మీరెప్పుడైనా ఎయిర్ పోర్టుకు వెళ్లారా? గేటులోంచి లోపలికి వెళ్లాలంటే టికెట్ చూపించాలి. టికెట్‌తో పాటు ఐడీ కార్డు చూపించడం తప్పనిసరి. లేకపోతే లోపలికి అనుమతించరు. ఇకపై మీరు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్తే ఐడీ కార్డ్, ఫ్లైట్ టికెట్ చూపించాల్సిన అవసరం లేకుండా లోపలికి నేరుగా వెళ్లిపోవచ్చు. మీకు అడ్డు చెప్పేవాళ్లెవరూ ఉండరు. ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో మిమ్మల్ని గుర్తిస్తారు ఎయిర్‌పోర్టు సిబ్బంది. మీరు కెమెరాకు ఫేస్ చూపిస్తే చాలు... మీ వ్యక్తిగత వివరాలతో పాటు మీ టికెట్ వివరాలు కూడా ఎయిర్‌పోర్టు సిబ్బందికి తెలిసిపోతాయి. ఇందుకోసం మీరు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అసలు ఈ ఫేస్ రికగ్నిషన్ పద్ధతి ఏంటీ? ఎలా పనిచేస్తుంది? దీని వల్ల ఉపయోగమేంటీ? తెలుసుకోండి.
Read this:
BSF Recruitment 2019: బీఎస్ఎఫ్లో 1072 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు
ఫేస్ రికగ్నిషన్... స్మార్ట్‌ఫోన్ వాడేవారికి ఈ టెక్నాలజీ గురించి బాగా తెలుసు. ఫోన్ కెమెరాకు ఫేస్ చూపిస్తే చాలు స్క్రీన్ లాక్ ఓపెన్ అవుతుంది. సరిగ్గా ఇదే టెక్నాలజీని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఇలాంటి టెక్నాలజీ ఉపయోగించిన మొదటి విమానాశ్రయంగా జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు రికార్డు సృష్టించింది. పెరుగుతున్న రద్దీతో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. మొదటి దశలో ఎయిర్‌పోర్టులోని ఉద్యోగులతో ప్రయోగాత్మకంగా ఈ టెక్నాలజీని ఉపయోగించారు. ఆ తర్వాత రెండో దశలో తరచూ ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
Read this:
SBI Gold Loan: ఎస్బీఐలో రూ.20 లక్షల వరకు గోల్డ్ లోన్... వడ్డీ రేట్లు ఇవే
ప్రయాణికులు ముందుగా ఎయిర్‌పోర్టులో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అంటే మీరు తరచూ శంషాబాద్ ఎయిర్‌పోర్టు మీదుగా రాకపోకలు సాగిస్తుంటే ఎయిర్‌పోర్టులో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేయించాలి. మీ ఐడీ కార్డు అప్లోడ్ చేయాలి. మీ ఫేస్‌ని కంప్యూటర్ స్కాన్ చేస్తుంది. మీ వివరాలు సెంట్రలైజ్డ్ రిజిస్ట్రేషన్ సిస్టమ్‌లో సేవ్ చేసి ఉంటాయి. మీ మెయిల్ ఐడీకి మీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన క్యూఆర్ కోడ్, ఫేస్ కోడ్ వస్తాయి. మీరు తర్వాత ఎయిర్‌పోర్టుకు వెళ్తే ఇ-గేట్ దగ్గర ఉండే కెమెరాకు మీ ఫేస్ చూపిస్తే చాలు... గేట్ తెరుచుకుంటుంది. అంతేకాదు... మీరు ఫ్లైట్ టికెట్ బుక్ చేసినప్పుడు ఆ వివరాలు ఎయిర్‌పోర్టుకు వెళ్తాయి. ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఫేస్-రికగ్నిషన్ టెక్నాలజీ సక్సెస్ కావడంతో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. పూర్తిస్థాయిలో అమలు చేస్తే తరచూ శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ప్రయాణించే ప్యాసింజర్లకు సెక్యూరిటీ చెకింగ్ తప్పుతుంది.
ఇవి కూడా చదవండి:
Post Office Franchise: రూ.5 వేలతో పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్... వివరాలు తెలుసుకోండి
Pan card: ఉమాంగ్ యాప్‌లో పాన్ కార్డు సేవలు... ఇలా అప్లై చేయొచ్చు
Video: దాతల నుంచి వీర్యం సేకరించడానికి మెషీన్ తయారు చేసిన చైనా కంపెనీ