హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Twitter: 8 డాలర్లకు ట్విట్టర్ 'బ్లూ' సర్వీస్‌ లాంచింగ్ మరోసారి వాయిదా..మస్క్ మనసులో ఏముంది?

Twitter: 8 డాలర్లకు ట్విట్టర్ 'బ్లూ' సర్వీస్‌ లాంచింగ్ మరోసారి వాయిదా..మస్క్ మనసులో ఏముంది?

ఎలన్ మస్క్

ఎలన్ మస్క్

ట్విట్టర్ బ్లూ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ విషయంలో ఎలాన్ మస్క్ మరోసారి వెనకడుగు వేశారు. ట్విట్టర్‌ బ్లూ ప్రక్రియతో ఎలాంటి అవకతవకలు జరగవని, ప్రజలు అందరికీ పూర్తి నమ్మకం వచ్చిన తర్వాతనే రీలాంచ్‌ చేస్తామని ప్రకటించారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Twitter: బిగ్గెస్ట్‌ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌(Twitter)ను ఎలాన్‌ మస్క్‌(Elon Musk) కొనుగోలు చేసిన తర్వాతా చాలా వివాదాస్పద నిర్ణయాలు తీసుకొన్నారు. పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించడం పెద్ద దుమారాన్నే రేపింది. అనంతరం ఆయన జారీ చేసిన కొన్ని మార్గదర్శకాలతో విసుగు చెందిన చాలా మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా కంపెనీని విడిచిపెట్టారు. ఈ క్రమంలోనే ట్విట్టర్‌ బ్లూ(Twitter Blue)కి ప్రైస్‌ చెల్లించి ఎవరైనా పొందవచ్చనే పద్ధతిని ఎలాన్‌ మస్క్‌ ఇంట్రడ్యూస్‌ చేశారు. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. సక్రమంగా అకౌంట్స్‌ను వెరిఫై చేయడంలో ట్విట్టర్‌ విఫలం కావడంతో భారీ పొరపాట్లు చోటు చేసుకొన్నాయి. ఈ వరుస ఘటనలతో ఎలాన్‌ మస్క్‌ ఈ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ విషయంలో మరోసారి వెనకడుగు వేశారు. ట్విట్టర్‌ బ్లూ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగవని, ప్రజలు అందరికీ పూర్తి నమ్మకం వచ్చిన తర్వాతనే దీన్ని రీలాంచ్‌ చేస్తామని ప్రకటించారు.

ట్విట్టర్‌ కొత్త సీఈవో ఎలాన్‌ మస్క్, ఇటీవల ట్విట్టర్‌ బ్లూ టిక్‌ అకౌంట్‌ సేవలకు వినియోగదారులు నెలకు 8 డాలర్లు చెల్లించాలని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ఈ విధానాన్ని రీలాంచ్‌ చేసే నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు తాజాగా ట్వీట్‌ చేశారు. ప్రజలకు ఎలాంటి అవకతవకలు జరగవని, పూర్తి విశ్వాసం వచ్చాకే ట్విట్టర్‌ బ్లూ సేవలను తిరిగి లాంచ్‌ చేస్తామని ట్వీట్‌ చేశారు. వ్యక్తుల కంటే సంస్థల కోసం డిఫరెంట్‌ కలర్స్‌(Different Colors) చెక్‌లను ఉపయోగిస్తామని తెలిపారు.

Pangeos: అబ్బురపరుస్తున్న ఫ్లోటింగ్‌ సిటీ ‘పాంగియోస్‌’ డిజైన్‌.. సముద్రంలో తేలియాడే నగరం ప్రత్యేకతలు ఇవే..

ఫేక్ అకౌంట్స్ సమస్య

మస్క్ ట్విట్టర్ బ్లూను పరిచయం చేసిన తర్వాత.. వివిధ కంపెనీల పేరిట బోగస్ వెరిఫైడ్‌ అకౌంట్లు క్రియేట్‌ అయ్యాయి. ప్రసిద్ధ కంపెనీలు, వ్యక్తులను అనుకరించడానికి చాలా మంది ప్రయత్నించారు. అమెరికాలో ఓ ఫార్మా కంపెనీ పేరిట నకిలీ వెరిఫైడ్‌ అకౌంట్ ఓపెన్‌ చేసిన కొందరు నెగెటివ్‌ న్యూస్ ప్రకటించడంతో.. ఆ కంపెనీ వ్యాల్యూ స్టాక్‌ మార్కెట్‌లో భారీగా పతనమైంది. ఆ ఫేక్ అనౌన్స్‌మెంట్ చేసిన ట్విట్టర్‌ అకౌంట్‌ తమది కాదని సంబంధిత కంపెనీ ప్రకటించాల్సిన పరిస్థితి నెలకొంది.

యాక్టివ్‌ యూజర్స్‌ పెరిగినట్లు ప్రకటన

ట్విట్టర్‌ బ్లూ నిర్ణయం సరైంది కాదని టెక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. నగదు చెల్లించి అందరూ వెరిఫైడ్‌ అకౌంట్స్‌ పొందితే.. ఎవ్వరికీ వెరిఫైడ్‌ అకౌంట్స్‌(Verified Accounts) లేవని నిర్ధారించుకోవాలని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులు వెరిఫికేషన్‌ను పేమెంట్‌ ఫీచర్‌గా మార్చాలనే నిర్ణయాన్ని విమర్శించారు. ఎలాన్‌ మస్క్ వాస్తవానికి ఫ్రీ స్పీచ్‌,ట్విట్టర్‌ బాట్స్‌ సమస్యల గురించి పట్టించుకోవాలని ఆరోపణలు చేశారు. ఉద్యోగుల తొలగింపులు, స్వచ్ఛంద రాజీనామాలు, ట్విట్టర్‌ బ్లూ వివాదాల నడుమ.. గత వారంలో ట్విట్టర్ 1.6 మిలియన్ల రోజువారీ యాక్టివ్‌ యూజర్లను(Active Users) పెంచుకుందని, ఇది మరొక ఆల్-టైమ్ హై అని ఎలాన్‌ మస్క్‌ ప్రకటించడం గమనార్హం.

First published:

Tags: Elon Musk, Twitter

ఉత్తమ కథలు