హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Explainer: టెక్స్ట్‌తో 3D ఆబ్జెక్ట్స్‌ జనరేట్‌ చేస్తున్న టెక్నాలజీ..  పాయింట్-ఇ టూల్‌ డీటైల్స్‌ ఇవే..

Explainer: టెక్స్ట్‌తో 3D ఆబ్జెక్ట్స్‌ జనరేట్‌ చేస్తున్న టెక్నాలజీ..  పాయింట్-ఇ టూల్‌ డీటైల్స్‌ ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

3D ఆబ్జెక్ట్స్‌ క్రియేట్‌ చేయడం ఎంత కష్టమో అందరికీ తెలుసు. ఆయా టెక్నాలజీలపై పట్టు ఉన్న నిపుణులు మాత్రమే క్రియేట్‌ చేయగలరు. ఇది చాలా సమయంతో కూడుకున్న పని. కానీ భవిష్యత్తులో టెక్స్ట్‌తో 3D ఆబ్జెక్ట్స్‌ను క్రియేట్‌ చేసే అవకాశం ఉంది. OpenAI అనేది నాన్-ప్రాఫిట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రీసెర్చ్‌ కంపెనీ ఈ దిశగా అడుగులు వేస్తోంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

3D ఆబ్జెక్ట్స్‌ క్రియేట్‌ చేయడం ఎంత కష్టమో అందరికీ తెలుసు. ఆయా టెక్నాలజీలపై పట్టు ఉన్న నిపుణులు మాత్రమే క్రియేట్‌ చేయగలరు. ఇది చాలా సమయంతో కూడుకున్న పని. కానీ భవిష్యత్తులో టెక్స్ట్‌తో 3D ఆబ్జెక్ట్స్‌ను క్రియేట్‌ చేసే అవకాశం ఉంది. OpenAI అనేది నాన్-ప్రాఫిట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రీసెర్చ్‌ కంపెనీ ఈ దిశగా అడుగులు వేస్తోంది. ఈ కంపెనీ ఇప్పుడు ఓపెన్ సోర్స్‌డ్‌ పాయింట్-ఇ(Point-E) AI టూల్‌ ద్వారా టెక్స్ట్ ప్రాంప్ట్‌ల నుంచి 3D మోడల్స్‌ను క్రియేట్‌ చేసే అవకాశం కల్పిస్తోంది. అంటే ‘ఎర్రటి శాంటా టోపీని ధరించిన కార్గి’ లేదా ‘మల్టీకలర్ రెయిన్‌బో గుమ్మడికాయ’ వంటి టెక్స్‌ట్‌ ప్రాంప్ట్‌లను ఉపయోగించి 3D మోడల్స్‌ను క్రియేట్‌ చేయవచ్చు. ఇలా కేవలం రెండు నిమిషాల్లో 3D మోడల్స్‌ను ఎఫెక్టివ్‌గా జనరేట్ చేయవచ్చు. ఈ టెక్నాలజీ ఏంటి? పాయింట్-ఇ టూల్‌ ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం.

పాయింట్-ఇ అంటే ఏంటి?

కొన్ని రీసెర్చ్‌ పేపర్స్‌ తెలిపిన వివరాల మేరకు.. పాయింట్-ఇ అనేది కాంప్లెక్స్ ప్రాంప్ట్‌ల నుంచి 3D పాయింట్ క్లౌడ్‌లను జనరేట్‌ చేసే సిస్టమ్‌గా పేర్కొన్నారు. ఇది కాంప్లెక్స్‌ ప్రాంప్ట్‌లను ఇన్‌పుట్‌గా తీసుకొని 3D పాయింట్ క్లౌడ్స్'ని జనరేట్‌ చేసే ఓపెన్‌ సోర్స్‌డ్‌ టూల్‌. సాధారణంగా మనుషులు ఉపయోగించే వాక్యాలనే టెక్స్ట్‌ ఇన్‌పుట్‌లుగా ఇవ్వవచ్చు. పర్పుల్ ఫ్లవర్స్ వేజ్‌, ఎల్లో కలర్‌ మ్యాంగో వంటి వాక్యాలను ఇన్‌పుట్‌గా ఇచ్చి.. 3D మోడల్స్‌ పొందవచ్చు. పాయింట్ క్లౌడ్స్‌లో అవసరమైన కోఆర్డినేట్స్‌ ఉంటాయి. ఈ డేటాను ఎక్స్‌ట్రాపోలేట్ చేయడం ద్వారా 3D షేప్‌లు క్రియేట్‌ అవుతాయి. అవి 3D మోడల్స్‌ కావు, ఆకృతి, వివరాలను క్యాప్చర్ చేయవు. పాయింట్ క్లౌడ్స్ ప్రయోజనం ఏంటంటే.. తక్కువ గణన శక్తితో పని చేస్తుంది.

