హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Business Benefits Of 5G: 5జీ నెట్వర్క్ తో వ్యాపార ప్రయోజనాలివే.. ఓ లుక్కేయండి

Business Benefits Of 5G: 5జీ నెట్వర్క్ తో వ్యాపార ప్రయోజనాలివే.. ఓ లుక్కేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ రోజు నుంచి దేశంలోకి 5జీ సేవలు (5G Services) అందుబాటులోకి రానున్నాయి. దీంతో దేశంలో మరో సాంకేతిక విప్లవం రానుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Delhi, India

  ఈ రోజు నుంచి దేశంలోకి 5జీ సేవలు (5G Services) అందుబాటులోకి రానున్నాయి. దీంతో దేశంలో మరో సాంకేతిక విప్లవం రానుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చిన్న, మద్య తరహా కంపెనీలకు ఈ 5జీ టెక్నాలజీ (5G Technology) అనేక వ్యాపార ప్రయోజనాలను అందించనుంది. కస్టమర్లకు మరింత మెరుగైన సేవలను అందించడానికి ఈ 5జీ సేవలు ఉపయోపడనున్నాయి. ఇన్నొవేటీవ్ ఐడియాలు, కొత్త ఉత్పత్తులు, సేవలు, ట్రాన్స్ఫ్మార్డ్ బిజినెస్ మోడల్స్ 5జీ సేవలు తీసుకునానున్నాయి.

  పెరగనున్న ఉత్పాదకత:

  5జీ నెట్వర్క్ కారణంగా.. ఉత్పాదకత పెరగనుంది. ఇంటర్ నెట్ స్పీడ్ కారణంగా ఇంటర్ నెట్ ఆధారంగా పని చేస్తే వస్తువుల పనితీరు మరింత వేగవంతం కానుంది. తద్వారా ప్రొడక్టివిటీ పెరగనుంది.

  New Jobs With 5G: దేశంలోని నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. 5జీ రాకతో భారీగా జాబ్స్ .. వివరాలివే

  సేల్స్ పెరుగుదల:

  సేల్స్ పీపుల్స్ కు ఎక్కువ బ్యాండ్ విడ్త్ కలిగిన ఇంటర్ నెట్ కనెక్షన్ 5జీ ద్వారా సాధ్యపడుతుంది. తద్వారా వారి సేల్స్ సామర్థ్యం పెరుగుతుంది. వారు కస్టమర్లను ఆకట్టుకునేలా ప్రజెంట్ చేయగలుగుతారు. కస్టమర్లకు మంచి అనుభవం అందించడానికి వారు ఆగ్మెంటెడ్ లేదా వర్చువల్ రియాలిటీని ఉపయోగించగలుగుతారు. ఆగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా క్షేత్ర స్థాయిలోని ఉద్యోగులకు మెరుగైన శిక్షణను అందించే అవకాశం కలుగుతుంది.

  Major Benefits of 5G: నేటి నుంచే దేశంలో 5జీ సేవలు.. ఈ సేవల్లో ఊహించని మార్పులు.. ఓ లుక్కేయండి

  కస్టమర్స్ కు మంచి అనుభూతి:

  4జీ తో పోల్చితే 5జీ స్పీడ్ అధికంగా ఉంటుంది. దీంతో కేవలం సెకన్లలోనే వీడియో డౌన్ లోడ్ అవుతుంది. మీరు మీ కస్టమర్‌లకు అందించే అనుభవాన్ని మార్చడానికి ఈ రకమైన పనితీరును ఉపయోగించుకోవచ్చు. మీడియా ఫైల్‌లు లాగ్ టైమ్ లేకుండా వేగంగా ప్రసారం అవుతాయి. మీటింగ్స్ లలో, వర్చువల్ రియాలిటీ ఆధారంగా మెరుగైన ఫలితాలు లభిస్తాయి. కస్టమర్‌లు మరియు ఇతరులకు మీ కొత్త ఉత్పత్తులను మరింత ఎఫెక్టివ్ గా ప్రదర్శించవచ్చు.

  IoT రంగానికి 5G ప్రయోజనాలు:

  5G యొక్క కొత్త టెక్నాలజీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT)ని కూడా అప్‌గ్రేడ్ చేస్తుంది. అధునాతన 5G రూటర్‌తో, ఇంటిలోని స్మార్ట్ పరికరాలు, ఇతర పరికరాల నెట్‌వర్క్ బాగా బలోపేతం అవుతుంది.

  -రిమోట్ మానిటరింగ్, స్మార్ట్ అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ మరియు టెలిహెల్త్ వంటి రంగాల బలోపేతానికి 5జీ ఉపయోగపడనుంది. అదే సమయంలో, స్మార్ట్ RFID సెన్సార్ మరియు GPS సహాయంతో రైతులు జంతువులను కూడా ట్రాక్ చేయవచ్చు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: 5G, 5g technology, Pm modi

  ఉత్తమ కథలు