Home /News /technology /

EXCLUSIVE FACEBOOK AND INSTAGRAM TO TEMPORARILY ALLOW CALLS FOR VIOLENCE AGAINST RUSSIANS GH VB

Exclusive: రష్యా సైనికులపై హింసకు పిలుపునిచ్చేందుకు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ అనుమతి.. ఎదురవుతున్న వ్యతిరేకత..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఉక్రెయిన్‌ (Ukraine)పై యుద్ధం (War) కొనసాగుతున్న సమయంలో ఫేస్‌బుక్‌(Facebook), ఇన్‌స్టాగ్రామ్‌(Instagram) కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. రష్యా సైనికులు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై హింసకు పిలుపునిచ్చే పోస్టులకు ఈ రెండు ప్లాట్‌ఫారమ్‌లు తాత్కాలికంగా అనుమతి కల్పించాయి.

ఇంకా చదవండి ...
ఉక్రెయిన్‌ (Ukraine)పై యుద్ధం (War) కొనసాగుతున్న సమయంలో ఫేస్‌బుక్‌(Facebook), ఇన్‌స్టాగ్రామ్‌(Instagram) కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. రష్యా సైనికులు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై హింసకు పిలుపునిచ్చే పోస్టులకు ఈ రెండు ప్లాట్‌ఫారమ్‌లు తాత్కాలికంగా అనుమతి కల్పించాయి. దీంతో ఈ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దురాక్రమణకు వ్యతిరేకంగా యూఎస్‌, యూరోపియన్‌ దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ తరుణంలో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ చర్యలు విమర్శలకు తావిస్తున్నాయి. హింస, అల్లర్లను రేకెత్తించడంలో భాగం కాకుండా ఉన్న పాలసీ(Policy) నియమాలను పక్కనపెట్టి ఈ రెండు సంస్థలు వ్యవహరిస్తున్నాయి. రష్యాపై(Russia) వ్యతిరేకత వ్యక్తం చేసేందుకు పలు దేశాల ప్రజలకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో పాలసీలను పక్కనపెట్టాయి.

Application Invited: వాళ్లు ఏడాదికి రూ.60 వేలు పొందే అవకాశం.. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 15.. వివరాలివే..


రష్యా సైనికులు, రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై హింసాత్మక వ్యాఖ్యలు చేసేందుకు అనుమతి కల్పిస్తున్నాయి. అయితే బాధిత దేశాల ప్రజల భావాలను బయటకు చెప్పేందుకే అనుమతి కల్పించామని ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ అంటున్నాయి. రష్యా పౌరులపై హింస తమ ఉద్దేశం కాదని కూడా చెబుతున్నాయి. గురువారం రాయిటర్స్‌ సంస్థ ఓ ప్రకటనలో.. ‘న్యూస్‌ వైర్‌ సర్వీసుల ద్వారా కొన్ని అంతర్గత ఈ-మెయిళ్లలోని సమాచారం తెలిసింది.

ఆ మెయిళ్లలోని సమాచారం మేరకు రష్యా సైనికులపై హింసకు పిలుపునిచ్చేందుకు కాల్‌ చేసుకొనే సదుపాయం కల్పిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ సదుపాయం రష్యా సైనికులకు లేదు. రష్యా సైన్యానికి ప్రాక్సీగా ఉంచాయి. కొన్ని దేశాలలో కూడా రష్యా సైనికులపై హింసకు పిలుపునిచ్చేందుకు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సంస్థలు తాత్కాలికంగా కాలింగ్‌ సదుపాయాన్ని కల్పించాయి’ అని పేర్కొంది.

ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా(Meta) కంటెంట్ మోడరేటర్‌లకు ఈ-మెయిల్‌లో పంపిన సమాచం మేరకు.. రష్యా, ఉక్రెయిన్ , పోలాండ్‌ సహా కొన్ని దేశాల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో మరణానికి పిలుపునిచ్చే కొన్ని పోస్ట్‌లను తాత్కాలికంగా అనుమతిస్తున్నట్లు తెలిసిందని రాయిటర్స్‌ ఆరోపించింది. పుతిన్, లుకాషెంకో మరణాల కోసం పిలుపునిచ్చే పోస్ట్‌లు కచ్చితంగా ఉక్రెయిన్‌ దురాక్రమణ కోణంలోనే ఉండాలని, ఇతర లక్ష్యాలను కలిగి ఉన్నట్లు తేలితే అనుమతించవని చెప్పింది. ఇదే తరహా చర్యలను లాత్వియా, లిథువేనియా, ఎస్టోనియా, పోలాండ్, స్లోవేకియా, హంగేరి, రొమేనియా, రష్యా, ఉక్రెయిన్‌కు మెటా సంస్థ వర్తింపజేస్తోంది. మెటా సంస్థ పాలసీలలో తీసుకొన్న మార్పులపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మెటా సంస్థ ప్రతినిధి ఒకరు ఫాక్స్ న్యూస్ డిజిటల్‌తో మాట్లాడుతూ.. ‘ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ జరుగుతోంది. రష్యన్ ఆక్రమణదారులకు మరణం.. వంటి హింసను ప్రేరేపించే వ్యాఖ్యలకు నియమాలను పక్కనపెట్టి తాత్కాలికంగా అనుమతులు ఇచ్చాం. రష్యా పౌరులను ఇందులో భాగం చేయం.’ అని చెప్పారు.

IIT Hyderabad: ఐఐటీ హైదరాబాద్​లో వాటికి దరఖాస్తుల ఆహ్వానం.. ఎంపికైతే ప్రతినెలా రూ. 60 వేల స్టైఫండ్


అనంతరం మెటా నుంచి అధికారిక ప్రకటన విడుదలైంది. ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న దండయాత్ర దృష్ట్యా, రష్యా ఆక్రమణదారులకు మరణం వంటి హింసాత్మక భావాలను వ్యక్తపరచడానికి తాత్కాలిక మినహాయింపు ఇచ్చామని స్పష్టం చేసింది. దురాక్రమణకు గురవుతున్న, హింసను అనుభవిస్తున్న ప్రజల భావాన్ని బయటకు చెప్పడానికి ఈ తాత్కాలిక చర్యలు తీసుకొన్నట్లు పేర్కొంది. రష్యా పౌరులపై హింసను ప్రేరేపించే చర్యలకు అనుమతి ఉండదని చెప్పింది.
Published by:Veera Babu
First published:

Tags: Facebook, Instagram, Technology

తదుపరి వార్తలు