హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Elon Musk: ఎలాన్‌ మస్క్‌ వరల్డ్‌ రికార్డ్‌.. అత్యధికంగా సంపద కోల్పోయిన జాబితాలో టాప్‌ ప్లేస్‌

Elon Musk: ఎలాన్‌ మస్క్‌ వరల్డ్‌ రికార్డ్‌.. అత్యధికంగా సంపద కోల్పోయిన జాబితాలో టాప్‌ ప్లేస్‌

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చరిత్రలో పెద్ద మొత్తంలో వ్యక్తిగత సంపద కోల్పోయిన వ్యక్తిగా ఎలాన్‌ మస్క్‌ నిలిచారు. 2021 నవంబర్ నుంచి 2022 డిసెంబర్ వరకు సుమారు 165 బిలియన్‌ డాలర్లు కోల్పోయినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన వెబ్‌సైట్‌లోని బ్లాగ్‌లో పేర్కొంది. మన కరెన్సీలో ఈ మొత్తం రూ.1,34,74,72,50,00,000 కావడం గమనార్హం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్‌ మస్క్‌ ప్రస్థానం తొలి నుంచీ సంచలనం. ఆయన అడుగుపెట్టిన ప్రతి రంగంలో అద్భుత ఫలితాలు సొంతం చేసుకున్నారు. అతి తక్కువ కాలంలోనే ప్రపంచ అత్యంత సంపన్నుల జాబితాలో మొదటి స్థానం దక్కించుకున్నారు. అయితే ఇటీవల కాలంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు విమర్శల పాలయ్యాయి. దీనికి తోడు ఆర్థికరంగం తిరోగమనం, కొవిడ్‌ సవాళ్లు ఉండటంతో మస్క్‌.. పెద్ద మొత్తంలో సంపద కోల్పోయిన రికార్డును కూడా సొంతం చేసుకున్నారు.

165 బిలియన్‌ డాలర్లు ఆవిరి

చరిత్రలో పెద్ద మొత్తంలో వ్యక్తిగత సంపద కోల్పోయిన వ్యక్తిగా ఎలాన్‌ మస్క్‌ నిలిచారు. 2021 నవంబర్ నుంచి 2022 డిసెంబర్ వరకు సుమారు 165 బిలియన్‌ డాలర్లు కోల్పోయినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన వెబ్‌సైట్‌లోని బ్లాగ్‌లో పేర్కొంది. మన కరెన్సీలో ఈ మొత్తం రూ.1,34,74,72,50,00,000 కావడం గమనార్హం. అంటే సుమారు 13.5 లక్షల కోట్ల రూపాయల సంపదను మస్క్ కోల్పోయారు. పబ్లిషర్ ఫోర్బ్స్ నుంచి అందిన డేటాపై ఆధారపడి ఈ గణాంకాలు అందజేసినట్లు తెలిపింది. అంతేకాకుండా ఎలాన్‌ మస్క్‌ కోల్పోయిన సంపద ఇంతకంటే ఎక్కువ ఉండవచ్చని గిన్నిస్ ఇతర వర్గాలు సూచించాయి.

ట్విట్టర్‌ కొనుగోలుతో టెస్లా పతనం?

గతేడాది ఎలాన్‌ మస్క్‌ మైక్రోబ్లాగింగ్‌ ప్లాట్‌ఫారం ట్విట్టర్‌ను 44 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సోషల్‌ మీడియా కంపెనీని కొన్న తర్వాత ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా షేర్ల విలువ భారీగా పతనమైంది. ట్విట్టర్‌ సొంతం చేసుకున్నప్పటి నుంచి టెస్లాపై మస్క్‌ శ్రద్ధ తక్కువైందని టెస్లా ఇన్వెస్టర్లు కూడా ఆరోపించారు. 2022 డిసెంబర్‌లో ఎలాన్‌ మస్క్ చేసిన ట్వీట్‌లో.. టెస్లా లాంగ్‌ టర్మ్‌ ఫండమెంట్స్‌ చాలా బలంగా ఉన్నాయని, షార్ట్‌ టర్మ్‌ మార్కెట్‌ ప్రతిస్పందనలు అనూహ్యమైనవని పేర్కొన్నారు.

టాప్‌ ప్లేస్‌కు బెర్నార్డ్‌ ఆర్నాల్ట్

అత్యధికంగా వ్యక్తిగత సంపద కోల్పోయిన రికార్డు జపనీస్‌ టెక్‌ ఇన్వెస్టర్‌ మసయోషి సన్‌ పేరిట ఉంది. ఆయన 2000వ సంవత్సరంలో 58.6 బిలియన్‌ డాలర్లు కోల్పోయారు. 2021 నవంబర్ నుంచి మస్క్ కోల్పోయిన సంపద ఆ రికార్డును అధిగమించింది. అయితే ఈ నష్టం ఆయన షేర్ల విలువపై ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తులో షేర్లు రాణిస్తే సంపదను ఎలాన్‌ మస్క్‌ తిరిగి పొందే అవకాశం ఉంది. డిసెంబర్‌లో టెస్లా బాస్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా తన స్థానాన్ని కోల్పోయాడు. ఫ్యాషన్ లేబుల్ లూయిస్ విట్టన్‌ను కలిగి ఉన్న ఫ్రెంచ్ లగ్జరీ గూడ్స్ కంపెనీ LVMH చీఫ్ ఎగ్జిక్యూటివ్ బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ వరల్డ్‌ రిచెస్ట్‌ పర్సన్‌గా అవతరించారు. ఫోర్బ్స్ ప్రకారం ఎలాన్‌ మస్క్ ఇప్పుడు 178 బిలియన్‌ డాలర్ల విలువైన సంపద కలిగి ఉన్నారు. బెర్నార్డ్ ఆర్నాల్ట్ 188 బిలియన్‌ డాలర్లతో ముందు ఉన్నారు.

తగ్గుతున్న టెస్లా డిమాండ్‌

2022లో టెస్లా షేర్ల విలువ దాదాపు 65 శాతం పడిపోయింది. కంపెనీ ఈ సంవత్సరంలో కేవలం 1.3 మిలియన్ వాహనాలను పంపిణీ చేసింది. వాల్ స్ట్రీట్ అంచనాల కంటే తక్కువ సంఖ్యలో సేల్స్‌ నమోదు చేసింది. ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్‌ కొనుగోలు చేసిన తర్వాత తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల ప్రభావం కూడా లేకపోలేదు. పెద్ద సంఖ్యలో సిబ్బందిని తొలగించడం, కంటెంట్ నియంత్రణ విధానాలు మార్చడం తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంది. షేర్ల క్షీణతపై వీటి ప్రభావాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. ఆర్థిక మాంద్యం భయాలు, పెరుగుతున్న పోటీ, కోవిడ్ లింక్డ్‌ ప్రొడక్షన్‌ ఛాలెంజెస్ మధ్య టెస్లా డిమాండ్ పడిపోతోంది. దీంతో టెస్లాపై మస్క్‌ పూర్తిగా దృష్టి సారించాలని ఎలక్ట్రిక్ వెహికల్‌ కంపెనీ పెట్టుబడిదారులు భావిస్తున్నారు.

First published:

Tags: Elon Musk, Twitter

ఉత్తమ కథలు