హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Explained: 5G సేవలు ప్రారంభించిన ప్రధాని మోదీ.. 5జీ అభివృద్ధి, అమలుకు సంబంధించిన అసలు విషయాలివే..

Explained: 5G సేవలు ప్రారంభించిన ప్రధాని మోదీ.. 5జీ అభివృద్ధి, అమలుకు సంబంధించిన అసలు విషయాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈరోజు న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ప్రధాని మోదీ 5G సేవలను ప్రారంభించారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఆరో ఎడిషన్‌లో భారతదేశం టెక్నాలజీ రంగంలో కొత్త శకం మొదలైంది. ఇండియాలో తొలుత 13 నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ఈరోజు న్యూఢిల్లీలోని (New Delhi) ప్రగతి మైదాన్‌లో ప్రధాని మోదీ 5G సేవలను (5G Services) ప్రారంభించారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఆరో ఎడిషన్‌లో భారతదేశం టెక్నాలజీ రంగంలో కొత్త శకం మొదలైంది. ఇండియాలో తొలుత 13 నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ జాబితాలో ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, చండీగఢ్, గురుగ్రామ్, హైదరాబాద్, లక్నో, పూణే, గాంధీనగర్, అహ్మదాబాద్, జామ్‌నగర్ ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 5జీ సేవల అంశంలో జరిగిన పురోగతి, ఇండియాలో (India) జరిగిన పరిణామాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వడివడిగా అడుగులు

5జీ సేవలు ప్రారంభించడంలో కేంద్రం వడివడిగా అడుగులు వేసింది. కేంద్రం ఇటీవల నిర్వహించిన 5జీ స్పెక్ట్రం వేలానికి మంచి స్పందన లభించింది. ఆగస్టు 1న ముగిసిన 5G వేలంలో 4G, 5G బ్యాండ్‌లలో (మొత్తం 51.27 GHz) ఎయిర్‌వేవ్‌లను మొత్తం రూ.1.5-లక్ష కోట్లకు కేంద్రం విక్రయించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి మోదీ మాట్లాడుతూ.. త్వరలో భారత్‌లో 5జీ సేవలను ప్రారంభిస్తామని చెప్పారు. ఇటీవల ఓ కార్యక్రమంలో కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ అక్టోబరు 12 నాటికి 5G సేవలను ప్రారంభించాలని ఆశిస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతరాయం లేని సేవలు అందించే పనుల్లో టెలికాం ఆపరేటర్లు నిమగ్నమై ఉన్నారని, ప్రధాన నగరాల్లో ఇన్‌స్టాలేషన్‌లు జరుగుతున్నాయని చెప్పారు. 5G ప్రాముఖ్యత, వివాదాల గురించి తెలుసుకోవాల్సిన అంశాలు ఇవే..

5G Services: 5జీ సేవలు ప్రారంభం... హైస్పీడ్ నెట్వర్క్‌పై మీ సందేహాలకు సమాధనాలివే

5G అంటే ఏమిటి?

లాంగ్‌ టర్మ్‌ ఎవల్యూషన్‌(LTE) మొబైల్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ నెట్‌వర్క్స్‌లో 5G లేదా ఐదో తరం టెక్నాలజీ లేటస్ట్‌ అప్‌గ్రేడ్‌.

యూఎస్‌ బేస్డ్‌ సెమీకండక్టర్స్, వైర్‌లెస్ టెక్ మేజర్ క్వాల్‌కామ్‌ ప్రకారం.. 5G గ్లోబల్‌ వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌తో డేటా స్పీడ్‌ పెరుగుతుందని, విశ్వసనీయత, నెట్‌వర్క్ సామర్థ్యం పెరుగుతాయని తెలిపింది. హిందుస్థాన్ టైమ్స్ ప్రకారం.. 5G సేవలు గరిష్టంగా సెకనుకు 20 GBPS లేదా గిగాబైట్ల వరకు, యావరేజ్‌గా సెకనుకు 100+ MBPS లేదా మెగాబైట్‌ల డేటా ట్రాన్స్‌ఫర్‌ రేటును అందజేస్తాయి.

5G Mobile Gaming: 5Gతో ఇండియాలో మొబైల్ గేమింగ్ రంగం పరుగులు.. పూర్తి వివరాలివే..

ఇది ఎలా పని చేస్తుంది?

5G లో, మీడియం, హై ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రంలలో పని చేస్తుంది.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రకారం.. లో బ్యాండ్ స్పెక్ట్రం ఇంటర్నెట్, డేటా ట్రాన్స్‌ఫర్, స్పీడ్‌ విషయంలో బెస్ట్‌ సర్వీస్‌ అందిస్తుంది. వేగం 100 Mbps (సెకనుకు మెగాబిట్స్)కి పరిమితం. టెల్కోలు హై స్పీడ్‌ ఇంటర్నెట్, నిర్దిష్ట డిమాండ్లు లేని వాణిజ్య సెల్‌ఫోన్ వినియోగదారుల కోసం దీనిని ఉపయోగించుకోవచ్చు. పరిశ్రమ ప్రత్యేక అవసరాలకు లో బ్యాండ్ స్పెక్ట్రమ్ సరైనది కాకపోవచ్చు.

మిడ్-బ్యాండ్ స్పెక్ట్రమ్, లో బ్యాండ్‌తో పోలిస్తే అధిక వేగాన్ని అందిస్తుంది. కవరేజ్‌, సిగ్నల్స్‌ అందే పరంగా లిమిటేషన్స్‌ ఉండవచ్చు. 5Gలో ముందంజలో ఉన్న టెల్కోలు, కంపెనీలు, ఈ బ్యాండ్‌ను పరిశ్రమలు, ప్రత్యేక ఫ్యాక్టరీ యూనిట్లు నిర్దిష్ట పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా రూపొందించే క్యాప్టివ్ నెట్‌వర్క్‌లను నిర్మించడానికి ఉపయోగించవచ్చు. హై-బ్యాండ్ స్పెక్ట్రమ్ మూడు బ్యాండ్‌ల కంటే అత్యధిక వేగాన్ని అందిస్తుంది. కవరేజ్, సిగ్నల్ పెనిట్రేషన్ శక్తి ఉంటుంది.

భారతదేశంలోని ఆపరేటర్లు, ధరలు

ఈ ఏడాది 5G స్పెక్ట్రమ్ వేలంలో రూ.88,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన బ్యాండ్‌లను రిలయన్స్ జియో సొంతం చేసుకుంది. దీపావళి నాటికి 5G నెట్‌వర్క్‌లో హై-స్పీడ్ మొబైల్ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆగస్టులో తెలిపింది. వేలంలో రెండో స్థానంలో ఉన్న భారతీ ఎయిర్‌టెల్ 2023 చివరి నాటికి దేశంలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో 5G అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. వోడాఫోన్ ఐడియా (VI) కూడా తన 5G సేవలను త్వరలో ప్రారంభించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది.

స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేయడానికి కంపెనీ ఎక్కువ మొత్తాన్ని వెచ్చించిందని, 5G సేవలకు ప్రీమియం వసూలు చేయాల్సిన అవసరం ఉందని వొడాఫోన్ ఐడియా (VIL) మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రవీందర్ టక్కర్ తెలిపారు.

రిలయన్స్ ఛైర్మన్‌ ముఖేష్ అంబానీ యాన్యువల్‌ జనరల్‌ మీటింగ్‌లో మాట్లాడుతూ.. 5G కేవలం కొందరికే పరిమితం కాకూడదని, అందరికీ అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఇప్పటివరకు టెల్కోలు డేటా రేట్లపై సరైన స్పష్టత ఇవ్వలేదు.

ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని చెబుతున్న నిపుణులు

5G నెట్‌వర్క్ టవర్‌లు వల్లే కరోనా వైరస్‌ వ్యాప్తి జరుగుతోందనే ప్రచారాలు కూడా జరిగాయి. సోషల్‌ మీడియాలో దీనికి సంబంధించిన పోస్ట్‌లు వైరల్‌ అయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్‌సైట్‌లోని ప్రకటనలో.. ‘మొబైల్ ఫోన్‌లు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయో? లేదో? అంచనా వేయడానికి గత రెండు దశాబ్దాలుగా పెద్ద సంఖ్యలో అధ్యయనాలు జరిగాయి. ఈ రోజు వరకు, మొబైల్ ఫోన్ వాడకం వల్ల ఎటువంటి ప్రతికూల ఆరోగ్య ప్రభావాలు ఏర్పడినట్లు నిర్ధారించబడలేదు.’ అని తెలిపింది.

అయితే ఇప్పటివరకు 5G ​​ఉపయోగించే ఫ్రీక్వెన్సీలపై కొన్ని అధ్యయనాలు మాత్రమే జరిగాయని పేర్కొంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఫీల్డ్‌లు, మానవ శరీరం మధ్య పరస్పర చర్యలకు టిఫ్యూ హీటింగ్‌ ప్రధాన విధానమని, ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానాల నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ ఎక్స్పోజర్ స్థాయిలు మానవ శరీరంలో అతితక్కువ ఉష్ణోగ్రత పెరుగుదలకు కారణమవుతాయని స్పష్టం చేసింది.

5Gపై వివాదాలు

యూఎస్‌లో జనవరిలో 5G సేవల ప్రారంభంతో చాలా ఎయిర్‌లైన్స్‌ తమ విమాన సర్వీసులను రద్దు చేశాయి. వేలాది మంది ప్రయాణీకులకు సమస్యలు ఎదురయ్యాయి. ప్రో పబ్లికా ప్రకారం.. కొత్త సి-బ్యాండ్ నెట్‌వర్క్‌ల 5G సిగ్నల్‌లు విమాన భద్రతా పరికరాలకు ఆటంకం కలిగిస్తాయని విమానయాన సంస్థలు హెచ్చరించాయని తెలిపింది. దీనివల్ల జెట్‌లైనర్లు ఆకాశంలో ప్రయాణిస్తున్నప్పుడు సమస్యలు ఎదుర్కొంటాయని, రన్‌వే చివరిలో వేగం తగ్గిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది.

ఆ తర్వాత జరిగిన చర్యలతో సమస్య తీరింది. 87 విమానాశ్రయాల రన్‌వేల దగ్గర 600 కంటే ఎక్కువ 5G ట్రాన్స్‌మిషన్ టవర్‌లను ఆన్ చేయకూడదని, మిగతా వాటి శక్తిని తగ్గించడానికి వెరిజోన్, AT&T అంగీకరించాయి. జులై 5న ఆరు నెలల బఫర్ ముగిసిన తర్వాత 5G సాంకేతికత విమాన పరికరాలకు అంతరాయం కలిగించకుండా ఎలా చూసుకోవాలో చర్చించడానికి FAA సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సాంకేతిక సవాళ్లను పరిష్కరించడానికి సహకారం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలిపారు.

Published by:Nikhil Kumar S
First published:

Tags: 5G, 5g technology, New Delhi

ఉత్తమ కథలు