హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Amazon: అమెజాన్ ప్రైమ్ డేలో కళ్లు చెదిరే ఆఫర్లు.. లో కాస్ట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

Amazon: అమెజాన్ ప్రైమ్ డేలో కళ్లు చెదిరే ఆఫర్లు.. లో కాస్ట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

అమెజాన్ ప్రైమ్ డేలో అదిరిపోయే ఆఫర్లు

అమెజాన్ ప్రైమ్ డేలో అదిరిపోయే ఆఫర్లు

గాడ్జెట్‌లపై అద్భుతమైన ఆఫర్లు, భారీ తగ్గింపులకు అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ వేదిక కానుంది. బడ్జెట్, మిడ్-రేంజ్, హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లపై అమెజాన్ ఎలాంటి ఆఫర్లను ప్రకటించిందో పరిశీలిద్దాం. 

గాడ్జెట్ ప్రియులకు గుడ్ న్యూస్. దిగ్గజ ఇ- కామర్స్ సంస్థ ‘అమెజాన్’ ప్రైమ్ డే సేల్ తేదీలను ప్రకటించింది. జులై 23 నుంచి ప్రారంభమై జులై 24 వరకు ఇది కొనసాగనుంది. స్మార్ట్‌ఫోన్‌లతో సహా అనేక గాడ్జెట్‌లపై అద్భుతమైన ఆఫర్లు, భారీ తగ్గింపులకు అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ వేదిక కానుంది. బడ్జెట్, మిడ్-రేంజ్, హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లపై అమెజాన్ ఎలాంటి ఆఫర్లను ప్రకటించిందో పరిశీలిద్దాం.

* శామ్‌సంగ్ ఎస్20 ఎఫ్‌ఈ 5జీ

ప్రైమ్ డే సేల్‌‌ సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్‌‌పై అమెజాన్ భారీ డిస్కౌంట్‌ ప్రకటించింది. దీని ధర రూ.74,999 కాగా, ఆఫర్లో కేవలం రూ.34,999కే దీన్ని సొంతం చేసుకోవచ్చు.

* ఐక్యూ జెడ్6 5జీ

బడ్జెట్ రెంజ్‌లో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది బెస్ట్ చాయిస్. అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా ఐక్యూ జెడ్6 5జీపై రూ.2000 డిస్కౌంట్ ప్రకటించారు. దీని ధర రూ.14,999 కాగా, ఆఫర్‌లో రూ.12999కే లభిస్తుంది.

* వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్

మిండ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరిగ్గా సరిపోతుంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్‌పై రూ. 2500 డిస్కౌంట్ ప్రకటించారు. దీని ధర 19,999 కాగా, అమెజాన్ ఆఫర్‌లో రూ.17499కే సొంతం చేసుకోవచ్చు.

* రెడ్ మీ నోట్ 11

ఇది బడ్జెట్ ఫోన్. అమెజాన్ ప్రై డే సేల్ సందర్భంగా దీనిపై రూ. 2,250 డిస్కౌంట్ ప్రకటించారు. దీని ధర 12,999 కాగా, రూ.10749కే కొనుగోలు చేయవచ్చు.

 ఇదీ చదవండి: వామ్మో.. ఆ అమెరికా కంపెనీ సాఫ్ట్ వేర్ లో బగ్.. రెచ్చిపోతున్న హ్యాకర్లు !


* వన్ ఫ్లస్ నార్డ్ సీఈ 2 5జీ

మిడ్ రేంజ్‌లో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారు దీన్ని ఎంపిక చేసుకోవచ్చు. అమెజాన్ ప్రై డే సేల్‌లో దీనిపై రూ. 2500 డిస్కౌంట్ ప్రకటించారు. దీని ధర రూ. 24,999 కాగా, రూ. 22,499కే సొంతం చేసుకోవచ్చు.

* షియోమి 12 ప్రో

ఇది హై- ఎండ్ స్మార్ట్ ఫోన్. దీని ధర రూ. 72,999. అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా దీనిపై భారీ ఆఫర్ ప్రకటించారు. రూ. 21వేల డిస్కౌంట్‌తో రూ.51,999కు సొంతం చేసుకోవచ్చు.

* ఒప్పో ఎఫ్21 ప్రో

మిండ్ రేంజ్‌లో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఒప్పో ఎఫ్21 ప్రో బెస్ట్ చాయిస్. దీని ధర రూ. 27,999. అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా దీనిపై రూ. 4,000 డిస్కౌంట్‌తో రూ. 22,999కు లభిస్తుంది.

* శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్22 ఆల్ట్రా 5జీ

ఇది హై -ఎండ్ ఫోన్. అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్22 ఆల్ట్రా 5జీ‌ స్మార్ట్ ఫోన్‌ను భారీ డిస్కౌంట్‌తో సొంతం చేసుకోవచ్చు. దీని ధర 1,31,990 కాగా, రూ. 21,991 డిస్కౌంట్‌తో రూ.1,09,999కు సొంతం చేసుకోవచ్చు.

* రెడ్‌మీ నోట్ 11 ప్రో ఫ్లస్ 5జీ

మిండ్ రేంజ్‌లో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఇది మరొక బెస్ట్ చాయిస్. రెడ్‌మీ నోట్ 11 ప్రో ఫ్లస్ 5జీ ధర రూ. 19,999 కాగా, అమెజాన్ ప్రైమ్‌డే సందర్భంగా దీనిపై రూ. 2,750 డిస్కౌంట్ ప్రకటించారు. ఆఫర్‌లో ఈ ఫోన్ రూ.17,249కు లభిస్తుంది.

* షియోమి 11 లైట్ NE 5G

ఈ ఫోన్ అసలు ధర రూ. 24,999 కాగా, ఆఫర్‌లో రూ. 17,999కే లభిస్తుంది. ఈ డివైజ్ కొనుగోలుపై ఏకంగా రూ.7వేలు డిస్కౌంట్ ప్రకటించడం విశేషం. అయితే వేరియంట్‌ను బట్టి దీని ధర మారుతోంది.

First published:

Tags: Amazon prime, Amazon sales, Gadgets, Smartphones

ఉత్తమ కథలు