హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Jeff Bezos: జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్ర... చిన్ననాటి కలను నెరవేర్చుకోనున్న కుబేరుడు

Jeff Bezos: జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్ర... చిన్ననాటి కలను నెరవేర్చుకోనున్న కుబేరుడు

Jeff Bezos: జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్ర... చిన్ననాటి కలను నెరవేర్చుకోనున్న కుబేరుడు
(ప్రతీకాత్మక చిత్రం)

Jeff Bezos: జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్ర... చిన్ననాటి కలను నెరవేర్చుకోనున్న కుబేరుడు (ప్రతీకాత్మక చిత్రం)

Jeff Bezos | అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ త్వరలో అంతరిక్ష యాత్రకు వెళ్లనున్నారు. ఎందుకో తెలుసుకోండి.

ప్రపంచ కుబేరుల్లో ఒకరు, అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ అంతరిక్షానికి వెళ్లనున్నారు. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌ను ప్రపంచ దేశాలకు విస్తరించి, గుర్తింపు సాధించారు బెజోస్. ఆ తరువాత ఇతర వ్యాపారాల్లోకి అడుగుపెట్టి విజయవంతమయ్యారు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాలో బెజోస్ రెండో స్థానంలో ఉన్నారు. ఆయన నికర సంపద విలువ 185 బిలియన్ డాలర్ల వరకు ఉంది. తన సొంత అంతరిక్ష ప్రయోగ సంస్థ బ్లూ ఆరిజిన్ చేపట్టిన ప్రాజెక్టులో ఆయన భాగం కానున్నారు. వచ్చే నెలలో ఈ సంస్థ అభివృద్ధి చేసిన న్యూ షెపర్డ్ వ్యోమనౌకలో బెజోస్ అంతరిక్షయానానికి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు వెనుక ఉద్దేశం, అంతరిక్ష ప్రయోగాల్లో సంస్థల మధ్య పోటీ.. తదితర విషయాల గురించి తెలుసుకుందాం.

బెజోస్ అంతరిక్షంలోకి ఎందుకు వెళ్తున్నారు?


అంతరిక్ష ప్రయోగాల కోసం బెజోస్ స్థాపించిన బ్లూ ఆరిజిన్ సంస్థ.. ఈ యాత్రకు సర్వం సిద్ధం చేసింది. సంస్థ అభివృద్ధి చేసిన న్యూ షెపర్డ్ వ్యోమనౌకలో బెజోస్ అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. కేవలం విహార యాత్రలో భాగంగానే ఆయన స్పేస్‌కు వెళ్లనున్నారు. ఇది న్యూ షెపర్డ్ రాకెట్, క్యాప్సూల్‌తో బ్లూ ఆరిజిన్ చేపడుతున్న మొదటిసారి మానవ సహిత యాత్ర కావడం విశేషం. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని ప్రయోగాలను బ్లూ ఆరిజిన్ పూర్తి చేసింది. వచ్చే నెలలో ఈ వ్యోమనౌక అంతరిక్షానికి వెళ్లనుంది.

ఈ వ్యోమనౌకను ఇప్పటికే 15 సార్లు పరీక్షించారు. కానీ మనుషులను తీసుకెళ్లకుండా కేవలం టెస్టింగ్ కోసమే దీన్ని ప్రయోగించారు. అయితే జులై 20న జరగనున్న అంతరిక్ష ప్రయాణంలో, బెజోస్‌తో పాటు అతడి సోదరుడు మార్క్, వేలంలో మరో సీటు దక్కించుకున్న వ్యక్తి.. ముగ్గురు కలిసి వెళ్లనున్నారు. అదనంగా ముగ్గురు సిబ్బంది ఉంటారు. మూడో సీటు కోసం నిర్వహించిన వేలానికి భారీ స్పందన వచ్చింది. దీనికి ప్రపంచవ్యాప్తంగా 5,000 బిడ్లు వచ్చాయని బ్లూ ఆరిజిన్ తెలిపింది. ప్రస్తుతం అత్యధిక బిడ్ 2.8 మిలియన్ డాలర్ల వరకు వెళ్లింది. అయితే ఇంత మొత్తంలో బిడ్ వేసిన వారి పేర్లను బ్లూ ఆరిజిన్ వెల్లడించలేదు.

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ సేల్... ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై రూ.6,000 వరకు డిస్కౌంట్

Realme X7 Max 5G: రూ.26,999 విలువైన స్మార్ట్‌ఫోన్‌ను రూ.12,399 ధరకే కొనండి

బెజోస్ ప్రయాణించనున్న వ్యోమనౌక ప్రతేకత ఏంటి?


బెజోస్ బృందాన్ని అంతరిక్షంలోకి తీసుకువెళ్లనున్న న్యూ షెపర్డ్ స్పేస్ క్రాఫ్ట్.. రాకెట్, క్యాప్సూల్ రెండింటినీ కలిగి ఉంటుంది. అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి అమెరికన్ వ్యోమగామి అలెన్ షెపర్డ్ పేరుమీదుగా, దీనికి న్యూ షెపర్డ్ అనే పేరు పెట్టారు. ఈ రాకెట్ 60 అడుగుల పొడవు ఉంటుంది. ఇది ఆరుగురు ప్రయాణికులను భూమి నుంచి 62 మైళ్ల (100 కి.మీ) కంటే ఎక్కువ ఎత్తుకు తీసుకెళ్లనుంది. ఈ క్రమంలో భూమి ఉప కక్ష్యను దాటి, అంతరిక్షంలోకి వారిని తీసుకెళ్లనుంది.

బ్లూ ఆరిజిన్ న్యూ గ్లెన్ పేరుతో మరో వ్యోమనౌకను సైతం రూపొందించింది. అమెరికా వ్యోమగామి జాన్ గ్లెన్ గౌరవార్థం దీనికి ఆ పేరు పెట్టారు. న్యూ గ్లెన్ ఏకంగా 270 అడుగుల పొడవు ఉంటుంది. ఇది అతి తక్కువ ఖర్చుతో పెద్ద పేలోడ్‌లను కక్ష్యలోకి తీసుకెళ్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం కుబేరులు ఇలాంటి వాటినే భవిష్యత్తు వ్యాపార మార్గాలుగా ఎంచుకుంటున్నారు. న్యూ గ్లెన్, న్యూ షెపర్డ్ రెండూ నిలువుగా టేకాఫ్, నిలువుగా ల్యాండింగ్ అవుతాయి. వీటిని పునర్వినియోగానికి పనికొచ్చేలా రూపొందించారు.

Best 5G Smartphones: రూ.20,000 లోపు బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే

Best Smartphones Under Rs 20,000: కొత్త మొబైల్ కొంటున్నారా? రూ.20,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే

స్పేస్ క్రాఫ్ట్ నుంచి ప్రయాణికులు ఏం చూస్తారు?


న్యూ షెపర్డ్‌ అంతరిక్ష యాత్ర 11 నిమిషాల పాటు కొనసాగుతుంది. అంతరిక్షంలోకి వెళ్లిన బృందం బరువులేని స్థితిని అనుభూతి చెందడంతో పాటు అక్కడి నుంచి భూమి అందాలను, అంతరిక్ష ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. యాత్ర ముగిసిన తరువాత క్యాప్సూల్ పారాచూట్ల సాయంతో భూమికి తిరిగి వస్తుంది. ఈ క్యాప్సూల్‌లో ఆరు అబ్జర్వేషన్ విండోలు ఉన్నాయి.

బెజోస్‌ కాకుండా ఇలాంటి యాత్రలపై ఆసక్తి చూపే కుబేరులు ఎవరు?


బ్రిటీష్ బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్.. వర్జిన్ గెలాక్టిక్ పేరుతో స్పేస్ ఫ్లైట్ కంపెనీని స్థాపించారు. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సైతం మనుషులను అతి తక్కువ ధరకే అంతరిక్షంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో స్పేస్ఎక్స్ కంపెనీని స్థాపించారు. అయితే వీరిద్దరికంటే ముందే తన సొంత స్పేస్ కంపెనీ రూపొందించిన వ్యోమనౌకలో బెజోస్ అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. దీంతో ఈ ఘనత సాధించిన మొదటి బిలియనీర్‌గా ఆయన నిలువనున్నారు. తనకు ఐదేళ్లు వచ్చినప్పటి నుంచే అంతరిక్షంలోకి వెళ్లాలని కలలు కన్నట్లు బెజోస్ తెలిపారు. ఈ అంతరిక్ష యాత్ర గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పోస్టులో ఇలా చెప్పారు.

జపాన్ బిలియనీర్ యుసాకు మేజావా ఏకంగా రెండుసార్లు అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కజకిస్థాన్‌లోని బైకొనూర్ కాస్మోడ్రోమ్ నుంచి రష్యాకు చెందిన సోయుజ్ అంతరిక్ష నౌకలో ఆయన ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌కు వెళ్లనున్నారు. ఈ ప్రయాణం 2021 డిసెంబర్‌లో జరగనుంది. ఆ తరువాత 2023లో.. స్పేస్‌ఎక్స్ సంస్థకు చెందిన స్టార్‌షిప్ వ్యోమనౌకలో చంద్రుని చుట్టూ ఒక రౌండ్ యాత్ర చేపట్టనున్నారు.

ఇలాంటి అంతరిక్ష యాత్రలు సురక్షితమేనా?


అంతరిక్ష యాత్రికులకు ఐదు రకాల ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉందని చెబుతోంది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా. రేడియేషన్, ఒంటరితనం (ఐసోలేషన్), నిర్బంధం (కన్‌ఫైన్మెంట్), భూమి నుంచి దూరంగా ఉన్నామనే ఆందోళన, గురుత్వాకర్షణ లోపాలు, ఇరుకైన వాతావరణంలో ఉన్నామనే ఆందోళన.. వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. ఇవి మానవ శరీరంపై మరిన్ని ప్రతికూల ప్రభావాలను పెంచుతాయని నాసా ప్రకటించింది. ఇలాంటి సమస్యలను విశ్లేషించి, వాటిని తగ్గించే వ్యవస్థలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉంటాయని నాసా తెలిపింది.

అంతరిక్ష యాత్రలకు ఇన్సూరెన్స్ ఉంటుందా?


అంతరిక్ష ప్రయాణాలకు ఇన్సూరెన్స్ సదుపాయంపై కంపెనీలు స్పష్టత ఇవ్వలేదు. అంతరిక్ష ప్రయాణానికి సంబంధించిన నియమ, నిబంధనలను బీమా సంస్థలు ఇంకా రూపొందించలేదు. ఒకవేళ ప్రయాణాల్లో నిర్లక్ష్యం, కావాలని చేసే తప్పుల కారణంగా ప్రాణనష్టం జరిగితే.. బాధిత కుటుంబాలకు ఇన్సూరెన్స్ కంపెనీలు ఫైనాన్షియల్ రికవరీ ఇచ్చేందుకు ఒప్పుకోకపోవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Amazon, Jeff Bezos, Space

ఉత్తమ కథలు