కాశ్మీర్ ప్రత్యేక దేశమట...తప్పులో కాలేసి అభాసుపాలైన ఫేస్‌బుక్

ఇండియా, ఇండోనేషియా, ఈజిప్టుతో పాటు కశ్మీర్‌నూ దేశంగా పేర్కొంటూ ఓ బ్లాగ్ పోస్టులో జాబితాను పెట్టింది. నెటిజన్లు ఏకిపారేయంతో తప్పుని తెలుసుకొని సరిదిద్దుకొని క్షమాపణలు చెప్పింది

news18-telugu
Updated: March 28, 2019, 7:35 PM IST
కాశ్మీర్ ప్రత్యేక దేశమట...తప్పులో కాలేసి అభాసుపాలైన ఫేస్‌బుక్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మరో వివాదంలో చిక్కుకుంది. కాశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా పేర్కొంటూ తప్పులో కాలేసింది. ఫేస్‌బుక్ వైఖరిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పొరపాటును గుర్తించి వెంటనే సరిదిద్దుకుంది. ఇరాన్ నెట్‌వర్క్‌ టార్గెట్‌గా మారిన దేశాల జాబితాను రూపొందించిన ఫేస్‌బుక్..అందులో కశ్మీర్ పేరుని పొరపాటున పేర్కొంది. ఇండియా, ఇండోనేషియా, ఈజిప్టుతో పాటు కశ్మీర్‌నూ దేశంగా పేర్కొంటూ ఓ బ్లాగ్ పోస్టులో జాబితాను పెట్టింది. నెటిజన్లు ఏకిపారేయంతో తప్పుని సరిదిద్దుకొని క్షమాపణలు చెప్పింది.

ఇరాన్ నెట్‌వర్క్ గ్రూప్స్, పేజీల్లో కశ్మీర్ అంశం ఉంది. ఆ నెట్‌వర్క్‌కు లక్ష్యంగా మారిన దేశాల జాబితాలో కాశ్మీర్ పేరు చేర్చకుండా ఉండాల్సింది. కానీ పొరపాటున కాశ్మీర్‌ను దేశంగా పేర్కొన్నారు. బ్లాగ్‌పోస్టులో తప్పును సరిదిద్దాం. ఏదైనా గందరగోళం తలెత్తిఉంటే క్షమాపణలు చెబుతున్నాం.
ఫేస్‌బుక్
ఇక భారత్ సహా పలుదేశాల్లో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న ఇరాన్ నెట్‌వర్క్‌పై ఫేస్‌బుక్ ఉక్కుపాదం మోపింది. అనధీకృత చర్యలకు పాల్పడిన కారణంగా ఇరాన్ నెట్‌వర్క్‌కు చెందిన దాదాపు 513 పేజీలు, గ్రూపులు, ఇతర ఖాతాలను తొలగించింది. ఫేస్‌బుక్ పాలసీకి అనుగుణంగా వాటిని తొలగించినట్లు వెల్లడించింది. అమెరికా, సౌదీఅరేబియా, ఇజ్రాయెల్ టార్గెట్‌గా పనిచేస్తున్న ఇరాన్ నెట్‌వర్క్ గ్రూప్స్, పేజీలను సైతం తొలగించింది.
First published: March 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>