Home /News /technology /

pTron Bassbuds: పిట్రాన్​ ఇయర్​బడ్స్​ లాంచ్​.. బడ్జెట్​ ధరలోనే అదిరిపోయే సౌండ్ క్వాలిటీ.. ధర ఇంత తక్కువనా..

pTron Bassbuds: పిట్రాన్​ ఇయర్​బడ్స్​ లాంచ్​.. బడ్జెట్​ ధరలోనే అదిరిపోయే సౌండ్ క్వాలిటీ.. ధర ఇంత తక్కువనా..

పిట్రాన్​ ఇయర్​బడ్స్

పిట్రాన్​ ఇయర్​బడ్స్

ఇప్పటికే అనేక బడ్జెట్​ ఫ్రెండ్లీ ఇయర్​బడ్స్​ను లాంచ్​ చేసిన పిట్రాన్​ ఇప్పుడు మరో కొత్త వేరియంట్ ఇయర్​బడ్స్​ను ఆవిష్కరించింది. వీటిని కేవలం రూ. 1299 ధర వద్ద అందుబాటులోకి తెచ్చింది.

ప్రముఖ ఆడియో ఉత్పత్తుల సంస్థ పిట్రాన్​ (pTron) భారత మార్కెట్​లోకి బాస్​బడ్స్ టాంగో (Bassbuds Tango) టీడబ్ల్యూఎస్ ఇయర్​బడ్స్​ను లాంచ్​ చేసింది. సరసమైన ధరలోనే ఇయర్‌బడ్స్​, స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ బ్యాండ్‌లను తయారు చేయడంలో ఈ సంస్థకు మంచి పేరుంది. ఇప్పటికే అనేక బడ్జెట్​ ఫ్రెండ్లీ ఇయర్​బడ్స్​ను లాంచ్​ చేసిన పిట్రాన్​ ఇప్పుడు మరో కొత్త వేరియంట్ ఇయర్​బడ్స్​ను ఆవిష్కరించింది. వీటిని కేవలం రూ. 1299 ధర వద్ద అందుబాటులోకి తెచ్చింది. వీటి లాంచింగ్​తో బాస్​బడ్స్​​ శ్రేణిని మరింత విస్తరించింది. పిట్రాన్​ బాస్​బడ్స్ ఈఎన్​సీ క్రిస్టల్ స్పష్టమైన సౌండ్​ క్వాలిటీని అందిస్తుంది. మీ పరిసర శబ్దాలను సమర్ధవంతంగా ఫిల్టర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

ఈ కొత్త ఇయర్​బడ్స్​ లాంచింగ్​ గురించి పిట్రాన్​ వ్యవస్థాపకుడు & సీఈవో అమీన్ ఖ్వాజా మాట్లాడుతూ, "యువతరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బాస్‌బడ్స్ టాంగో ఇయర్​బడ్స్​ను లాంచ్​ చేస్తున్నాం. ఈ ఇయర్​బడ్స్​ అత్యుత్తమ సౌండ్​ క్వాలిటీని అందిస్తాయి. మూవీ మోడ్ ఫీచర్‌తో కూడిన ఈఎన్​సీ టెక్నాలజీతో వీటిని రూపొందించాం. ఆల్ ఇన్ వన్ ట్రెండీ డిజైన్‌లో ఆకట్టుకునేలా ఉంటాయి.

ఇది కూడా చదవండి: Google Search 2021: ఈ ఏడాది గూగుల్‌లో నెటిజన్లు ఎక్కువగా ఏం సెర్చ్ చేశారో తెలుసా?

అత్యుత్తమ సౌండ్, కనెక్టివిటీని కోరుకునే వ్యక్తులకు ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్​ బెస్ట్​ ఆప్షన్​గా చెప్పవచ్చు. తక్కువ లేటెన్సీ మూవీ మోడ్, సుదీర్ఘ బ్యాటరీ లైఫ్‌తో కూడిన ఈ ట్రూ వైర్​లెస్​ ఇయర్​బడ్స్​ సరసమైన ధర ట్యాగ్‌లోనే లభిస్తాయి.” అని తెలిపారు.

* పిట్రాన్​ టీడబ్ల్యూఎస్​ ఇయర్‌బడ్స్ ధర, లభ్యత

పిట్రాన్ బాస్​బడ్స్​ టాంగో టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్​ రూ. 1299 సరసమైన ధర వద్ద లభిస్తాయి. ఈ ఇయర్‌బడ్స్​ బ్లాక్, స్టోన్ వైట్‌తో సహా రెండు విభిన్న రంగు వేరియంట్లలో అందుబాటులో ఉంటాయి. వీటిని అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు.

ఇది కూడా చదవండి: UPI Payments: ఇకపై ఫీచర్ ఫోన్‌తో కూడా యూపీఐ చెల్లింపులు.. ఇంటర్నెట్ లేకుండా పనిచేసే పేమెంట్ సిస్టమ్

* పిట్రాన్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ స్పెసిఫికేషన్లు

పిట్రాన్ బాస్​బడ్స్​ టాంగో టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ 13mm డ్రైవర్లతో వస్తాయి. ఇవి బాస్-హెవీ, క్రిస్టల్ క్లియర్ సౌండ్ క్వాలిటీని అందిస్తాయి. ఇయర్‌బడ్స్​ వేగవంతమైన, సీమ్​లెస్​ కనెక్టివిటీ T5.1 కనెక్షన్‌తో వస్తాయి. పిట్రాన్​ 32 -బిట్ డీఎస్​పీ ప్రాసెసర్ ఎఫ్​పీయూ, హై-ఫై ఆడియో కోసం ఇన్​బిల్ట్​ ఏఏసీ కోడెక్, అకౌస్టిక్ ఎకో క్యాన్సిలేషన్ ద్వారా శక్తినిస్తాయి. ఈ ఇయర్‌బడ్స్​ 400mAh ఛార్జింగ్ కేస్‌తో వస్తాయి. ఇవి మొత్తం 20 గంటల ప్లేబ్యాక్‌ను అందిస్తాయి. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 3 గంటల ప్లేబ్యాక్‌ను అందిస్తాయి.​ డస్ట్​, వాటర్​ ప్రొటెక్షన్‌కు సంబంధించి IPX4 రేటింగ్​ కలిగి ఉంటాయి.
Published by:Sambasiva Reddy
First published:

Tags: Earbuds, Technology, Wireless

తదుపరి వార్తలు