3D కాకపోతే, 3D ఆబ్జెక్ట్స్‌ ఎలా క్రియేట్‌ చేస్తుంది?

పాయింట్-ఇని నిర్వహించే బృందం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఉపయోగించడం ద్వారా పరిమితులను అధిగమించింది. పాయింట్ ఇతో కలిసి, డేటాను 3D మెష్‌లుగా మార్చడానికి బృందం రెండు AI మోడల్‌లకు ట్రైనింగ్‌ ఇచ్చింది. సిస్టమ్ రెండు AI మోడల్స్‌ టెక్స్ట్-టూ-ఇమేజ్, ఇమేజ్-టూ-3D ఉపయోగిస్తుంది. టూల్‌ టెక్స్ట్ ప్రాంప్ట్‌ను రీడ్‌ చేసి, వివరణకు సరిపోయే రెండరెడ్‌ ఆబ్జెక్ట్‌ను జనరేట్‌ చేస్తుంది. ఈ ప్రాపెస్‌ పూర్తయిన తర్వాత.. రెండో AI మోడల్ బాధ్యతలు తీసుకుంటుంది. డేటా ఆధారంగా పాయింట్ క్లౌడ్‌ను జనరేట్‌ చేస్తుంది. 3D మెష్‌గా కన్వెర్ట్‌ అవుతుంది. టెక్స్ట్-టూ-ఇమేజ్ మోడల్.. పదాలు, విజువల్స్ మధ్య పరస్పర సంబంధాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడేలా ట్రైనింగ్‌ పొందింది. అదే విధంగా ఇమేజ్-టూ-3D మోడల్ 3D ఆబ్జెక్ట్స్‌, ఇమేజ్‌లను ఉపయోగించడం నేర్చుకుంది.

ఈ టూల్‌ ప్రభావం 3D ఆర్టిస్టులపై ఉంటుందా?

ఇప్పటలో 3D ఆర్టిస్టులకు ఎలాంటి సమస్య లేదు. లేటెస్ట్‌ టెక్నాలజీ అవుట్‌పుట్ వంద శాతం సరైనది కాదు. పాయింట్-ఇ కొన్నిసార్లు టెక్స్ట్-టూ-ఇమేజ్ మోడల్ ద్వారా అందించిన ఇమేజ్‌ని అర్థం చేసుకోవడంలో విఫలమవుతోంది. దీని ఫలితంగా ప్రాంప్ట్‌తో సరిపోలడం లేదు. అయినా పాయింట్-ఇ ఎందుకు ఉపయోగించాలంటే.. ఇది అన్నింటికంటే వేగంగా ఉంటుంది. పాయింట్ ఇ ఉపయోగించి.. పరిశోధకులు ఒకే Nvidia V100 GPU ఉపయోగించి రెండు నిమిషాల్లో 3D మోడల్‌లను జనరేట్‌ చేయవచ్చని చెప్పారు. V100 GPU 2017లో లాంచ్‌ అయింది. అంటే కొత్త హార్డ్‌వేర్‌లో ఇంకా వేగంగా పాయింట్‌ 3 పని చేస్తుంది.

పాయింట్-ఇని ఎక్కడ ఉపయోగించవచ్చు?

పరిశోధకులు 3D ప్రింటింగ్‌కు ప్రత్యామ్నాయంగా ఈ టూల్‌ని పేర్కొంటున్నారు. రియల్‌ టైమ్‌ వరల్డ్‌ ఆబ్జెక్ట్స్‌ రూపొందించడానికి ఉపయోగించవచ్చు. 3D ఆబ్జెక్ట్ మోడలింగ్, రెండరింగ్, ప్రింటింగ్ చాలా రోజుల సమయం పట్టవచ్చు. పాయింట్-ఇ ఈ ప్రక్రియను గణనీయంగా వేగవంతం చేస్తుంది. పూర్తిగా డెవలప్‌ అయిన తర్వాత వీడియో గేమ్ డెవలప్‌మెంట్, యానిమేషన్ వర్క్‌ఫ్లోలలోకి ప్రవేశించగలదని పరిశోధకులు అంటున్నారు. ఆర్కిటెక్చరల్ ప్రివ్యూలు లేదా బిల్డింగ్‌, ల్యాండ్‌ ప్రపోజల్స్‌కు ఉపయోగపడుతుంది.

First published:

Tags: Explained

ఉత్తమ కథలు