హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Electric Scooter: భారత్ లోకి మరో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ధర, ఫీచర్ల వివరాలివే

Electric Scooter: భారత్ లోకి మరో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ధర, ఫీచర్ల వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆకాశాన్ని తాకుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో ప్రజలంతా ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) వైపు చూస్తున్నారు. ఈ నేఫథ్యంలో మన దేశంలో అనేక సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలు విడుదల అవుతున్నాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ఆకాశాన్ని తాకుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో ప్రజలంతా ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) వైపు చూస్తున్నారు. ఈ నేఫథ్యంలో మన దేశంలో అనేక సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలు విడుదల అవుతున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ బైకులు (Electric Bikes), స్కూటర్ల (Electric Scooters) విడుదల అధికం అవుతోంది. నేడు గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న '2022 ఈవీ ఇండియా ఎక్స్‌పో' (2022 EV India Expo) లో 'ఈవిట్రిక్ మోటార్స్' (EVTRIC Motors) కంపెనీ తన హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను భారత్ లో విడుదల చేసింది. కొత్త ఈవిట్రిక్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి 'రైడ్ హెచ్ఎస్' (Ride HS) కాగా, మరొకటి 'మైటీ ప్రో' (Mighty Pro) ఎలక్ట్రిక్ స్కూటర్. వీటి ధరలు కూడా వరుసగా రూ. 81,838 మరియు రూ. 79,567గా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఆసక్తి కలిగిన కస్టమర్లు ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను కంపెనీ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. లేదా డీలర్ల ద్వారా బుక్ చేసుకోవచ్చని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఈ స్కూటర్ ల డెలివరీలు సైతం త్వరలోనే ప్రారంభమవుతాయని కంపెనీ వెల్లడించింది. 'EVTRIC రైడ్ హెచ్ఎస్' ఎలక్ట్రిక్ స్కూటర్ నాలుగు కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

  రెడ్, బ్లాక్, వైట్, గ్రే కలర్స్ లో వీనిటి కొనుగోలు చేయవచ్చని కంపెనీ తెలిపింది. ఎలక్ట్రిక్ స్కూటర్ అనగానే మొదటగా మనం పరిశీలించేది బ్యాటరి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీని పరిశీలిస్తే.. ఇందులో రిమూవబుల్ లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుందని సంస్థ తెలిపింది. ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే గరిష్టంగా 120 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని సంస్థ తెలిపింది. ఇంకా ఈ స్కూటర్ పై గంటకు 55 కిమీ స్పీడ్ తో ప్రయాణించవచ్చు. కేవలం 4 గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుందని సంస్థ తెలిపింది.

  Ola S1 Electric Scooter: ఓలానా మజాకా.. ఆ స్కూటర్ కోసం ఎగబడుతున్న జనం.. ఒక్కరోజే 10 వేల బుకింగ్స్

  EVTRIC మైటీ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ను పరిశీలిస్తే.. ఈ స్కూటర్ మూడు కలర్ ఆప్షన్స్ లో అందుబాటులోకి రానుంది. రెడ్, వైట్, గ్రే కలర్స్ లో ఈ స్కూటర్లను కొనుగోలు చేయవచ్చు. ఈ స్కూటర్ లోనూ రిమూవబుల్ లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీ కూడా కేవలం 4 గంటల్లో ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. ఒక్క సారి ఫుల్ చార్జ్ చేస్తే 120 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని సంస్థ తెలిపింది. ఇంకా.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై గంటకు 65 కి. మీ స్పీడ్ తో ప్రయాణించవచ్చు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Electric bike, Electric Scooter

  ఉత్తమ కథలు