Home /News /technology /

Parag Agarwal: ట్విటర్​ సీఈవోగా భారతీయుడు పరాగ్​ నియామకం.. అపర కుబేరుడు ఎలన్​ మస్క్​ ట్వీట్​.. ఏమన్నారంటే..

Parag Agarwal: ట్విటర్​ సీఈవోగా భారతీయుడు పరాగ్​ నియామకం.. అపర కుబేరుడు ఎలన్​ మస్క్​ ట్వీట్​.. ఏమన్నారంటే..

ఎలన్ మస్క్​ (ఫైల్​)

ఎలన్ మస్క్​ (ఫైల్​)

ప్రముఖ కంపెనీలను ముందుకు నడిపించే భారతీయుల జాబితాలో పరాగ్​ అగర్వాల్ (Parag Agarwal)​ కూడా చేరారు. అయితే.. ట్విట్టర్ సీఈఓగా భారత వ్యక్తిని నియమించడంపై టెస్లా బిలియనీర్ ఎలోన్ మస్క్ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు.

ప్రపంచ స్థాయి టెక్​ దిగ్గజ కంపెనీల్లో భారతీయుల (Indians) హవా కొనసాగుతోంది. ఇప్పటికే గూగుల్​ సీఈవోగా సుందర్ పిచాయ్ (Sundar Pichai), మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల (Satya Nadella) నియమితులై భారత ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపజేయగా.. ఇప్పుడు, భారతీయ సంతతికి చెందిన మరో వ్యక్తి దిగ్గజ టెక్​ కంపెనీ ట్విట్టర్​కు సీఈవో (twitter CEO)గా నియమితులయ్యారు. అతనే పరాగ్​ అగర్వాల్ (Parag Agarwal)​. ప్రస్తుత ట్విట్టర్​ సీఈవో​ జాక్ డోర్సే తన పదవి నుంచి తప్పుకోవడంతో ఆయన స్థానంలో ట్విట్టర్​ చీఫ్​ టెక్నికల్ ఆఫీసర్​గా పని చేస్తున్న పరాగ్​ అగర్వాల్​ను బోర్డు ఏకగ్రీవంగా ఎన్నుకుంది.  పరాగ్​ నియామకంతో దాదాపు 16 ఏళ్ల తర్వాత సంస్థకు కొత్త సీఈవోను (new CEO) ఎన్నుకున్నారు. దీంతో ప్రముఖ కంపెనీలను ముందుకు నడిపించే భారతీయుల జాబితాలో పరాగ్​ అగర్వాల్​ కూడా చేరారు. అయితే.. ట్విట్టర్ సీఈఓగా భారత వ్యక్తిని నియమించడంపై  బిలియనీర్ ఎలోన్ మస్క్ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు. భారతీయ ప్రతిభ నుంచి అమెరికా చాలా ప్రయోజనం పొందింది అంటూ అని టెస్లా బాస్ మస్క్ ట్వీట్ చేశారు.

పరాగ్ అగర్వాల్ కూడా అత్యంత ప్రతిభావంతుడని..

మైక్రోసాఫ్ట్, అడోబ్, ఐబిఎమ్, గూగుల్ వంటి ప్రపంచంలోని అగ్రశ్రేణి టెక్ కంపెనీలకు (Tech companies) నాయకత్వం వహిస్తున్న భారతీయ సంతతి వ్యక్తులపై పాట్రిక్ కొల్లిసన్ చేసిన ఓ ట్వీట్‌కు ఆయన సమాధానమిచ్చారు. గూగుల్-పెరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ CEOగా సుందర్ పిచాయ్ (sunder Pichai), మైక్రోసాఫ్ట్ CEOగా సత్య నాదెళ్ల సేవలందిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. అలాంటి ప్రముఖ US టెక్ సంస్థకు నాయకత్వం వహించనున్న పరాగ్ అగర్వాల్ కూడా అత్యంత ప్రతిభావంతుడని కొనియాడారు. దీంతో ఎలన్ మస్క్​ స్పందిస్తూ.. భారతీయులు చాలా ప్రతిభావంతులని కొనియాడారు. వారి ప్రతిభతో అమెరికా (America) ప్రయోజనం పొందుతోందని అన్నారు. కాగా.. ఎలన్ మస్క్ ట్విట్‌పై చాలామంది స్పందిస్తూ రీట్విట్ చేస్తున్నారు. వారంతా అత్యంత ప్రతిభావంతులని కొనియాడుతున్నారు.

బాంబే ఐఐటీలో ఇంజనీరింగ్..

ప్రస్తుత ట్విట్టర్ సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌ బాంబే ఐఐటీలో ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేశారు. 2011లో ట్విట్టర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా చేరి తన ప్రతిభతో 2018లో ట్విటర్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ (సీటీవో)గా హోదా చేజిక్కించుకున్నారు. మరో 4 ఏళ్లలోపే ట్విట్టర్ ముఖ్య కార్యనిర్వాహణాధికారిగా ఎదిగారు.



గూగుల్ సంస్థకు..

గూగుల్ సంస్థకు మన భారతీయుడు సుందర్​ పిచాయ్​ సీఈవోగా కొనసాగుతున్నారు. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్​ కు కూడా ఆయనే సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

టెక్​ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఛైర్మన్‌గా ఈ ఏడాది జూన్ 16న నియమితులయ్యారు సత్య నాదెళ్ల. అంతకుముందు అంటే 2014 ఫిబ్రవరి 4వ తేదీన మైక్రోసాఫ్ట్ సంస్థకు సీఈవోగా బాధ్యతలు చేపట్టి ఆశ్చర్యపరిచారుహైదరాబాద్‌లో జన్మించిన శంతను నారాయణ్ 2007 నుంచి అడోబ్​ కంపెనీకి సీఈవోగా కొనసాగుతున్నారు. ఈ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కంపెనీని ఆయన తన తెలివి ప్రతిభతో ముందుండి నడిపిస్తున్నారు.భారతీయ సంతతికి చెందిన అరవింద్​ కృష్ణ టెక్​ దిగ్గజం ఐబీఎంకు జనవరి 2020లో సీఈఓగా ఎంపికయ్యారు. కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆయన చదువు పూర్తి చేశారు.భారతదేశంలోని ఘజియాబాద్‌లో జన్మించిన నికేశ్ అరోరా ప్రముఖ సైబర్ సెక్యూరిటీ కంపెనీ పాలో ఆల్టో నెట్‌వర్క్స్ కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఛైర్మన్‌గా పని చేస్తున్నారు
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Elon Musk, Tweets, Twitter

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు