టెక్నాలజీ (Technology) రోజు రోజుకు చాలా మారిపోతుంది. ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్ ఇస్తూ యూజర్లను ఆకట్టుకోవడంలో ఆండ్రాయిడ్ చాలా ముందు ఉంటుంది. తాజాగా ఆండ్రాయిడ్ 13 (Android) వర్షన్ రాబోతుంది. ఇందులో సరికొత్త ఫీచర్ అందిచబోతుంది గూగుల్. అదే.. ఈ-సిమ్. దీని ద్వారా ఒకే సిమ్‌లో రెండు నంబర్లను వాడుకొనే వీలు ఉంటుంది. ఈ ఫీచర్‌ను ఆం డ్రాయిడ్ 13తో అందిస్తున్నట్టు గూగుల్ తెలిపింది. మల్టిపుల్ ఎనేబుల్ ప్రొఫైల్స్ (MEP) అనే టెక్నాలజీతో ఈ -సిమ్ పని చేస్తుంది. ఇందులో రెండు ప్రొఫైల్స్ ఉంటుఆయి. దీని ద్వారా ఒకే ఈ-సిమ్‌లో రెండు నంబర్లు వాడుకోవచ్చు. గూగుల్ ఈ కొత్త ఫీచర్ను తీసుకురావడం కోసం 2020లో పేటెం ట్ హక్కు ల కోసం దరఖాస్తు చేసుకుంది. దీన్ని ఇంజినీరిం గ్ ఫిక్స ల్ హార్డ్వేర్లో పరీక్షిస్తున్నట్లు వెల్లడించింది. ఇప్ప టికే ఉన్న సిమ్ ఇం టర్ఫేస్ను ‘ఈ-సిమ్’ రెం డు డిజిటల్ కనెక్షన్లుగా విభజిస్తుం దని నివేదికలో వివరించింది.
Smart Phones: చౌకగా స్మార్ట్ ఫోన్ కొనాలనుకొంటే.. ఈ ఆఫర్‌లు ట్రై చేయండి!
ఈ-సిమ్ అంటే..
ఈ-సిమ్ అనేది ఎలక్ట్రానిక్ సిమ్ కార్డు. ప్రస్తుతం మనం వాడే సాధారణ మొబైల్ సిమ్కు డిజిటల్ వెర్షన్నే ఈ-సిమ్ అని పిలుస్తారు. ఈ-సిమ్ టెక్నా లజీలో సిమ్ కార్డు భౌతిక రూపం లో ఉం డదు. ఇదొక 'ఎం బెడెడ్ సిమ్. ఈ - సిమ్ కోసం నెట్వర్క్ ప్రొవైడర్కి రిక్వెస్ట్ పెట్టుకుం టే కోడ్ ఇస్తారు. దాన్నే ఈ - సిమ్ విధానం అం టారు. ప్రస్తుతం దేశం లో జియో, వీఐ, ఎయిర్టెల్ ఈ సౌకర్యం అందిస్తున్నా యి.
జియోలో ఈ-సిమ్ ఎలా యాక్టీవ్ చేసుకొనే విధానం..
Step 1 - ఈ సిమ్ అవకాశం ఉన్న స్మార్ట్ ఫోన్ వాడే వారు ముందుగా సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.
Step 2 - ఆ తర్వాత జనరల్ క్లిక్ చేయాలి. ఈఐడీ, ఐఎంఈఐ నెంబర్లు ఉంటాయి.
WhatsApp: యూజర్లకు వాట్సప్ షాక్.. ఫిబ్రవరిలో ఎంతమంది ఖాతాలు బ్లాక్ చేసిందో తెలుసా?
Step 3 - వాటిని నోట్ చేసుకోవాలి. ఆ తర్వాత SMS GETESIM అని టైప్ చేసి ఈఐడీ, ఐఎంఈఐ నెంబర్లు టైప్ చేసి 199 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి.
Step 4 - మీకు 19 అంకెల ఇ-సిమ్ నెంబర్, ఇ-సిమ్ ప్రొఫైల్ కాన్ఫిగరేషన్ వివరాలు వస్తాయి.
Step 5 - ఆ తర్వాత SMS SIMCHG అని టైప్ చేసి 19 అంకెల ఇ-సిమ్ నెంబర్ ఎంటర్ చేసి 199 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి.
Step 6 - రెండు గంటల్లో మీకు మెసేజ్ వస్తుంది.
Step 7 - ఆ తర్వాత 1 అని టైప్ చేసి 183 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి.
Step 8 - ఆ తర్వాత ఆటోమేటెడ్ కాల్ వస్తుంది. కన్ఫామ్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.
Step 9 - కాన్ఫిగర్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డేటా ప్లాన్ ఎంచుకొని కంటిన్యూ చేయాలి.
Step 10 - ఒకవేళ నోటిఫికేషన్ రాకపోతే సెట్టింగ్స్‌లో జియో డేటా ప్లాన్ ఎంచుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Latest Technology, New smart phone