Facebook New feature : ఫేస్‌బుక్‌లో న్యూ ఫీచర్.. దగ్గర్లోని ఫ్రెండ్‌ని ఇలా కలవొచ్చు..

ప్రముఖ సోషల్ మీడియా యాప్ సరికొత్త ఫీచర్స్‌ని అందుబాటులోకి తెచ్చింది. అందులో దగ్గర్లోని వైఫై, ఫ్రెండ్స్ వివరాలు తెలుసుకోవచ్చు. అదెలాగంటే..

Amala Ravula | news18-telugu
Updated: March 31, 2019, 10:27 AM IST
Facebook New feature : ఫేస్‌బుక్‌లో న్యూ ఫీచర్.. దగ్గర్లోని ఫ్రెండ్‌ని ఇలా కలవొచ్చు..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: March 31, 2019, 10:27 AM IST
ఫేస్‌బుక్.. ఈ సోషల్ నెట్ వర్కింగ్ యాప్ యూజర్స్‌కోసం రెండు కొత్త ఫీచర్లని ప్రవేశపెట్టిది. అందులో ఒకటి వైఫై గురించి తెలిపే ఆప్షన్. అదెంటంటే.. మీ ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్‌గా ఉన్న వివరాలు తెలుసుకోవచ్చు. ఫేస్‌బుక్‌లో nearby friendsఅనే సెక్షన్ ఉంటుంది. అయితే, ఇది స్మార్ట్‌ఫోన్ యూజర్లు చక్కగా వినియోగించుకోవచ్చు. ఇందులో మొదటగా తమ హ్యాండ్ సెట్‌లో నియర్ బై ఫ్రెండ్స్ ఫీచర్‌ని యాక్టివేట్ చేయాలి. ఆ తర్వాత మీరు ఏ ఫ్రెండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారిని యాడ్ చేయాలి. అయితే మనం వారు దగ్గర్లో ఉన్నప్పుడు కలుసుకోవాలనుకుంటే.. ఈ ఆప్షన్ వారు కూడా యాక్టివేట్ చేసుకుంటేనే జరుగుతుంది. ఇలా ఫ్రెండ్స్ యాక్టివేట్ చేసుకున్నప్పుడు.. ఈ ఫీచర్ టర్న్ ఆన్ చేసి ఉంటే.. మనకి ఫ్రెండ్స్ దగ్గర్లో ఉన్నప్పుడు వారి వివరాలు ఫోన్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి.
మరో ఫీచర్ ఏంటంటే..ఫైండ్ వైఫై. ఈ ఫీచర్ ద్వారా ఫేస్‌బుక్ యూజర్స్ తాము ఉన్న ప్రదేశంలో వైఫై హాట్‌స్పాట్‌లు ఎక్కడున్నాయో ఈజీగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఫేస్‌బుక్ యాప్‌లో మోర్ అనే విభాగంలో ఉండే find wifi ఆప్షన్‌ని ఎనేబుల్ చేయాలి. ఇప్పుడు ఫోన్లో ఉండే జీపీఎస్‌ని ఆన్ చేయాలి. దీంతో... యూజర్ లొకేషన్‌కి దగ్గరల్లో ఉన్న వైఫై హాట్‌స్పాట్ వివరాలు మ్యాప్స్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

First published: March 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...