పూణెకు చెందిన ఈవీట్రిక్ మోటార్స్ (EVTRIC Motors).. ఈవీ ట్రిక్ రైజ్ పేరుతో ఒక ఎలక్ట్రిక్ బైక్ ను విడుదల చేసింది. ఈ బ్రాండులో ఈ హై-స్పీడ్ మోటర్ సైకిల్ మొట్టమొదటి ఎలెక్ట్రిక్ మోటర్ సైకిల్ గా ఉంది. EVTRIC మోటార్స్ టీమ్ డీలర్ల సమావేశం సందర్భంగా రాజస్థాన్ లో రూ. 1,59,990 (ఎక్స్-షోరూమ్ ఇండియా) ధరతో ఆవిష్కరించింది. ఈ సమావేశములో మొత్తం రాజస్థాన్ లోని డీలర్ భాగస్వాములు పాల్గొన్నారు. ఈ బైక్ బుకింగ్ లను ప్రారంభించినట్టు కంపెనీ తెలిపింది. రూ.5,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతుండడం తెలిసిందే. మార్కెట్లో ఎక్కువగా స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. కానీ, బైక్ లు తక్కువే.
ఈ క్రమంలో ఈవీ ట్రిక్ మోటార్స్ కమ్యూటింగ్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈవీ బైక్ ను తీసుకొచ్చింది. 2,000 వాట్ బీఎల్డీసీ మోటార్ 70వోల్ట్స్/40యాంపీ హవర్స్ లిథియం అయాన్ బ్యాటరీతో ఈ బైక్ పనిచేస్తుంది. నాలుగు గంటల్లో నూరు శాతం చార్జ్ అవుతుంది. బైక్ తో పాటు వచ్చే మైక్రో చార్జర్.. చార్జింగ్ పూర్తయిన వెంటనే ఆటో కటాఫ్ ఫీచర్ తో ఉంటుంది. 70 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది.
ఆటో కట్ ఫీచరుతో పాటు తోడుగా వచ్చే 10 ఆంప్ మైక్రో ఛార్జరుతో.. వినియోగదారులు సౌకర్యంగా మరియు సురక్షితంగా బ్యాటరీని ఛార్జ్ చేసుకోవడానికి ఈ బైక్ వీలు కలిగిస్తుంది. అలాగే.. ఈ బైక్ సొగసైన స్పోర్ట్ లుక్ కలిగి ఉంది. పగటిపూట కూడా నడిచే లైట్ ఫంక్షన్ తో దీనికి LED బిగించబడి ఉంటుంది. ఈ కొత్త బైక్ ఎరుపు మరియు నలుపు రంగుల్లో లభించనుంది.
ఇది కూడా చదవండి : కొత్త డిజైన్‌తో వస్తున్న చేస్తున్న.. స్టార్‌గేజర్ కారుతో ఎంట్రీ
తమ బ్రాండ్ మొట్టమొదటి మోటర్ సైకిల్ ఆవిష్కరణపై EVTRIC మోటార్స్ వ్యవస్థాపకులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ మనోజ్ పాటిల్ గారు మాట్లాడుతూ.. “మా అత్యంత అధునాతనమైన సృష్టి RISE, మా మొట్టమొదటి ‘భారత్- లో- తయారీ’ ఎలెక్ట్రిక్ బైక్ ని మీ ముందుకు తీసుకురావడం పట్ల మేము ఎంతగానో ఆనందిస్తున్నాము. ICE నుండి EV కి మారడానికి ఇంకనూ ఇతరత్రా వెనుకంజ వేస్తున్న కస్టమర్ల కోసం ఈ బైక్ నిజమైన నాణ్యతా అనుభూతిని నిర్వచిస్తుంది.
ఇది కూడా చదవండి : ఈ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లను నడపడానికి లైసెన్స్ అవసరమే లేదు.. అవేంటంటే..
అత్యుత్తమ ఇ-మొబిలిటీ తయారీ ధ్యేయానికి తోడ్పాటు ఇవ్వడం మరియు మార్కెట్ పురోగతికి మరియు కాలుష్యరహిత రేపటి రోజుకు దోహదపడటం మా బాధ్యత అని మేము నమ్ముతున్నాము. మరి ఈ కొత్త EVTRIC RISE ఆ దిశలో మరొక మైలురాయిగా ఉంటుంది” అని తెలిపారు.
ఈ బ్రాండ్ ఇప్పటికే రోడ్డుపై 3 ఎలెక్ట్రిక్ స్కూటర్లను వదిలింది. అవి - EVRIC AXIS, EVTRIC RIDE మరియు EVTRIC MIGHTY. మరియు ఈ కంపెనీ ఇండియా వ్యాప్తంగా 22 రాష్టాల్లో 125 టచ్ పాయింట్లను కలిగి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Electric bike, Electric Bikes, Electric Vehicles, New electric bike