Home /News /technology /

EXCITING NEWS FOR BULLET BIKE LOVERS NEW BIKE ON AUGUST 5 WHAT IS THE PRICE UMG GH

Royal Enfield: బుల్లెట్ బైక్ లవర్స్ కు అదిరిపోయే న్యూస్ .. త్వరలో కొత్త బైక్.. ధర ఎంతంటే !

 బుల్లెట్ బైక్ లవర్స్ కు అదిరిపోయే న్యూస్ .. ఆగష్టు 5న కొత్త బైక్.. ధర ఎంతంటే !

బుల్లెట్ బైక్ లవర్స్ కు అదిరిపోయే న్యూస్ .. ఆగష్టు 5న కొత్త బైక్.. ధర ఎంతంటే !

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 (Royal Enfield Bullet 350) అనే మరో కొత్త బుల్లెట్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ కొత్త బైక్‌(Bike)ను ఆగస్టు 5న లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ హింట్ ఇచ్చింది.

బెస్ట్ ఫీచర్లు(Features), యూనిక్ డిజైన్‌తో వచ్చే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్‌(Royal Enfield Bikes)కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. మన ఇండియాలో కూడా ఈ కంపెనీ బైక్స్ విపరీతంగా అమ్ముడుపోతుంటాయి. బులెట్ బైక్స్ (Bullet Bikes) చాలామందికి ఫేవరెట్‌గా కూడా నిలుస్తాయి. అయితే కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 (Royal Enfield Bullet 350) అనే మరో కొత్త బుల్లెట్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ కొత్త బైక్‌ను ఆగస్టు 5న లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ హింట్ ఇచ్చింది. ఇంతకు ముందే కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350ని  ఆగస్టు 7న విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇప్పుడు దాని కంటే రెండు రోజుల ముందే బుల్లెట్ 350ని పరిచయం చేసేందుకు సిద్ధమైంది.

న్యూ జనరేషన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ఆగస్టు 5న లాంచ్ చేయవచ్చని కంపెనీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ టీజర్‌ ప్రకారం తెలుస్తోంది. ఈ టీజర్‌లో కొందరు వ్యక్తులు సరదాగా గడుపుతున్నట్లు కనిపించింది. వారి వెనుక ఉన్న గోడపై 'బుల్లెట్ మేరీ జాన్' అని రాయడంతో పాటు తేదీ - 05.08.2022 అనే పోస్టర్‌లు కనిపించాయి. దీన్నిబట్టి బుల్లెట్ 350ని ఆగస్టు 5న కంపెనీ విడుదల చేయొచ్చని తెలుస్తోంది.

ఇదీ చదవండి: Infinix Hot 12 Pro: భారీ డిస్ ప్లేతో ఇన్ఫీనిక్స్ స్మార్ట్ ఫోన్ లాంఛ్.. ధర, ఫీచర్స్ చూస్తే అదుర్స్ అంటారు..



ఈ ఆదివారం 7న లాంచ్ అవుతున్న హంటర్ 350 అత్యంత చవకైన రాయల్ ఎన్‌ఫీల్డ్‌గా మారనుంది. ఇప్పటివరకు బుల్లెట్ 350 అత్యంత సరసమైనదిగా నిలిచింది. అయితే న్యూ జనరేషన్ బుల్లెట్(Bullet) కంపెనీకి చెందిన J-ప్లాట్‌ఫామ్‌పై లాంచ్ అవుతుంది కాబట్టి బుల్లెట్ 350 అత్యంత చవకైన బైక్ అనే ట్యాగ్‌ను కోల్పోతుంది. Meteor 350, కొత్త క్లాసిక్ 350 బైక్స్ కూడా ఇదే ప్లాట్‌ఫామ్‌పై మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ అప్‌గ్రేడ్‌తో రెండూ కూడా పర్ఫామెన్స్ పరంగా మెరుగుపడ్డాయి.



కరెంటు జనరేషన్ బుల్లెట్ 350 346cc UCE ఇంజన్‌తో వచ్చింది. అయితే నెక్స్ట్ జనరేషన్ బుల్లెట్‌గా వస్తున్న బుల్లెట్ 350 బైక్ 20.2 hp, 27 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 349cc J-ప్లాట్‌ఫామ్ ఇంజన్‌తో వస్తుంది. స్ప్లిట్ డబుల్-క్రెడిల్ ఫ్రేమ్‌, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మెరుగైన స్విచ్ గేర్, స్టాండర్డ్‌గా ఎలక్ట్రిక్ స్టార్టర్, ట్రిప్పర్ నావిగేషన్ పాడ్ వంటి కొత్త ఫీచర్‌లను ఆఫర్ చేస్తుంది. ట్రిప్పర్ నావిగేషన్ ఫీచర్‌ ఆప్షనల్‌గా అందుబాటులోకి రావచ్చు. కరెంటు జనరేషన్ బుల్లెట్ 350 అత్యంత రూ. 1.47 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరతో అత్యంత తక్కువ ధర గల బుల్లెట్ గా నిలుస్తోంది. బుల్లెట్ న్యూ జనరేషన్ బైక్ మాత్రం సుమారు రూ. 1.7 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో మార్కెట్లోకి అడుగుపెడుతుందని అంచనా. ఈ ధర రూ. 1.5 లక్షలతో లాంచ్ అయ్యే హంటర్ 350 కంటే ఎక్కువే.
Published by:Mahesh
First published:

Tags: Electric Bikes, Features, Price, Royal Enfield

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు