Elon Musk: సంపాదనలో జెఫ్ బెజోస్‌ను వెనక్కి నెట్టేసిన ఎలన్ మస్క్

Elon Musk Net Worth | గత ఐదు వారాల్లో ఎలస్ మస్క్ సంపాదన 13.5 బిల్లియన్ డాలర్లు(రూ.94 వేల కోట్లు) పెరిగినట్లు బ్లూమ్‌బెర్గ్ అంచనావేసింది. జనవరి మాసంలో అమెజాన్ బెజోస్  9 బిల్లియన్ డాలర్లు(రూ.64 వేల కోట్లు) సంపాదనతో...రెండో స్థానంలో ఉన్నారు.

news18-telugu
Updated: February 4, 2020, 5:58 PM IST
Elon Musk: సంపాదనలో జెఫ్ బెజోస్‌ను వెనక్కి నెట్టేసిన ఎలన్ మస్క్
టెస్లా మోటార్స్ సీఈవో ఎలన్ మస్క్(ఫైల్ ఫోటో)
  • Share this:
ప్రముఖ పారిశ్రామిక వేత్త, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ సంపాదనలో అందరినీ మించిపోతున్నాడు. 2020లో ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యధిక సంపాదన ఆయనే ఆర్జించినట్లు బ్లూమ్‌బెర్గ్ అంచనావేసింది. ప్రపంచంలో అత్యంత సంపన్నుడైన అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్‌ను కూడా ఆయన వెనక్కి నెట్టేశాడు. సోమవారం ఒక్క రోజే టెస్లా మోటార్స్ షేర్ ధర 20 శాతం పెరిగి 780 డాలర్లకు చేరుకుంది. 2013 తర్వాత టెస్లా మోటార్స్ ధర ఈ స్థాయిలో లాభపడడం ఇదే తొలిసారి. గత ఐదు వారాల వ్యవధిలోనే టెస్లా షేర్లు ఏకంగా 86శాతం లాభపడ్డాయి. దీంతో ఐదు వారాల్లో ఎలస్ మస్క్ సంపాదన 13.5 బిల్లియన్ డాలర్లు(రూ.94 వేల కోట్లు) పెరిగినట్లు బ్లూమ్‌బెర్గ్ అంచనావేసింది. జనవరి మాసంలో అమెజాన్ బెజోస్  9 బిల్లియన్ డాలర్లు(రూ.64 వేల కోట్లు) సంపాదనతో...రెండో స్థానంలో ఉన్నారు.

పేపల్, టెస్లా మోటార్స్, స్పేస్ఎక్స్ తదితర కంపెనీల వ్యవస్థాపకుడైన ఎలన్ మస్క్ ప్రపంచంలో 35వ సంపన్నుడుగా 2020 సంవత్సరాన్ని మొదలుపెట్టారు. ప్రస్తుతం 41 బిల్లియన్ డాలర్ల(రూ.2.87 లక్షల కోట్లు) ఆస్తులతో ఆయన ప్రపంచంలో 22వ సంపన్నుడిగా ఎదిగిపోయాయి. 2020లో అత్యధిక సంపాదన ఆర్జించిన సంపన్నుడు ఎలన్ మస్క్ కావడం విశేషం.


elon musk net worth, elon musk quotes, elon musk age, elon musk companies, elon musk car, elon musk news, elon musk wife, elon musk weath, elon musk who is he, ఎలన్ మస్క్ సంపాదన, ఎలన్ మస్క్ వయస్సు, ఎలన్ మస్క్ ఎవరు
ఎలన్ మస్క్(ఫైల్ ఫోటో)


ప్రస్తుతం టెస్లా మోటార్స్‌లో ఐదోవంత షేర్లు ఎలన్ మస్క్ సొంతం. నెలక్రితం టెస్లా మార్కెట్ విలువ 100 బిల్లియన్ డాలర్లుగా ఉండగా..సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి ఇది 140.6 బిల్లియన్ డాలర్లకు చేరిందని అంచనావేస్తున్నారు. నాలుగో త్రైమాసంలో అంచనాలను మించి టెస్లా భారీ లాభాలను నమోదు చేసుకుంటుంటుందన్న అంచనాలతో వాల్‌స్ట్రేట్‌లో టెస్లా షేర్లు భారీగా లాభపడుతున్నాయి. టెస్లా షేర్లు భారీ లాభాలకు తోడు జీతభత్యాల రూపంలోనూ ఎలన్ మస్క్ భారీ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.

elon musk net worth, elon musk quotes, elon musk age, elon musk companies, elon musk car, elon musk news, elon musk wife, elon musk weath, elon musk who is he, ఎలన్ మస్క్ సంపాదన, ఎలన్ మస్క్ వయస్సు, ఎలన్ మస్క్ ఎవరు
ఎలన్ మస్క్(ఫైల్ ఫోటో)


నాలుగో త్రైమాసిక అంచనాలతో పాటు మోడల్ వై క్రాసోవర్ కారు తయారీ వేగవంతం చేయడం వంటి కారణాలతో టెస్లా షేర్లు పైపైకి దూసుకుపోతున్నాయి. 2025 నాటికి రెండు నుంచి మూడు మిలియన్ల వాహనాలు విక్రయించనుందని అంచనావేస్తున్నారు. చైనాలో మోడల్ వై తయారీ కోసం త్వరలో ప్లాంట్‌ను ప్రారంభించనుంది టెస్లా మోటార్స్.
First published: February 4, 2020, 10:44 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading