FACEBOOK CEO MARK ZUCKERBERGS PHONE NUMBER APPEARED AMONG THE LEAKED DATA OF FACEBOOK USERS HERE IS SHOCKING DETAILS SK
Facebook Data Leak: ఫేస్‌బుక్‌కు మరో బిగ్ షాక్.. సీఈవో జుకర్‌బర్గ్ డేటా కూడా లీక్..
ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్
బిజినెస్ ఇన్సైడర్ కథనం ప్రకారం.. 50 కోట్ల ఫేస్బుక్ యూజర్ల ఖాతాలు హ్యాక్ అయ్యాయి. వారి డేటా వివరాలన్నీ ఆన్లైన్లో లీక్ అయ్యాయి. 106 దేశాల్లో ఫేస్బుక్ వాడుతున్నవారి ఫోన్ నెంబర్లు, ఫేస్బుక్ ఐడీలు, పూర్తి పేర్లు, లొకేషన్, పుట్టిన తేదీ, ఇమెయిల్ అడ్రస్‌లు ఆన్లైన్లో లీక్ అయ్యాయి.
ఫేస్బుక్ యూజర్స్ డేటా లీక్ వ్యవహారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ఇది ఆశామాషీ హ్యాకింగ్ కాదు. ఏకంగా 50 కోట్ల మంది యూజర్ల అకౌంట్లు హ్యాక్ అయ్యాయని బిజినెస్ ఇన్సైడర్ కథనం పబ్లిష్ చేసింది. ఐతే ఇందులో సాధారణ యూజర్లే కాదు.. ఏకంగా ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్మార్గ్ డేటా కూడా ఉందని పేర్కొంది. ఆయన ఫోన్ నెంబర్‌తో పాటు వ్యక్తిగత వివరాలన్నీ ఆన్లైన్లో లీక్ అయినట్లు వెల్లడించింది. ఆయన పేరు, ప్రాంతం, పుట్టిన తేదీ, పెళ్లి వివరాలు, ఫేస్ బుక్ యూజర్ ఐడీ వివరాలన్నీ లీక్ అయ్యాయని సన్ వార్తా సంస్థ కూడా పేర్కొంది. సాక్షాత్తు ఫేస్బుక్ సీఈవో ఖాతానే హ్యాక్ కావడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్‌గా మారింది. సీఈవో డేటాకే భద్రత లేకుంటే.. సాధారణ యూజర్లకు భద్రత ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బిజినెస్ ఇన్సైడర్ కథనం ప్రకారం.. 50 కోట్ల ఫేస్బుక్ యూజర్ల ఖాతాలు హ్యాక్ అయ్యాయి. వారి డేటా వివరాలన్నీ ఆన్లైన్లో లీక్ అయ్యాయి. 106 దేశాల్లో ఫేస్బుక్ వాడుతున్నవారి ఫోన్ నెంబర్లు, ఫేస్బుక్ ఐడీలు, పూర్తి పేర్లు, లొకేషన్, పుట్టిన తేదీ, ఇమెయిల్ అడ్రస్‌లు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఇందులో భారత్‌కు చెందిన 60 లక్షల మంది వివరాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఫేస్బుక్ చరిత్రలోనే అతి పెద్ద డేటా లీకేజ్ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యూజర్ల డేటా ఆన్‌లైన్‌లోకి వచ్చేయడంతో.. ఆ సమాచారం దుర్వినియోగం అయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తమవుతోంది.
ఫేస్బుక్ డేటాకు సంబంధించిన సమస్య ఇప్పటిది కాదు. గతంలో కేంబ్రిడ్జ్ అనలిటికా 8.7 కోట్ల ఫేస్బుక్ యూజర్ల సమాచారాన్ని సేకరించిందన్న వార్తలు అప్పట్లో కలకలం రేపాయి. ఈ ఇష్యూ తర్వాత ఫేస్బుక్ భద్రతా చర్యలు చేపట్టింది. 2018లో ఫోన్ నెంబర్ల ద్వారా యూజర్లను సెర్చ్ చేసే ఫీచర్‌ను డిసేబుల్ చేసింది. ఇక 2019 డిసెంబర్లో ఉక్రెయినియన్ సెక్యూరిటీ రీసెర్చర్ కూడా 26.7 కోట్ల ఫేస్బుక్ యూజర్ల పేర్లు, ఫోన్ నెంబర్లు, యూజర్ ఐడీలు లీక్ అయినట్టు వార్తలొచ్చాయి. ఐతే ఆ డేటా చాలా పాతదని, 2019లోనే తమకు సమాచారం అందిందని, 2019 ఆగస్టులోనే సమస్యను పరిష్కరించామని ఫేస్బుక్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం మరోసారి డేటా లీక్ కావడంతో యూజర్లలో ఆందోళన నెలకొంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.