Home /News /technology /

EVERY ONE TAKE ELECTRICITY METER READING IN OWN MOBILE NEW APP AVAILABLE FOR USERS NGS

Andhra Pradesh: ఇకపై మీ మీటరు రీడింగ్ మీరే తీయొచ్చు..? ఇలా చేయండి? లేటు చేస్తే శ్లాబ్ మారే ప్రమాదం

ఎవరి మీటర్ రీడింగ్ వారే తీసుకోవచ్చు

ఎవరి మీటర్ రీడింగ్ వారే తీసుకోవచ్చు

ఏపీలో విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఈ నెల ఇంకా బిల్లు రాలేదు ఏంటి అని ఎదురు చూడాల్సిన అవసరం లేదు.. ఎవరికి వారు తమ మీటర్ రీడింగ్ ను చెక్ చేసుకుని బిల్లు పొందవచ్చు.. దాని కోసం ఏం చేయాలి అంటే..?

    ఓ వైపు భానుడి భగభగలు.. మరోవైపు కరోనా కాటు.. స్కూళ్లులేవు.. దానికి తోడు కర్ఫ్యూ టైం.. దీంతో అంతా ఇంట్లోనే ఉంటున్నారు. ఫ్యాన్లు.. టీవీలు.. ఏసీలు.. ఇలా వినియోగం పెరిగి కరెంటు బిల్లులు భయపెడుతున్నాయి. దీనికితోడు కరోనా పరిస్థితులతో బిల్లు ఇవ్వడం ఆలస్యం చేస్తున్నారు. మీటరు రీడింగ్‌ తీసే వ్యక్తులు సకాలంలో రాలేకపోతున్నారు. దీంతో శ్లాబ్ మారి బిల్లులు గుండె గుబేల్ అనేలా చేస్తున్నాయి. బిల్లు రావడం ఆలస్యమైతే ఈసారి బిల్లు ఎంత వస్తుందోననే భయం వెంటాడుతుంది. కానీ ఇకపై అలాంటి టెన్షన్ అవసరం లేదంటున్నారు ఈపీడీసీఎల్‌ (EPDCL) అధికారులు. వినియోగదారుల కోసం అందుబాటులోకి తెచ్చిన నూతన విధానంతో ఇకపై కంగారు పడాల్సిన పనిలేదంటున్నారు. ఇకపై ఎవరికి వారు తమ మీటరు రీడింగ్‌ సకాలంలో తీసుకోవచ్చు.. అలా పంపితే ఈ-బిల్లు మీ కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. విధి నిర్వహణలో రీడింగ్‌ తీసే వ్యక్తులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఈ పరిస్థితికి చెక్‌ పెట్టేందుకు వినియోగదారులు ఎవరికి వారే సకాలంలో విద్యుత్తు బిల్లులు రీడింగ్‌ తీసి పంపేందుకు వీలుగా తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ eastern power app అందుబాటులోకి తెచ్చింది.

    అందుకు ఏం చేయాలంటే.. గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఈస్ట్రన్‌ పవర్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. కొత్త వారైతే పేరు, చిరునామా, సెల్ ఫోన్ నెంబర్, మెయిల్‌ ఐడీ నమోదు చేయాలి. ఐడీ, పాస్‌వర్డు ద్వారా లాగిన్‌ అవ్వాలి. 16 నెంబర్ల విద్యుత్తు సర్వీస్‌ మీటరును నమోదు చేయాలి. ఆ వెంటనే సెల్ ఫోన్ కు ఓటీపీ వస్తుంది. అది ఎంటర్‌ చేస్తే రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుంది. మీటరు ఐకాన్‌ రిజిస్ట్టర్‌ సర్వీస్‌ నంబర్‌పై క్లిక్‌ చేసి కెమెరా ఐకాన్‌ ద్వారా మీటర్‌ రీడింగ్‌ స్కాన్‌ చేయాలి. కేడబ్ల్యూహెచ్‌ రీడింగ్‌ నమోదు చేసి సబ్మిట్‌ చేస్తే అధికారి నిర్ధారణ చేసిన తరువాత మొబైల్ కు సమాచారం వస్తుంది. ఈ యాప్‌లోనే బకాయిలు, బిల్లు కట్టే విధానం, వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.

    ఇదీ చదవండి: వీడు మమూలోడు కాదు.. ఏపీ సీఎం సంతకం ఫోర్జరీ.. 2 కోట్లకు బురిడీ

    రీడింగ్‌ తీయడం నుంచి విద్యుత్తు బిల్లుల సేకరణ వరకు పనిచేసే సిబ్బందికి కొవిడ్‌ సోకి ఇబ్బంది పడ్డ సంఘటనలు అనేకం ఉన్నాయి. వినియోగదారుల సౌలభ్యం కోసం ఈపీడీసీఎల్‌ నూతన విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌ ద్వారా గడువులోగా సకాలంలో ఎవరికి వారు విద్యుత్తు మీటర్లకు సంబంధించి స్వయంగా రీడింగ్‌ తీసుకొనే వెసులుబాటు ఉంది. గడువు తేదీకి మూడు రోజులు అటు, ఇటుగా మీటరు రీడింగ్‌ నమోదు చేస్తే సంబంధిత అధికారి తనిఖీ చేసిన తరువాత సంక్షిప్త సమాచారం పంపుతారు. దాన్ని బట్టి బిల్లు చెల్లించే వెసులుబాటు అందులోనే ఉంటుంది.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap government, AP News, Electricity bill, Mobile App

    తదుపరి వార్తలు