సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సంచలన నిర్ణయం తీసుకుంది. విద్వేషాలు రెచ్చగొట్టే 1000కి పైగా తీవ్రవాద, సామాజిక ఉద్యమాల గ్రూపులను బ్యాన్ చేసింది. ఆయా గ్రూప్‌లను "ప్రమాదకరమైన వ్యక్తులు, సంస్థలు" జాబితాలో చేర్చింది. అమెరికా (America) ప్రభుత్వం నుంచి సేకరించిన తీవ్రవాద గ్రూప్‌ల లిస్ట్ ప్రకారం వాటిని బ్యాన్ చేసింది. ఈ జాబితాను అమెరికాకు చెందిన వార్తా సంస్థ ది ఇంటర్సెప్ట్ ప్రచురించింది. “ఫేస్బుక్ (Facebook) ప్రమాదకరమైన ఉగ్రవాద గ్రూప్‌ల జాబితాలో దాదాపు 1,000 ఎస్డీజీటీ లేదా గ్లోబల్ టెర్రరిస్ట్ గ్రూపులను చేర్చింది. ఈ గ్రూప్‌లలో సెప్టెంబర్ 11 వరల్ట్ ట్రేడ్ సెంటర్‌ను కూల్చివేసిన ఆల్‌ఖైదా (Al Queda) తీవ్రవాద గ్రూప్ కూడా ఉంది.” అని ఇంటర్సెఫ్ట్ తన నివేదికలో పేర్కొంది.
జాబితాలో ఎక్కువగా ముస్లిం ప్రాంతాలకు చెందిన గ్రూప్స్ ఉండటం గమనార్హం. అంటే ఫేస్బుక్ కూడా- అమెరికా ప్రభుత్వం లాగే- ముస్లింలను అత్యంత ప్రమాదకరంగా భావిస్తుందని నివేదిక అభిప్రాయపడింది. అయితే నిషేధానికి గురైన ఫేస్బుక్ గ్రూప్స్ జాబితా సమగ్రంగా లేదని కౌంటర్ టెర్రరిజం అండ్ డేంజరస్ ఆర్గనైజేషన్స్ పాలసీ డైరెక్టర్ బ్రియాన్ ఫిష్‌మన్ అన్నారు. ఈ జాబితాలో కొన్ని ఉగ్రవాద గ్రూప్‌లను మినహాయించారని, అవి ఇంకా వాటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. వాటిని కూడా బ్యాన్ చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు.
దీనిపై ఫేస్బుక్ ట్వీట్ చేస్తూ ‘‘ప్రమాదకరమైన వ్యక్తులు, సంస్థలకు ఫేస్బుక్లో చోటు లేదు. ఈ గ్రూప్‌ల కారణంగా సమాజంలో హింస చెలరేగుతోంది. వారికి ఫేస్బుక్ వారధిలా పనిచేయదు. సామాజిక మాధ్యమాలను మంచి కోసం ఉపయోగించాలి కానీ.. హింసను ప్రేరేపించేలా ఉపయోగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించం. వాటిపై బ్యాన్ విధిస్తాం. మేము మా యూజర్ల పట్ల వీలైనంత పారదర్శకంగా ఉండటానికి ప్రయత్నిస్తాం. అదే సమయంలో వారి భద్రతకు ప్రాధాన్యతనిస్తాం.”అని ట్వీట్లో పేర్కొంది.
Maa Elections 2021: మా ఎన్నికల ఎఫెక్ట్.. ఆ నినాదం ప్రభావం తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఉంటుందా ?
YS Jagan: జగన్‌ను టెన్షన్ పెడుతున్న వైఎస్ఆర్ సన్నిహితుడు.. వైసీపీలో టెన్షన్
ప్రమాదకరమైన సంస్థలకు ఫేస్బుక్లో నో ఎంట్రీ..
ఫేస్బుక్ "ప్రమాదకరమైన వ్యక్తుల" జాబితాలో రేసిజం పెంచే తెల్లజాతి గ్రూప్‌లు, అల్ ఖైదా, ఇతర ఉగ్రవాద గ్రూపులు కూడా ఉన్నాయి. ఫేస్బుక్ ఆయా గ్రూపులను మూడు కేటగిరీలుగా విభజించింది. టైర్ 1లో టెర్రర్ గ్రూపులను, టైర్ 2లో సాయుధ తిరుగుబాటుదారులకు చెందిన గ్రూప్‌లను, టైర్ 3లో 'మిలిటరైజ్డ్' సామాజిక ఉద్యమాలకు చెందిన గ్రూప్‌లను చేర్చింది. 2020లో ఫేస్బుక్ 600 'మిలిటరైజ్డ్' సామాజిక ఉద్యమ గ్రూప్‌లను గుర్తించింది. వాటికి సంబంధించిన దాదాపు 2,400 పేజీలు, 14,200 గ్రూప్‌లను, కంటెంట్‌ను తొలగించింది. గత కొతం కాలంగా ఫేస్బుక్ తన ప్లాట్‌ఫారమ్‌లో హింసను ప్రేరేపించే గ్రూప్‌లను బ్యాన్ చేస్తూ వస్తుంది. ఇందులో భాగంగా తాజాగా వెయ్యికి పైగా గ్రూప్‌లను బ్యాన్ చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Facebook