Social media: మళ్లీ స్తంభించిన ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​ సేవలు.. తమ ఖాతాలూ హ్యాక్​ అయ్యాయంటూ యూజర్ల సంచలన ఫిర్యాదులు

ఫేస్‌బుక్‌ యజమాని మార్క్ జుకర్ బర్గ్

గత వారం ఫేస్​బుక్​, వాట్సాప్​ తదితర సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడు గంటల తర్వాత సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇక అంతా సవ్యంగానే ఉందని ప్రకటించింది కూడా. అంతకు మించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతో పలు అనుమానాలు పుట్టుకొచ్చాయి. అయితే మరోసారి ఇన్​స్టాగ్రామ్​, ఫేస్‌బుక్‌​ సేవలు నిలిచిపోవడం కలకలం రేపింది.

  • Share this:
    ఈనెల 4వ తేదీన రాత్రి 9 గంటల సమయం నుంచి ఫేస్‌బుక్‌తో (Facebook), వాట్సాప్ (WhatsApp) ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) సేవలు స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. గంటలు గడుస్తున్నా ఈ సైట్ల సేవలు మళ్లీ అందుబాటులోకి రాకపోవడంతో కోట్లాదిమంది యూజర్లు (users) తెగ హైరానా పడ్డారు. ఈ క్రమంలో ఫేస్‌బుక్ (Facebook) తమ వైపు నుంచే తప్పిదం జరిగిందని.. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని (resolve) చెప్పి దాదాపు ఏడు గంటల తర్వాత సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇక అంతా సవ్యంగానే ఉందని ప్రకటించింది కూడా. అంతకు మించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతో పలు అనుమానాలు పుట్టుకొచ్చాయి. అయితే మరోసారి ఇన్​స్టాగ్రామ్​, ఫేస్‌బుక్‌​ సేవలు నిలిచిపోవడం కలకలం రేపింది.

    అకౌంట్లు హ్యాక్... ?

    గత రాత్రి (ఈనెల 8వ తేదీన) ఇన్​స్టాగ్రామ్​, ఫేస్​బుక్​ల చాలామందికి పనిచేయలేదు. దీంతో యూజర్లు పెద్ద ఎత్తున సోషల్​మీడియాలో రచ్చ చేశారు. సేవలు నిలిచిపోవడం నిజమేనని సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నట్లు అక్టోబర్​ 9 వ తేదీ 12.59 AM కి ఇన్​స్టాగ్రామ్​, ఫేస్​బుక్​లు ప్రకటన చేశాయి.  మళ్లీ రెండు గంటల తర్వాత సేవలను పునరుద్దరించారు. ఈ మేరకు ఆ సంస్థలు ప్రకటన చేశాయి. అయితే అప్పటికే చాలామంది తమ అకౌంట్లు హ్యాక్ (hack)​ అయినట్లు ఫిర్యాదులు చేయడం సంచలనం రేకెత్తించింది.



    గతంలోనే అనుమానాలు..

    కేవలం ఫేస్‌బుక్, దాని అనుబంధ సంస్థలు మాత్రమే నిలిచిపోవడం పలు ఊహాగానాలకు దారితీసింది. అయితే టెక్ నిపుణులు (Tech Experts) మాత్రం ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఈ సమస్య తలెత్తి ఉండొచ్చని అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యంగా డీఎన్ఎస్, బీజీపీ వల్ల సేవలు నిలిచిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ సమయంలో కుట్ర సిద్ధాంతకర్తలు ఇది ఒక భారీ హ్యాక్ అని ప్రచారాలు చెయ్యటం మొదలెట్టారు. అంతేకాదు, మాజీ ఫేస్‌బుక్ ఉద్యోగిని ఫ్రాన్సిస్ హౌగెన్ (37) టెక్ దిగ్గజం గురించి సంచలన విషయాలు వెల్లడించారు.



    ఫేస్‌బుక్ కావాలనే ప్రజలను పక్కదారి పట్టిస్తోందని ఆమె "సిక్స్ టీ మినిట్స్(60 Minutes) ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ద్వేషపూరిత ప్రసంగాలు, దుష్ప్రచారాలు అరికట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కూడా ఫేస్‌బుక్ పక్కదారి పట్టిస్తుందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఈ సమయంలో ఒక పాపులర్ కాన్‌స్పిరసీ థియరీ తెరపైకి వచ్చింది. దాని ప్రకారం హ్యాకింగ్ ఫోరమ్‌లో 1.5 బిలియన్ల ఫేస్‌బుక్ రికార్డులను విక్రయించారట.

    X2-ఈమెయిల్స్ అనే కంపెనీ సెప్టెంబర్ 22న ఒక సంచలన పోస్ట్‌ను షేర్ చేసింది. అందులో "ఈ ఏడాది ఫేస్‌బుక్ తమ సైట్ యూజర్ల నుంచి 1.5 బిలియన్ డేటాబేస్ కంటే ఎక్కువ సమాచారం సేకరించింది. ఈ డేటాబేస్ లో 100% ఈమెయిల్‌లు, ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయి" అని పేర్కొంది. అయితే ఇప్పుడు X2 ఈమెయిల్స్ పోస్ట్ గురించి కూడా యూజర్లు మాట్లాడుకుంటున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published: