Home /News /technology /

Elon Musk: కోతి మెదడులో చిప్ పెట్టిన ఎలన్ మస్క్.. వీడియో గేమ్స్ ఆడుతూ ఏం చేసిందంటే...

Elon Musk: కోతి మెదడులో చిప్ పెట్టిన ఎలన్ మస్క్.. వీడియో గేమ్స్ ఆడుతూ ఏం చేసిందంటే...

కోతి మెదడులో చిప్ పెట్టిన ఎలన్ మస్క్ (ప్రతీకాత్మక చిత్రం  - File Image)

కోతి మెదడులో చిప్ పెట్టిన ఎలన్ మస్క్ (ప్రతీకాత్మక చిత్రం - File Image)

Elon Musk: టెక్నాలజీతో ఆటాడుకుంటున్న ఎలన్ మస్క్... రోజుకో ప్రకటన చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు. మరి ఈ కోతేంటో... ఆ చిప్ ఏంటో తెలుసుకుందాం.

    Elon Musk: ప్రైవేట్ రోదసీ పరిశోధనా సంస్థ... స్పేస్ఎక్స్ (SpaceX), టెస్లా (Tesla) కార్ల కంపెనీ సీఈఓ ఎలన్ మస్క్ దాదాపు ప్రతి రోజూ ట్రెండింగ్‌లో ఉంటున్నారు. మార్స్ నుంచి మంకీ వరకూ ఆయన ఏదో ఒక కొత్త విషయం చెబుతూ ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్ అవుతున్నారు. చాలా సందర్భాల్లో షాకింగ్ విషయాలు చెబుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అలాంటి విషయమే చెప్పారు. దాన్ని తెలుసుకునే ముందు మనం ఓ విషయాన్ని తెలుసుకోవాలి. ఏంటంటే... ఎలన్ మస్క్... న్యూట్రాలింక్ కార్పొరేషన్ అనే కంపెనీతో టై-అప్ అయ్యారు. ఇదో ఫ్యూచర్ కి సంబంధించిన ప్రాజెక్టులు చేసే స్టార్టప్ కంపెనీ. ప్రస్తుతం ఇది బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ తయారుచేస్తోంది. అంటే... మన మెదడులోనే ఓ చిప్ పెట్టి... దాని ద్వారా పనులు చేసుకోవడం అన్నమాట. అందులో భాగంగానే తాము ఓ కోతి మెదడులో వైర్లతో ఓ చిప్ లాంటిది పెట్టామని చెప్పారు. ఆ చిప్ లాంటి పరికరం కారణంగా కోతి... ఇప్పుడు తన సొంత మెదడుతో వీడియో గేమ్స్ ఆడగలుగుతోందని వివరించారు. క్లబ్‌హౌస్ ఇంటర్వ్యూలో చెప్పిన ఈ విషయం ఇప్పుడు వైరల్ అయ్యింది.

    "ఆ కోతిని చూస్తే... ఎక్కడ మేము పరికరాన్ని సెట్ చేశామో మీరు చూడలేరు. ప్రస్తుతం ఆ కోతి సంతోషంగా ఉంది. కోతుల కోసం మా దగ్గర ప్రపంచంలోనే అత్యుత్తమ సౌకర్యాలు ఉన్నాయి. మేం కోతులు ఆడుకునేలా చేస్తున్నాం." అని ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన ఎలన్ మస్క్ చెప్పారు.

    ఎందుకీ ప్రాజెక్టు?
    మన బాడీలో మెదడు కీలకమైనది. ఇతర ఏ అవయవాలైనా పనిచేయాలంటే మెదడు సరిగా ఉండాలి కదా. ఐతే ప్రమాదాలు జరిగినప్పుడు బ్రెయిన్, వెన్నెముఖ వంటివి దెబ్బతింటున్నాయి. అలాంటి వారికి ఈ తరహా బ్రెయిన్ చిప్ మేలు చేస్తుందన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. "మీరు ఆ వైర్లతో ఉన్న పరికరాన్ని బయటకు చూడలేరు. అది తలలోపలే ఉంటుంది. చిన్నగా ఉంటుంది. దాని వైర్లు మెదడుతో టచ్ అవుతాయి" అని ఎలన్ మస్క్ తెలిపారు.


    ఈ వార్త తెలియగానే నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కాస్త టైమ్ ఉన్నవారు మీమ్స్ కూడా తయారుచేస్తున్నారు. అలాంటి వాటిలో కొన్ని మీరూ చూడండి.





     
    ఇది కూడా చదవండి: Horoscope Today: ఫిబ్రవరి 2 రాశి ఫలాలు... ఉద్యోగ, వ్యాపారాల్లో చక్కని ఫలితాలు

    మొత్తానికి ఇలాంటి కొత్త కొత్తవి చేస్తూనే ఎలన్ మస్క్ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా యువత ఎలన్ మస్క్ గురించి తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తోంది.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Elon Musk

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు