హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Smartphone Security: ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌‌ను మరింత సురక్షితంగా మార్చే ఐదు మార్గాలు.. అందరూ తెలుసుకోవాల్సిందే..

Smartphone Security: ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌‌ను మరింత సురక్షితంగా మార్చే ఐదు మార్గాలు.. అందరూ తెలుసుకోవాల్సిందే..

ఈ యాప్ ద్వారా ఇంట‌ర్నెట్ డౌలోడ్ అప్‌లోడ్ వేగాన్ని కొల‌వ‌చ్చు. అంతే కాకుండా వైఫై వేగాన్ని కొల‌వ‌చ్చు. ఈ యాప్‌ను డార్క్ అండ్ లైట్ మోడ్‌ల‌లో వినియోగించ‌వ‌చ్చు. ఇది మోటియోర్ ఫీచ‌ర్‌ల‌ను క‌లిగి ఉంటుంది. కేవ‌లం 3ఎంబీ సైజ్‌లో కూడా ఈ యాప్‌ని వాడుకొనే అవ‌కాశం ఉంది.
(ప్రతీకాత్మక చిత్రం)

ఈ యాప్ ద్వారా ఇంట‌ర్నెట్ డౌలోడ్ అప్‌లోడ్ వేగాన్ని కొల‌వ‌చ్చు. అంతే కాకుండా వైఫై వేగాన్ని కొల‌వ‌చ్చు. ఈ యాప్‌ను డార్క్ అండ్ లైట్ మోడ్‌ల‌లో వినియోగించ‌వ‌చ్చు. ఇది మోటియోర్ ఫీచ‌ర్‌ల‌ను క‌లిగి ఉంటుంది. కేవ‌లం 3ఎంబీ సైజ్‌లో కూడా ఈ యాప్‌ని వాడుకొనే అవ‌కాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)

స్మార్ట్‌ఫోన్‌లు హ్యాకర్ల బారిన పడకుండా చేయడంతో పాటు మరింత రక్షణ కల్పించేందుకు ఆండ్రాయిడ్‌ డివైజ్‌లలో కొన్ని ఫీచర్లు ఉన్నాయి. యూజర్లు వీటిపై అవగాహన పెంచుకోవాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే..

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ (Smart phones) లేనివారు చాలా అరుదేనని చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు సరికొత్త మోడళ్ల (new models)ను విడుదల చేస్తున్న మొబైల్ తయారీ సంస్థలు.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల (features) విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి. అయితే గోప్యత విషయంలో మాత్రం నేటికీ వినియోగదారులు ఆందోళన చెందుతూనే ఉన్నారు. ఎందుకంటే స్మార్ట్‌ఫోన్లలో స్టోర్ చేసుకునే బ్యాంక్ అకౌంట్ సమాచారం (bank account details), ఫోటోలు, మెసేజ్‌లు సహా సున్నితమైన డేటా హ్యాకింగ్ (data hacking) ప్రమాదంలో పడుతోంది. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్‌లు హ్యాకర్ల బారిన పడకుండా చేయడంతో పాటు మరింత రక్షణ కల్పించేందుకు ఆండ్రాయిడ్‌ డివైజ్‌లలో కొన్ని ఫీచర్లు, మార్గాలు ఉన్నాయి. యూజర్లు వీటిపై అవగాహన పెంచుకోవాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే..

1. మీ స్మార్ట్‌ఫోన్‌ను లాక్ చేయండి

మీ స్మార్ట్‌ఫోన్‌ను సురక్షితంగా ఉంచే మార్గాల్లో లాక్ చేయడం ప్రధానమైనది. డివైజ్‌ను తప్పనిసరిగా లాక్ చేయడం (locked) వల్ల ఒకవేళ ఫోన్ పోయినా.. లాక్ తెరవడం కష్టంగా మారుతుంది. పోయిన పోన్ లాక్‌ను ఓపెన్ చేయడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయంలో ఫోన్‌ను ట్రాక్ (track) చేయవచ్చు. బ్యాంక్ అకౌంట్‌లు, క్రెడిట్, డెబిట్ కార్డులను కూడా బ్లాక్ చేసుకోవడానికి (To be block) కొంత సమయం దొరుకుతుంది. దీని ద్వారా ఫోన్ దొంగలపాలయినా బ్యాంక్ అకౌంట్‌లో నగదు సురక్షితంగా ఉంటుంది.

2. సరైన యాప్‌లను మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలి

స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరిగిన తరువాత ప్రతి పనికీ ఓ యాప్ (Application) అందుబాటులోకి వచ్చింది. వీటికి గేమింగ్ యాప్స్ (gaming apps) కూడా తోడయ్యాయి. యాప్స్ డౌన్‌లోడ్ చేసుకునేవారు విశ్వసనీయ మార్గాల నుంచి మాత్రమే వాటిని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆథరైజ్డ్(Authorized), సెక్యూర్డ్ మార్గాల ద్వారా యాప్స్‌ డౌన్‌లోడ్ చేసుకోవడం వల్ల హ్యాకర్లు మాల్వేర్ ద్వారా ఫోన్‌లో ప్రవేశించే అవకాశం ఉండదు. థర్డ్ పార్టీ సైట్ల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవద్దు.

3. యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ వాడండి

యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ స్మార్ట్‌ఫోన్‌లలో మాల్వేర్స్ (mobile malware security app), బగ్స్‌ను గుర్తిస్తుంది. దీనివల్ల ఆండ్రాయిడ్ ఫోన్‌ను సురక్షితంగా ఉంచుకోవచ్చు. అవాస్ట్ మొబైల్ సెక్యూరిటీ (Avast mobile security), యాంటీవైరస్, నార్టన్ మొబైల్ సెక్యూరిటీ యాప్‌లను యూజర్లు పరిశీలించవచ్చు. ఇవి మీ మొబైల్‌ను సురక్షితంగా ఉంచుతాయి.

4. అప్‌డేట్ చేసుకోండి

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఎప్పటికప్పుడు కొత్త ఓఎస్‌ (Operating system)లతో అప్‌డేట్ చేసుకోవడం ముఖ్యం. కొత్త ఓఎస్‌లతో స్మార్ట్‌ఫోన్‌ను అప్‌డేట్ చేయడం వల్ల మాల్వేర్, బగ్‌ (bug)ల నుంచి రక్షణ పొందవచ్చు.

5. పాస్‌వర్డ్స్ సేవ్ చేయవద్దు

స్మార్ట్‌ఫోన్లలో పాస్‌వర్డ్ సేవింగ్ ఆప్షన్‌ (password saving option)ను డిసేబుల్ చేసుకోవాలి. చాలామంది రోజూ వాడే యాప్‌ల పాస్‌వర్డ్‌లను సేవ్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఫోన్ దొంగలపాలయితే బ్యాంకు ఖాతా (bank account) ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే పాస్‌వర్డ్ సేవ్ చేసుకునేందుకు యాప్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దు.

First published:

Tags: Hacking, Security, Smartphones

ఉత్తమ కథలు