హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Explainer: సోషల్ మీడియా బాధ్యతాయుతంగా ఉండాల్సిందే... కొత్త నిబంధనలివే

Explainer: సోషల్ మీడియా బాధ్యతాయుతంగా ఉండాల్సిందే... కొత్త నిబంధనలివే

Explainer: సోషల్ మీడియా బాధ్యతాయుతంగా ఉండాల్సిందే... కొత్త నిబంధనలివే
(ప్రతీకాత్మక చిత్రం)

Explainer: సోషల్ మీడియా బాధ్యతాయుతంగా ఉండాల్సిందే... కొత్త నిబంధనలివే (ప్రతీకాత్మక చిత్రం)

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లోని సెక్షన్ 79 ప్రకారం యూజర్ జనరేటర్ కంటెంట్ ని పోస్ట్ చేసే సంస్థలు లేదా యాప్స్ ప్రస్తుతం ఉన్న నియమ నిబంధనలన్నీ పాటిస్తే సరిపోతుంది.

సుప్రీం కోర్టు అందించిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటూ.. సోషల్ మీడియాలో జరిగే వేధింపుల గురించి తాజాగా పార్లమెంట్ లోనూ జరిగిన చర్చను ఆధారంగా చేసుకొని ప్రభుత్వం కొత్త నియమాలను ప్రకటించింది. వీటి ద్వారా సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేయకుండా కట్టుదిట్టం చేసినట్లైంది. సోషల్ మీడియా, డిజిటల్ న్యూస్ మీడియా లతో పాటు ఓటీటీ (ఓవర్ ద టాప్) ప్రొవైడర్లకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలకు గాను ఇంటర్మీడియట్ గైడ్ లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రూల్స్ ని స్పెషల్ గా ప్రకటించనున్నారు. ఆన్ లైన్ న్యూస్, మీడియా ప్లాట్ ఫాంలకు, సంప్రదాయ మీడియాకి కూడా వీటిని వర్తిస్తూ అవన్నీ ఈ నిబంధనలను పాటిస్తున్నాయా? లేదా? అని చెక్ చేసేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది.

ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా కేంద్ర ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ 2018, 2019 లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుల గురించి చెబుతూ 2018, 2020లో రాజ్య సభలో జరిగిన చర్చ గురించి కూడా వివరించారు. రాజ్య సభ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ ముసాయిదా రూపొందించామని ఆయన వెల్లడించారు. డిజిటల్ ప్లాట్ ఫాంలను ఉపయోగించే సాధారణ యూజర్లు కూడా తమ హక్కులను తెలుసుకొని ఒకవేళ తమకు ఏదైనా సమస్య ఎదురైతే లేదా తమ హక్కులకు భంగం కలిగితే వెంటనే ఆ సమస్యకు పరిష్కారం దొరికే దిశగా వారు అడుగులు వేసేందుకు తాజా నియమ నిబంధనలు ఉపయోగపడతాయని వెల్లడించారు.

ఈ నియమ నిబంధనలను పక్కాగా రూపొందించేందుకు ప్రభుత్వం మూడు సంవత్సరాల నుంచి పనిచేస్తోంది. అయితే జనవరి 26న ఎర్ర కోట వద్ద జరిగిన హింసాత్మక సంఘటనలు, ఆ తర్వాత సమాచార నియంత్రణపై ట్విట్టర్ తో వివాదం తలెత్తిన నేపథ్యంలో దీన్ని మరింత వేగంగా తీసుకువచ్చే ప్రయత్నం చేసిందని చెప్పవచ్చు.

WhatsApp: వాట్సప్ స్టేటస్ వాడేవారికి గుడ్ న్యూస్... ఈ కొత్త ఫీచర్ మీకోసమే

Apple iPhone 12 Pro Max: షాక్... యాపిల్ ఫోన్ ఆర్డర్ చేస్తే పార్శిల్‌లో యాపిల్ డ్రింక్ వచ్చింది

ముఖ్యమైన నియమ నిబంధనలివే..


ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లోని సెక్షన్ 79 ప్రకారం యూజర్ జనరేటర్ కంటెంట్ ని పోస్ట్ చేసే సంస్థలు లేదా యాప్స్ ప్రస్తుతం ఉన్న నియమ నిబంధనలన్నీ పాటిస్తే సరిపోతుంది. యూజర్లు పోస్ట్ చేసిన కంటెంట్ పై వారికి బాధ్యత ఉండదు. అయితే ఈ సంస్థలు యూజర్లు చేసే పోస్టులను ఎప్పటికప్పుడు గమనిస్తూ హానికరమైన వాటిని తొలగించాలని లేదంటే వారికి అందజేసిన సేఫ్ హార్బర్ ని తొలగించాల్సి ఉంటుందని వెల్లడించారు. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్ వంటి సంస్థలన్నింటికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఈ సంస్థలన్నీ ఫిర్యాదుల పరిష్కార విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలని.. యూజర్ల నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు వాటిని పరిష్కరించేందుకు ఓ ప్రత్యేక వ్యవస్థను ప్రారంభించాలని వెల్లడించారు. సోషల్ మీడియా యాప్స్ అన్నీ ఓ గ్రీవెన్స్ ఆఫీసర్ ని ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ వ్యక్తి కంప్లైట్ స్వీకరించిన 24 గంటల్లో దాన్ని గుర్తించి ఫిర్యాదు చేసిన వారికి చెప్పాలని.. 15 రోజుల్లోపు ఆ ఫిర్యాదును పరిష్కరించాలని నిబంధన విధించారు.

ప్రతి సోషల్ మీడియా నిబంధనల్లో వెల్లడించిన పది రకాల కంటెంట్ కి సంబంధించిన పోస్టులను తప్పక తొలగించాల్సి ఉంటుంది. వీటిలో భాగంగా దేశ సమగ్రత, శాంతి భద్రతలు, సార్వభౌమత్వం, విదేశాలతో సంబంధాలు, ఇతర దేశాలను అవమానించడం, నేరాలకు పాల్పడేందుకు ప్రోత్సహించే చర్యలు, ఒక వ్యక్తి లేదా ప్రభుత్వాన్ని కించపర్చేలా మాట్లాడడం, అసభ్యకరమైన కంటెంట్, లింగ ద్వేషం రెచ్చగొట్టే పోస్టులు, ఇతరుల ప్రైవసీని దెబ్బ తీసే కంటెంట్, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడేలా ప్రోత్సహించడం, జాతి, మతం, రంగును అవమానించడం, భారతీయ చట్టాలలో నేరంగా వెల్లడించిన పనులను ప్రోత్సహించే కంటెంట్ వంటివి ఎవరైనా పోస్ట్ చేస్తే వాటిని తొలగించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం కోరితే ఆ సమాచారాన్ని మొదట పోస్ట్ చేసిన వ్యక్తి వివరాలను కూడా వెల్లడించాల్సి ఉంటుంది. ఇలాంటి కంటెంట్ కి సంబంధించి రూల్స్ ప్రతి కేసులో విభిన్నంగా ఉన్నా.. ప్రభుత్వం కోరగానే సోషల్ మీడియా వెబ్ సైట్లు ఆయా కంటెంట్ వివరాలను 36 గంటల్లోగా తొలగించాల్సి ఉంటుంది.

Best 5G Smartphones: కొత్త మొబైల్ కొంటున్నారా? రూ.20,000 లోపు 5జీ స్మార్ట్‌ఫోన్స్ ఇవే

Paytm: మీ ఇంటి అద్దె చెల్లిస్తే రూ.1,000 క్యాష్‌బ్యాక్... పేటీఎం ఆఫర్

సోషల్ మీడియా సంస్థలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..


ఫిర్యాదుల పరిష్కారానికి గ్రీవెన్స్ ఆఫీసర్ ని నియమించడంతో పాటు ఛీప్ కాంప్లయన్స్ ఆఫీసర్ ని కూడా నియమించుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యక్తి భారత్ లోనే నివసించాల్సి ఉంటుంది. తమ సోషల్ మీడియా ప్లాట్ ఫాం భారత ప్రభుత్వం విధించిన నిబంధలన్నింటినీ పాటిస్తుందా? లేదా? అని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత వీరిదే. చట్టాన్ని అమలు పరిచే లా ఎన్ ఫోర్స్ మెంట్ ఎజెన్సీలతో మాట్లాడేందుకు 24×7 అందుబాటులో ఉండే ఓ నోడల్ ఆఫీసర్ ని కూడా నియమించుకోవాల్సి ఉంటుంది. ప్రతి నెలా ప్రతి ప్లాట్ ఫాం మంత్లీ కంప్లయన్స్ రిపోర్ట్ ని పబ్లిష్ చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఆ నెలలో వారికి ఎన్ని ఫిర్యాదుల అందాయి. వాటి లో ఎన్ని పరిష్కరించారు అన్న వివరాలతో పాటు ఆయా సంస్థలు స్వచ్ఛందంగా నిబంధనల మేరకు ఎలాంటి, ఎన్ని పోస్టులను తొలగించారు అన్న వివరాలను కూడా అందులో పొందుపర్చాల్సి ఉంటుంది. ఈ నిబంధనలన్నీ ఫిబ్రవరి 25 2021 నుంచే అమల్లోకి రానుండగా.. కంపెనీలు వ్యక్తులను నియమించుకొని ఈ పద్ధతులన్నీ ప్రారంభించేందుకు మూడు నెలల సమయాన్ని అందించనున్నారు.

