. ఇందుకోసం తొమ్మిది దేశాల్లోని 13 యూనివర్శిటీల సహాయం తీసుకున్నారు.

Facebook Loans: చిరు వ్యాపారులకు ఫేస్‌బుక్ లోన్స్..వినూత్న ప్రయోగం...


దాదాపు 700 మంది నుంచి 2200 గంటల వీడియోలను విశ్లేషించామని ఫేస్ బుక్ తెలిపింది. దీని ద్వారా పరిశోధకులకు ఇగోసెంట్రిక్ డేటా ఒక క్రమ పరిమాణంలో అందుబాటులోకి రానుంది.ఇంత వరకు ఎవరూ అందించని 20x కన్నా ఎక్కువ వీడియో ఫుటేజీ అందుబాటులో వస్తుంది. వచ్చే తరం ఆర్టిఫిజియల్ ఇంటెలిజన్స్వ్యవస్థకుఓ కొత్త తరహా డేటా అవసరం అవుతుందని, అలాంటి వీడియోలు ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూపుతాయని ఫేస్ బుక్ శాస్త్రవేత్త క్రిస్టెన్ గ్రామెన్ అభిప్రాయడ్డారు.

13 యూనివర్సిటీల సహకారంతో..
కన్సార్డియం, ఫేస్ బుక్ రియాలిటీ ల్యాబ్స్ రీసెర్చ్ ( FRL Research) సంయుక్తంగా ఐదు లక్ష్యాలను నిర్దేశించుకున్నాయి. ఇందులో మొదటిసారి వీడియో చూసిన వ్యక్తి అనుభూతికన్నా ఫేస్ బుక్ ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్స్ ద్వారా నిజమైన ప్రపంచాన్ని ఆవిష్కృతంచేయడమే తమ ముందున్న లక్ష్యమని క్రిస్టేన్ తెలిపారు. ఇగో4D నిర్దేశించుకున్న ఐదు లక్ష్యాల్లో పాక్షిక మెమోరీ, ప్రసారం, వస్తువులను మాయం చేయడం, ఆడియో విజువల్ డయారైజేషన్, సోషల్ ఇంటరాక్షన్ ప్రధానంగా ఉన్నాయి.

ఇండియాలో Facebook, Twitter, Instagram బ్లాక్? ఎందుకంటే


బిల్డింగ్ బ్లాక్ పై పరిశోధన చేయడంలో పనిని సులువుగా అర్థంచేసుకోవడం, వాటితో సంభాషించడంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్స్ సహాయ పడనున్నాయి. ఇగో4డీతో ఒప్పందం చేసుకున్న పరిశోధకులకు వచ్చే నవంబరు నుంచి డేటా అందుబాటులో ఉంటుందని ఫేస్ బుక్ ప్రకటించింది. FRL పరిశోధకులు ఉనిక్స్ బ్లేడ్ గ్రాసెస్ ద్వారా అదనంగా సహజ పద్దతుల్లో మరో 400 గంటల వీడియో డేటాను సేకరించింది. ఈ డేటాను కూడా త్వరలో విడుదల చేయనున్నట్టు సంస్థ తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిషెన్స్ ద్వారా రియల్ టైమ్ లో కదలికలు, సంభాషించడంతో పాటు అనేక సదుపాయాలు త్వరలో అందుబాటులోకి వస్తాయని ఫేస్ బుక్ శాస్త్రవేత్త క్రిస్టెన్ గ్రామెన్ ప్రకటించారు.
Published by:Krishna Adithya
First published: