Twitter: ట్విట్టర్(Twitter) కొత్త హంగులు అద్దుకుంటోంది. కొత్త రంగుల టిక్‌లను ఇక మనం దీనిలో చూడబోతున్నాం. కొత్త అధినేత చేతుల్లోకి వచ్చిన తర్వాత కొత్త మార్పులు ఏ సంస్థలో అయినా సహజమే. అందుకే ఎలాన్ మస్క్ చేతుల్లోకి మారిన తర్వాత ట్విట్టర్లో ఎన్నో మార్పులను మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఆ సంస్థ ఈ మధ్యనే నిలిపి వేసిన ట్విట్టర్ బ్లూని ఇప్పుడు పునః ప్రారంభిస్తామని సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్(Elon Musk) ప్రకటించారు. బ్లూ చెక్ మార్క్‌తోపాటు కొత్తగా గోల్డ్, గ్రే టిక్ మార్క్‌లు కూడా రానున్నాయని చెప్పారు.
ట్విట్టర్లో గోల్డ్, గ్రే, బ్లూ చెక్ మార్కులను తాత్కాలికంగా తిరిగి పరిచయం చేస్తున్నట్లు మస్క్ తెలిపారు. డిసెంబర్ 2వ తేదీ శుక్రవారం నాడు ట్విట్టర్ (Twitter) తన బ్లూ సేవలను తిరిగి ప్రారంభించనుందని చెప్పుకొచ్చారు. ఈ అప్డేటెడ్ సర్వీసులో వివిధ ఎంటిటీలను బట్టి చెక్ మార్కుల రంగుల్లో మార్పులు ఉంటాయని తెలిపారు. ‘ఆలస్యం అయినందుకు క్షమించండి. మేము తాత్కాలికంగా వెరిఫైడ్ ట్విట్టర్ బ్లూని తిరిగి శుక్రవారం ప్రారంభిస్తున్నాం. ఈ మార్పు బాధాకరమే కాని సంస్థకు ఎంతో అవసరం’ అని మస్క్ ఒక ట్వీట్లో తెలిపారు.
కంపెనీలకు గోల్డ్ టిక్
ఎలాన్ మస్క్ తెలిపిన వివరాలను బట్టి చూస్తే ఇప్పుడు ట్విట్టర్‌లోని కంపెనీ ఖాతాలకు గోల్డ్ చెక్ మార్కు, ప్రభుత్వానికి సంబంధించిన ఖాతాలకు గ్రే చెక్ మార్కు రానున్నాయి. వ్యక్తులకు నీలం రంగు (ప్రముఖులకు మాత్రమే అనే నియమం లేదు) చెక్ మార్కు రానుంది. మాన్యువల్‌గా అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ చెక్ మార్కులు యాక్టివేట్ కానున్నాయి.
ఎనిమిది డాలర్లకు టిక్ మార్క్
ఎలాన్ మస్క్ ట్విట్టర్ బ్లూ (Twitter Blue)ను సబ్‌స్క్రైబ్ చేసుకునేందుకు ధరను ఎనిమిది డాలర్లుగా నిర్ణయించారు. డిసెంబర్లో తిరిగి ప్రారంభం అయ్యే ఈ సేవకు ఇదే ధర వర్తిస్తుంది. ఈ నెల ప్రారంభంలో మస్క్ కంపెనీలు, వ్యక్తులు, ఇతర సంస్థలకు సంబంధించిన ట్విట్టర్ ఖాతాలకు ఎనిమిది డాలర్లు కట్టిన ఎవరికైనా బ్లూటిక్ ఇచ్చేశారు. దీంతో అందులో చాలా బోగస్ ఖాతాలూ బయటపడ్డాయి. దీంతో మస్క్‌పై వివర్శల వర్షం కురిసింది. ఆయన బోగస్ ఖాతాలనూ పెంచి పోషిస్తున్నారని అపవాదును ఎదుర్కొన్నారు. దీంతో ఆయన ఆ సేవను తాత్కాలికంగా రద్దు చేశారు.
తగిన జాగ్రత్తలు తీసుకుని ఇప్పుడు ఈ సర్వీసును పునరుద్దరిస్తున్నారు.
Lava Blaze NXT: ఇండియాలో లావా బ్లేజ్ NXT స్మార్ట్‌ఫోన్ లాంచ్..ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..
ఇంతకు ముందు ఈ బోగస్ ఖాతాలకు బ్లూ మార్క్ విషయంపైనా ఎలాన్ మస్క్ ఓ ట్వీట్ చేశారు. చాలా బోగస్ ఎకౌంట్లు బ్లూ టిక్‌ను తీసుకుంటున్నాయని వీటిని ఆపేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందుకుగాను ఈ బ్లూటిక్ సర్వీసును ఆపివేస్తున్నట్లు చెప్పారు. ఎలి లిల్లీ అనే ఖాతా నుంచి ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ తన క్లయింట్లకు ఉచిత ఇన్సులిన్‌ను అందజేస్తుందని ట్వీట్ వచ్చింది. దీంతో ఆ కంపెనీ స్టాక్ విలువ భారీగా పడిపోయింది. సరైన మానిటరింగ్ లేకుండా అందరికీ బ్లూటిక్‌లు ఇస్తుండటం వల్ల ఇలాంటి సంఘటనలు చాలా వెలుగులోకి వచ్చాయి. అయితే రీలాంచ్ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనేది వేచి చూడాలి. మాన్యువల్ మానిటరింగ్‌తో పరిస్థితులు చక్కబడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.