సోషల్ మీడియా సంస్థలు ఈ నిబంధనల్లో ఏది పాటించకపోయినా అవి సేఫ్ హార్బర్ ని కోల్పోతాయి. అప్పటికి అమల్లో ఉన్న చట్టాల ప్రకారం వాటిపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఇందులో భాగంగా డాక్యుమెంట్లను తారుమారు చేయడం, కంప్యూటర్లను హాక్ చేయడం, ఆన్ లైన్ లో తప్పుడు సమాచారం అందించడం, సమాచార గోప్యత, మోసపూరిత ప్రయోజనాల కోసం సమాచారాన్ని ఉపయోగించడం వంటి వాటికి శిక్షలు ఉంటాయి. ఈ శిక్షలు మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకూ ఉండడంతో పాటు రెండు లక్షలు అంతకంటే ఎక్కువ ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ నిబంధనలు పాటించని సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్స్ కి కూడా ఏడేళ్ల పాటు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. ఐటీ యాక్ట్ లో ని సెక్షన్ 66 ప్రకారం ఒక వ్యక్తి అనుమతి లేకుండా వారి కంప్యూటర్ లేదా నెట్ వర్క్ లోకి చొరబడి వారి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడం లేదా మార్చడం వంటివి చేస్తే ఐదు లక్షల ఫైన్, మూడేళ్ల పాటు జైలు శిక్ష లేదా రెండూ ఉండొచ్చు.

BSNL Broadband Plans: బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ వాడుతున్నవారికి గుడ్ న్యూస్

Moto E7 Power: మోటో ఈ7 పవర్ సేల్ మొదలైంది... భారీ బ్యాటరీతో మరెన్నో ప్రత్యేకతలు

ఓటీటీ ప్లాట్ ఫాంలలో విభజన ఇలా..


యూట్యూబ్, నెట్ ఫ్లిక్స్ లాంటి ఓటీటీ ప్లాట్ ఫాంలకు కూడా ప్రభుత్వం వేరుగా నిబంధనలను సిద్ధం చేసింది. ఈ ప్లాట్ ఫాంలు తమ కంటెంట్ ని ఐదు రకాలుగా సెల్ఫ్ క్లాసిఫై చేసి కంటెంట్ ని ఐదు కేటగిరీల్లో విభజించాల్సి ఉంటుంది. వయసుల ప్రకారం వాటిని అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. పిల్లలతో పాటు కుటుంబమంతా చూడగలిగిన కంటెంట్ ని “U” కేటగిరీ గా.. ఏడు సంవత్సరాల వయసు కంటే ఎక్కువున్న వారు ఒంటరిగా.. అంతకంటే చిన్న పిల్లలు పెద్దవారి పర్యవేక్షణలో చూడదగిన కంటెంట్ ని “U/A 7+” గా విభజించాలి. అలాగే పదమూడు సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వారు చూడగలిగే కంటెంట్ ని “U/A 13+”గా, 16 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వారు మాత్రమే చూడగలిగే కంటెంట్ ని “U/A 16+”గా విభజించాలి. ఈ కంటెంట్ ని అంతకంటే చిన్న పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూసే వీలుంటుంది. ఇక పెద్దవారు మాత్రమే చూడగలిగే కంటెంట్ ని “A” రేటింగ్ తో విభజించాల్సి ఉంటుంది. చివరి మూడింటికీ పేరెంటల్ లాక్స్ విధానాన్ని కూడా కొనసాగించాల్సి ఉంటుంది.

First published:

Tags: Facebook, Ott, Social Media, Twitter

ఉత్తమ కథలు