హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Elon Musk Resign: ట్విట్టర్ సీఈవోగా దిగిపోతా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన! కానీ ఇక్కడో ట్విస్ట్!

Elon Musk Resign: ట్విట్టర్ సీఈవోగా దిగిపోతా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన! కానీ ఇక్కడో ట్విస్ట్!

Elon Musk Resign: ట్విట్టర్ సీఈవోగా దిగిపోతా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన! కానీ ఇక్కడో ట్విస్ట్!

Elon Musk Resign: ట్విట్టర్ సీఈవోగా దిగిపోతా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన! కానీ ఇక్కడో ట్విస్ట్!

Twitter CEO | ఎప్పుడూ ఏదో ఒక రకంగా ఎలాన్ మస్క్ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా ఈయన ఒక సంచలన ప్రకటన చేశారు. ట్విట్టర్ సీఈవో పదవి నుంచి తప్పుకుంటానని వెల్లడించారు. అయితే ఒక మెలిక పెట్టారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Elon Musk News | ప్రపంచ కుబేరుడు, టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk) సంచలన ప్రకటన చేశారు. ట్విట్టర్ సీఈవోగా తప్పుకుంటానని వెల్లడించారు. అయితే ఇక్కడ ఒక మెలిక పెట్టారు. తనకు రిప్లేస్‌మెంట్ లభిస్తే.. ట్విట్టర్ (Twitter) సీఈవో పదివి నుంచి దిగిపోతానని వెల్లడించారు. ట్విట్టర్ వేదికగానే ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా ఈయన ఇటీవలనే ట్విట్టర్‌లో ఒక పోల్ నిర్వహించారు. ట్విట్టర్ సీఈవోగా ఉండాలా? వద్దా? అనే అంశంపై ఈ పోల్ జరిగింది. ఇందులో సీఈవో పదివి నుంచి తప్పుకోవాలని ఎక్కువ మంది ఓటు వేశారు.

‘ఉద్యోగంలో చేరేంత మూర్ఖుడు దొరికిన వెంటనే సీఈవో పదవికి రాజీనామా చేస్తాను. ఆ తర్వాత నేను సాఫ్ట్‌వేర్ అండ్ సర్వర్‌ల బృందాలను నడిపిస్తాను‘ అని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ఎలాన్ మస్క్ ఇలాంటి ప్రకటన చేయడం ఇదే తొలిసారి. మస్క్ పదవీ నుంచి తప్పుకోవాలని వాల్ స్ట్రీట్ గత కొన్ని వారాలుగా పేర్కొంటూ వస్తోంది.

రైతులకు మోదీ న్యూ ఇయర్ గిఫ్ట్.. అకౌంట్లలోకి పీఎం కిసాన్ డబ్బులు?

అంతేకాకుడా ఇటీవల టెస్లా కంపెనీ కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై ఎలాన్ మస్క్ ఫోకస్‌ను ప్రశ్నించింది.  ట్విట్టర్ మీద ఎక్కువగా దృష్టి సారించారని, దీని వల్ల టెస్లాపై ప్రతికూల ప్రభావం పడొచ్చని పేర్కొంది. టెస్లా కంపెనీలో మస్క్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ప్రొడక్ట్ డిజైన్, ఇంజినీరింగ్ వంటి అంశాల్లో ఈయనే కీలకం. ట్విట్టర్ వల్ల టెస్లా స్టీరింగ్‌ను సరిగా నడిపించలేక పోతున్నారని విమర్శలు నానాటికీ పెరిగిపోతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎలాన్ మస్క్ కూడా ట్విట్టర్ సీఈవో పదివి నుంచి తప్పుకుంటానని వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కంపెనీ బంపరాఫర్.. ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.20 వేల తగ్గింపు!

ఎలాన్ మస్క్ కూడా ట్విట్టర్ విషయంలో ఎక్కువగా ఫోకస్‌గా చేసినట్లు అంగీకరించారు. ట్విట్టర్ కొత్త సీఈవో కోసం చూస్తున్నానని వెల్లడించారు. అయితే సరైన వారసుడు లభించలేదని తెలిపారు. వాస్తవానికి ట్విటర్‌ను సజీవంగా ఉంచగల ఉద్యోగాన్ని ఎవరూ కోరుకోరు అని ఆయన అన్నారు. అయితే ఎలాన్ మస్క్ ట్విట్టర్ పదివి నుంచి నిజంగానే తప్పుకుంటారా? అంటే కొత్త బాస్ వచ్చే వరకు ఈ విషయం ఎవ్వరికీ తెలీదు. ఎందుకంటే మస్క్ మాట మారుస్తారు. ట్విట్టర్ డీల్ విషయంలో కూడా ఇలానే జరిగింది. ముందు కొనుగోలు చేస్తానని చెప్పి, తర్వాత వెనక్కి తగ్గారు. మళ్లీ చివరకు కొనుగోలు చేశారు.

First published:

Tags: Elon Musk, Twitter

ఉత్తమ కథలు