Emirates Airlines offer: ఫ్లైట్ బుక్ చేస్తే అదిరిపోయే ఆఫర్... ఇలా పొందండి

Emirates Airlines offer: ఫ్లైట్ బుక్ చేస్తే అదిరిపోయే ఆఫర్... ఇలా పొందండి (ప్రతీకాత్మక చిత్రం)

ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమాన ప్రయాణికులకు అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌లో టికెట్ బుక్ చేసిన ప్రయాణికులు ఆఫర్ ఎలా పొందాలో తెలుసుకోండి.

  • Share this:
కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభం అయిన నాటి నుంచి అంతర్జాతీయ విమానాలు అన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయిన విషయం తెలిసిందే. అన్లాక్ ప్రక్రియలో భాగంగా ఇప్పుడిప్పుడే ప్రయాణాలు పునరుద్దరించబడుతున్నాయి. పిపిఈ కిట్లు, కరోనా టెస్ట్ రిపోర్టులు, విమానాల రద్దు వంటివి 2020 ఏడాదిలో విమాన ప్రయాణాన్ని బాధాకరంగా మార్చాయి. కాగా, యూఏఈకి చెందిన విమానయాన సంస్థ ఎమిరేట్స్ తన ‘దుబాయ్ కనెక్ట్’ సేవలను తిరిగి ప్రారంభించడంతో ప్రయాణికుల బాధను తగ్గించాలని చూస్తోంది. అంతేకాకం, తమ ప్రయాణీకులకు బంపరాఫర్ను ప్రకటించింది. దీనిలో భాగంగా దుబాయ్‌కు వచ్చే ఎమిరేట్స్ ప్రయాణీకులకు అక్కడ ఉచిత హోటల్ బస సౌకర్యాన్ని కల్పించనుంది. మరో విమానానికి మారటానికి 10 గంటలకు పైగా దుబాయ్లో స్టే చెయ్యాలనుకునే వారికి ఎమిరేట్స్ విమానయాన సంస్థ ఫోర్- స్టార్ లేదా ఫైవ్ స్టార్ హోటల్‌లో ఉచిత బసతో పాటు ఉచిత భోజనం, యూఏఈ వీసా సహాయం కల్పిస్తుంది. కోవిడ్–19 వ్యాప్తితో యుఎఈ ఇన్‌బౌండ్, అవుట్‌బౌండ్, ట్రాన్సిట్ ప్యాసింజర్ విమానాలపై మార్చి 25 నుండి ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో ఎమిరేట్స్ తన అన్ని విమాన సర్వీసులను నిలిపివేసింది. కాగా, ఎమిరేట్స్ దుబాయ్ కనెక్ట్ సేవలు 2020 డిసెంబర్ 1 నుండి తిరిగి ప్రారంభం కానున్నాయి.

LIC Jeevan Labh policy: ఈ ఎల్ఐసీ పాలసీ తీసుకుంటే ప్రీమియం ఆపేసినా బెనిఫిట్స్ మీ సొంతం

IRCTC Ayodhya Tour: శ్రీరామ భక్తులకు శుభవార్త... అయోధ్య టూర్ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ

ఉచిత సేవలను ఎవరు అర్హులు?


ఫస్ట్ క్లాస్ లేదా ఎకానమీ క్లాస్ ప్రయాణికులు అనే తేడా లేకుండా, ఎమిరేట్స్ ప్రయాణికులందరూ, ఈ ఆఫర్‌ను పొందగలుగుతారు. ప్రయాణ అన్ని దశలలో అవసరయ్యే ఎంట్రీ, రెగ్యులేటరీ పత్రాలు (కోవిడ్–-19 నెగెటివ్ రిపోర్ట్) వంటివి మీ వద్ద ఉంచుకోవాలి. ఒకవేళ మీరు పిసిఆర్ పరీక్ష చేయించుకోవాల్సి వస్తే మాత్రం మీరు దుబాయ్ కనెక్ట్ సేవలకు అర్హులు కాదు.

రోజూ 3జీబీ డేటా ఇచ్చే Jio, Airtel, Vi ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే...

Aadhaar-PAN: మీ పాన్ కార్డు, ఆధార్ కార్డులో పేర్లు వేర్వేరుగా ఉంటే సరిచేయండి ఇలా

ఉచిత సేవలు ఎలా పొందాలి?


10 నుండి 24 గంటల కనెక్టింగ్ స్టాప్‌ ఓవర్ సమయంతో ప్రయాణీకులకు దుబాయ్ కనెక్ట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ సేవలు ఫస్ట్ క్లాస్, బిజినెస్, ఎకానమీ వంటి అన్ని క్యాబిన్ తరగతులకు వర్తిస్తాయి. రెండు ఎమిరేట్స్ విమానాల్లో ప్రయాణానికి బుక్ చేసుకున్న వారు మాత్రమే ఈ ఉచిత సేవలు పొందగలుగుతారు. కనెక్టింగ్ ఫ్లైట్ కోసం వేచి చూసే ప్రయాణీకుల సౌకర్యార్థం ఈ ఉచిత సేవలను అందిస్తుంది ఎమిరేట్స్. అయితే, సుదీర్ఘ లేఅవుర్ ఉన్న విమానాలను బుక్ చేసేవారు మాత్రం దీనికి అర్హులు కాదు. ఒకవేళ ఎవరైనా ప్రయాణీకులు కనెక్టింగ్ ఫ్లైట్ కోసం సుదీర్ఘమైన సమయం వేచి చూడాల్సి వస్తే అటువంటి వారికి ప్రత్యామ్నాయ హోటల్స్‌లో స్టే కల్పిస్తారు. అయితే, మీరు ఉచిత సేవలను పొందాలంటే మాత్రం దుబాయ్ ప్రయాణం కోసం విమానాన్ని ఎక్కే కనీసం 24 గంటల ముందు దుబాయ్ కనెక్ట్ సర్వీస్ డెస్క్‌ను సంప్రదించాలి. మీరు దుబాయ్ విమానాశ్రయంలో దిగినప్పుడు, ఉచిత బసతో కొనసాగడానికి ‘ఎరైవల్స్ సెక్షన్’లో దుబాయ్ కనెక్ట్ డెస్క్‌ను సంప్రదించవచ్చు.
Published by:Santhosh Kumar S
First published: