ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ స్మార్ట్ (Facebook Smart) గ్లాసెస్‌ని లాంచ్ చేసింది. అయితే ఈ కళ్లద్దాల్లో ఎదుటివారి అనుమతులు లేకుండా ఫొటోలు, వీడియోలు తీసే అవకాశం ఉన్నందున యూరోపియన్ యూనియన్ ప్రైవసీ (Privacy) రెగ్యులేటర్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ స్మార్ట్ (Facebook Smart) గ్లాసెస్‌ని లాంచ్ చేసింది. రే-బాన్(Ray-ban) బ్రాండ్ సాయంతో ఈ సరికొత్త కళ్లద్దాలను అందించనుంది. ఫేస్బుక్, రే-బాన్ సంయుక్తంగా అందిస్తున్న ఈ కళ్లద్దాలలో ఫోటోలు తీసుకొనేందుకు 5ఎంపీ కెమెరా ఉంది. అంతే కాకుండా 30 సెకన్ల వీడియోల్ని రికార్డు చేసే సామర్థ్యం(Capacity) ఈ గ్లాసెస్ సొంతం. క్యాప్చరింగ్ బటన్‌తో పాటు ఫేస్బుక్ అసిస్టెంట్ వాయిస్ కమాండ్స్ ద్వారా టచ్ చేయకుండానే ఫొటోలు, వీడియోలు తీయొచ్చు, కాల్స్ మాట్లాడొచ్చు. అయితే ఈ కళ్లజోడుపై ఉన్న చిన్న కెమెరా (Camera) గురించి పలువురు అనుమానాలు లేవనెత్తుతున్నారు. అవతలి వాళ్లను అనుమతులు లేకుండా ఫొటోలు, వీడియోలు తీసే విషయంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎదుటివారి అనుమతులు లేకుండా ఫొటోలు, వీడియోలు తీసే అవకాశం ఉన్నందున యూరోపియన్ యూనియన్ ప్రైవసీ (Privacy) రెగ్యులేటర్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
ఈ విషయంపై ఫేస్బుక్ ఐర్లాండ్ (Ireland) డాటా ప్రొటెక్షన్ కమిషన్(డీపీసీ) ఎదుట హాజరైంది. స్మార్ట్ కళ్లద్దాల పని తీరును వారికి వివరించింది. కెమెరా పైభాగంలో ఉండే చిన్న ఎల్ఈడీ ఇండికేటర్ లైట్ గురించి వివరించారు. ఒకవేళ ఎదుటివాళ్లు ఫొటోగానీ, వీడియోగానీ తీస్తుంటే.. ఆ లైట్ ఆధారంగా గుర్తించొచ్చని ఫేస్బుక్ వివరణ (Explanation) ఇచ్చుకుంది. కానీ, డీపీసీ (DPC) ఈ వివరణతో సంతృప్తి చెందనట్లు తెలుస్తోంది. కెమెరా చిన్నదిగా ఉండడం, పైగా ఆ లైట్ వెలుతురూ అంతగా లేకపోవడంపై డీపీసీ అభ్యంతరాలు లేవనెత్తినట్లు సమాచారం.
ఇటలీ ప్రైవసీ విభాగం స్మార్ట్కళ్లజోడు విషయంలో ప్రజల భద్రత గురించి ప్రశ్నలు లేవనెత్తింది. కానీ ఫేస్బుక్ రీజియన్ (Facebook Region) బేస్ ఐర్లాండ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో ఐర్లాండ్ డాటా ప్రొటెక్షన్ కమిషన్ విచారణ నడుస్తోంది. ఇదే కాకుండా ఫేస్బుక్ చాలాకాలం నుంచి తేవాలనుకుంటున్న ఫేషియల్ ట్యాగింగ్ ఫీచర్, డీపీసీ అభ్యంతరాల వల్లే వాయిదా పడుతోంది. ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సప్‌పై కూడా ఎన్నో ఫిర్యాదులు ఉన్నాయి. ఈ మధ్యే ‘ట్రాన్సపరెన్సీ ఫెయిల్యూర్’ ఫిర్యాదు ఆధారంగా డీపీసీ ఫేస్‌బుక్‌కు 267 డాలర్ల పెనాల్టీ సైతం విధించింది.
అనుమానాలను నివృత్తి చేస్తాం..
ఫేస్ బుక్ ఈ స్మార్ట్ గ్లాస్‌ల ఫిర్యాదులపై స్పందించింది. ఇలాంటి అనుమానాలు సహజం అని అంది. అందరి అనుమానాలు నివృత్తి చేస్తామంది. ఫేస్బుక్ ప్రస్తుతం ప్రవేశపెట్టిన గ్లాస్లు అగుమెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ (Technology) కాకుండానే మార్కెట్లోకి రిలీజ్ చేయనుంది. ఫోన్లోని వీడియో (Video) లను సైతం వీక్షించేలా కనెక్ట్చేసుకోవచ్చు. అలాగే వీటి ద్వారా తీసే వీడియోలను(షార్ట్) స్మార్ట్ ఫోన్లో సేవ్ చేసుకోవచ్చు. అయితే, పేరుకే స్మార్ట్ కళ్లజోడు అయినప్పటికీ.. అర్టిఫీషియల్(Artificial) ఇంటెలిజెన్సీ వ్యవస్థ సపోర్ట్ లేకపోవడం లోటుగా భావిస్తున్నారు. ఫేస్బుక్ 20 రకాల కళ్లజోడులు అందుబాటులోకి తీసుకొచ్చింది ఫేస్బుక్. అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, కెనెడా, ఐర్లాండ్, ఇటలీ, యూకేలో వీటి అమ్మకం మొదలైంది. ఆన్లైన్ (Online)తో ఎంపిక చేసిన రిటైల్ స్టోర్ (Retail Store) లలో ఫేస్బుక్ స్మార్ట్ కళ్లద్దాలను అమ్ముతున్నారు. ఇక ప్రస్తుతం తెచ్చిన రే బాన్ స్టోరీస్ కళ్లజోడులో 5ఎంపీ కెమెరా ఉంది. దీని ధర సుమారు 299 డాలర్లుగా ప్రచారం జరుగుతోంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.