Elon Musk Neuralink: ఎలన్‌మస్క్ సంచలనం... బ్రెయిన్‌లో కంప్యూటర్ చిప్ అమరిక

Elon Musk Neuralink: సైన్స్‌లో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. మెదడులో కంప్యూటర్ చిప్ ఏర్పాటుతో... సైన్స్ మరో అడుగు ముందుకేసినట్లైంది. అసలేంటి ఎలన్‌మస్క్ చేసింది? న్యూట్రాలింక్ అంటే ఏంటి?

news18-telugu
Updated: August 29, 2020, 8:05 AM IST
Elon Musk Neuralink: ఎలన్‌మస్క్ సంచలనం... బ్రెయిన్‌లో కంప్యూటర్ చిప్ అమరిక
ఎలన్‌మస్క్ సంచలనం... బ్రెయిన్‌లో కంప్యూటర్ చిప్ అమరిక (credit - youtube)
  • Share this:
Elon Musk Neuralink: మనం సినిమాల్లో చూస్తుంటాం... మనిషి మెదడులో కంప్యూటర్ చిప్ అమర్చినట్లు. రీసెంట్‌గా వచ్చిన ఇస్మార్ట్ శంకర్‌లో హీరో రామ్ మైండ్‌లో ఇలాగే కంప్యూటర్ చిప్ అమర్చుతారు. ఇవన్నీ సైన్స్ ఫిక్షన్ సినిమాలు మాత్రమే. కానీ... ఈ కాన్సెప్ట్‌ను నిజం చేసి చూపించారు బిలియనీర్, వ్యాపారవేత్త ఎలన్‌మస్క్. న్యూట్రాలింక్ పేరుతో... న్యూరోసైన్స్ స్టార్టప్‌ ప్రారంభించిన ఎలన్‌మస్క్... శుక్రవారం ఓ పంది బ్రెయిన్‌లో నాణెమంత సైజు ఉన్న కంప్యూటర్ చిప్ అమర్చారు. ఈ చిప్ పంది మెదడులో 2 నెలలపాటూ ఉంటుంది. పందికి ఉన్న రకరకాల అనారోగ్యాల్ని సరిచెయ్యాలన్నది ఈ చిప్ అసలు ఉద్దేశం. ఇది సక్సెస్ అయితే... మనుషుల మెదడుల్లో కూడా చిప్ పెట్టి... రకరకాల అనారోగ్యాల్ని సరిచేయాలన్నది అసలు ఉద్దేశం.


2016లో శాన్‌ఫ్రాన్సిస్కో‌లో ఎలన్‌మస్క్ సహ వ్యవస్థాపకుడిగా ఈ న్యూట్రాలింక్ కంపెనీ ఏర్పాటైంది. ఇది వైర్ లెస్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్‌లను బ్రెయిన్‌లో సెట్ చేయగలదు. తద్వారా వేల ఎలక్ట్రోడ్స్... అల్జీమర్స్, డైమెన్షియా, వెన్నెముక సమస్యల్ని సరిచేస్తాయి. మొత్తం మనుషులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక్కటవుతాయి.

"ఎవరికైనా మెమరీ లాస్, చెముడు, డిప్రెషన్, నిద్రలేమి లాంటి సమస్యలు ఉంటే... ఈ చిన్న పరికరం (8 మిల్లీమీటర్ల సైజున్న చిప్) ద్వారా... సరిచేయవచ్చు" అని ఎలన్‌మస్క్ తెలిపారు. "ఈ టెక్నాలజీ ద్వారా డబ్బు సంపాదించడం మా టార్గెట్ కాదు. మాతో కలిసి పనిచేసేలా గొప్పవాళ్లను న్యూట్రాలింక్‌కి తేవడమే లక్ష్యం" అన్నారాయ.


ఇప్పటికే... స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీలకు సీఈఓగా ఉన్నారు ఎలన్‌మస్క్. మార్స్ గ్రహానికి వన్ వే ట్రిప్పులో మనుషుల్ని పంపాలన్నది ఆయన ఆలోచన. అందుకు తగిన రాకెట్లను తయారుచేస్తున్నారు. తాజాగా ఈ న్యూట్రాలింక్ సంస్థకు కూడా భారీ మద్దతు లభించింది. దీనికి ఫండ్ రూపంలో రూ.1155 కోట్లు వచ్చాయి. ఇందులో ఒక్క ఎలన్‌మస్కే స్వయంగా... రూ.731కోట్లు ఇచ్చారు. ఈ కంపెనీలో దాదాపు 100 మంది పనిచేస్తున్నారు.

ఈ చిప్‌ని మనుషుల మెదడుల్లో పెట్టేందుకు ఈ సంవత్సరం చివరి నాటికి లైసెన్స్ పొందుతామని ఎలన్‌మస్క్ తెలిపారు. చిప్ అవసరం లేనప్పుడు దాన్ని బ్రెయిన్ నుంచి తీసివేసేందుకు కూడా వీలు ఉంటుందని ఆయన వివరించారు.
Published by: Krishna Kumar N
First published: August 29, 2020, 8:05 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading