అంతరిక్షంలోకి వెళ్లే స్టార్ షిప్ రెడీ... వచ్చే ఏడాది మార్స్ చెంతకు ప్రయాణం

Elon Musk : భూమిపై విమానాల్లో ప్రయాణించినట్లు... అంతరిక్షంలోనూ ప్రయాణిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించిన ఎలన్ మస్క్... విమానం లాంటి స్పేస్ షిప్‌ను తయారుచేశారు. దీని ద్వారా... మార్స్ గ్రహాన్ని చేరుకోవచ్చని చెబుతున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: October 1, 2019, 11:13 AM IST
అంతరిక్షంలోకి వెళ్లే స్టార్ షిప్ రెడీ... వచ్చే ఏడాది మార్స్ చెంతకు ప్రయాణం
ఎలన్ మస్క్... స్టార్ షిప్ రెడీ... (Credit - Twitter - Spacex)
  • Share this:
Elon Musk : మార్స్ గ్రహంపైకి వన్ వే ట్రిప్‌గా ఆసక్తి ఉన్న ప్రజలను పంపుతానని ప్రకటించిన ఆమెరికా బిలియనీర్ వ్యాపారి ఎలన్ మస్క్... అన్నంత పనీ చేస్తున్నారు. మనుషుల్ని చందమామ, మార్స్ చెంతకు తీసుకెళ్లడం కోసం ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్... సరికొత్త విమానం తరహా స్పేస్ షిప్‌లను తయారుచేస్తోంది. ఇవి రాకెట్‌‌లా కాకుండా... విమానం లాగా... అంతరిక్షంలోకి వెళ్లి... గ్రహాలపై మనుషుల్ని దించేసి... తిరిగి ఖాళీగా వెనక్కి వచ్చేస్తాయి. గ్రహాలపైకి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. ఇందుకు రిటర్న్ ట్రిప్ అవకాశం కల్పించట్లేదు ఎలన్ మస్క్. వన్ వే ట్రిప్‌గా వెళ్లేందుకు ఆసక్తి ఉన్నవారే టికెట్ బుక్ చేసుకోమని సూచిస్తున్నారు. తాజాగా ఆయన ఆవిష్కరించిన స్పేస్‌షిప్‌లో వంద మంది ప్రయాణించేందుకు వీలుంది.


టెక్సాస్... బోకా చికాలో... ఎంతో మంది అంతరిక్ష ఔత్సాహికులు, రిపోర్టర్ల సమక్షంలో చందమామ, మార్స్‌పైకి పంపే స్టార్ షిప్‌ను ఆవిష్కరించారు ఎలన్ మస్క్. వచ్చే ఆరు నెలల్లో దాన్ని అంతరిక్షంలో ఓ రౌండ్ వేయించి... వచ్చే ఏడాది మనుషులను అందులో పంపాలనుకుంటున్నారు ఎలన్ మస్క్.
ఎప్పుడో పదకొండు ఏళ్ల కిందట ఫాల్కన్-1 రాకెట్‌ను తయారుచేసింది స్పేస్ ఎక్స్. అప్పటి నుంచీ అంతరిక్ష ప్రయాణాల కోసం ప్రయోగాలు చేస్తూనే ఉంది. ఇప్పుడు చేసిన కొత్త స్పేస్ షిప్ రాకెట్‌... 387 అడుగుల ఎత్తు ఉంది. ఇందులో మొదట ప్రయాణించబోయేది జపాన్ బిలియనీర్ యుసాకూ మాజవా అని 2018లో ఎలన్ మస్క్ ప్రకటించారు.

First published: October 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading