హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Twitter: ఎలాన్‌ మస్క్‌ రాకతో పూర్తిగా మారిన ట్విట్టర్.. యూజర్లకు నచ్చని మార్పులు!

Twitter: ఎలాన్‌ మస్క్‌ రాకతో పూర్తిగా మారిన ట్విట్టర్.. యూజర్లకు నచ్చని మార్పులు!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, టీమ్‌లను తొలగించడం సహా కంపెనీలో, పోర్టల్‌లో భారీ మార్పులకు మస్క్ తెరతీశారు. అయితే ఈ మార్పులు యూజర్లను ఇంప్రెస్ చేస్తున్నాయా అంటే లేదనే సమాధానం చెప్పాలి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Twitter: ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన ఎలాన్‌ మస్క్‌(Elon musk), గత మైక్రో బ్లాగింగ్ పోర్టల్ ట్విట్టర్‌ను(Twitter) టేకోవర్ చేశాడు. అయితే మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేయకముందే మొదలైన వివాదాలు, కంపెనీ ఆయన చేతుల్లోకి వచ్చిన తర్వాత కూడా కొనసాగుతున్నాయి. 2022 అక్టోబర్‌లో ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, టీమ్‌లను తొలగించడం సహా కంపెనీలో, పోర్టల్‌లో భారీ మార్పులకు మస్క్ తెరతీశారు. అయితే ఈ మార్పులు యూజర్లను ఇంప్రెస్ చేస్తున్నాయా అంటే లేదనే సమాధానం చెప్పాలి.

మస్క్‌ ఈ మైక్రో బ్లాగింగ్‌ ప్లాట్‌ఫారంను కొనుగోలు చేసిన సమయంలో.. ట్విట్టర్‌ను స్వేచ్ఛగా మాట్లాడేందుకు వేదికగా మారుస్తామని, మరింత ఆదాయం వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఎలా మనీ జనరేట్‌ చేస్తారనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. కానీ కొన్ని నెలలుగా ట్విట్టర్‌లో వస్తున్న మార్పులను అందరూ గమనిస్తున్నారు. 44 బిలియన్‌ డాలర్‌లకు కొనుగోలు చేసిన కంపెనీ నుంచి ఆదాయం రాబట్టే మస్క్‌ ప్లాన్‌లు తెలుస్తున్నాయి. అయితే మస్క్‌ నిర్ణయాలతో కంపెనీలో ఎలాంటి మార్పులు వచ్చాయో ఇప్పుడు చూద్దాం.

* ట్విటర్ ఫీడ్ రిఫ్రెష్ ఎందుకు?

కొన్ని రోజులుగా కంటెంట్‌ని చదవడానికి ముందే ట్విట్టర్‌ ఫీడ్ రిఫ్రెష్ అవడాన్ని గమనించి ఉంటారు. ఇది చికాకు కలిగిస్తోందనే అభిప్రాయాలను చాలా మంది ట్విట్టర్‌ యూజర్‌లు వ్యక్తపరుస్తున్నారు. చాలా మంది మస్క్‌ను ట్యాగ్ చేసి, తక్షణమే గందరగోళాన్ని పరిష్కరించమని కోరారు. మస్క్ బ్లూ టిక్‌ పొందని యూజర్‌లను.. ధర చెల్లించి సర్వీసు పొందేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఇలాంటివి జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. బ్లూ టిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ ప్రోత్సహించేందుకు ట్వీట్‌ ఎడిట్‌, 1080p క్వాలిటీతో వీడియో అప్‌లోడ్‌ ఆప్షన్‌లను అందిస్తున్నారు.

* ఇన్‌ఫర్మేషన్‌కి నమ్మదగిన ప్లాట్‌ఫారం కాదు

ట్విట్టర్ అకౌంట్‌లకు ధర చెల్లించడం ద్వారా వెరిఫైడ్‌ బ్యాడ్జ్‌లు లభిస్తున్నాయి. దీంతో వెరిఫైడ్‌ అకౌంట్‌ల పోస్ట్‌లను ఎంత మాత్రం నమ్మవచ్చనే సందేహాలు యూజర్‌లకు వ్యక్తమవుతున్నాయి. తెలిసిన ప్రముఖులు చేసిన ట్వీట్‌లను కూడా నమ్మవచ్చా? లేదా? అనే సందిగ్ధంలో పడేస్తున్నాయి. ట్విట్టర్‌కు బ్లూ టిక్‌లను జారీ చేయడానికి కఠినమైన యంత్రాంగం అవసరం, లేకపోతే, ట్విట్టర్ సంవత్సరాలుగా సృష్టించిన విశ్వసనీయత కోల్పోయే ప్రమాదం ఉంది.

Apple: మ్యూజిక్ లవర్స్‌కు యాపిల్ గుడ్‌న్యూస్.. ‘యాపిల్ మ్యూజిక్ క్లాసికల్’ యాప్ లాంచ్..

* ట్విటర్ బ్లూ టిక్స్ సేల్‌

ట్విట్టర్ అకౌంట్‌లో బ్లూ టిక్ (వెరిఫైడ్‌) బ్యాడ్జ్‌ని కలిగి ఉండటం చాలా విలువైనదిగా ఎలాన్‌ మస్క్ నిర్ణయించారు. అందుకే బ్లూ టిక్‌ సబ్‌స్క్రిప్షన్‌కు ధర నిర్ణయించారు. ఇప్పుడు నెలకు $7 (సుమారు రూ.560) లేదా $11(సుమారు రూ.880) చెల్లించి, అకౌంట్‌ను వెరిఫై చేసుకోవచ్చు. బ్లూ టిక్‌ను అందజేయడంలో తగిన శ్రద్ధ లేకపోవడం, నకిలీ అకౌంట్‌లు పుట్టుకు రావడం, చాలా మంది సెలబ్రిటీలు ఫిర్యాదు చేయడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇంతకు ముందు బ్లూ టిక్‌ని సంపాదించుకోవాలి.. ఇప్పుడు కొనుక్కోవాలి.

* ఎక్కువగా కనిపిస్తున్న ర్యాండమ్‌ ట్వీట్స్‌

ప్రస్తుతం ట్విట్టర్‌ ఫీడ్‌ను పరిశీలిస్తే.. ఫాలో అవుతున్న వ్యక్తులకు సంబంధించిన కంటెంట్‌ వెతుక్కోవాల్సిన పరిస్థితి. ట్విట్టర్‌ యూజర్‌ల కోసం యు, ఫాలోయింగ్‌ అనే రెండు కొత్త ట్యాబ్‌లను తీసుకొచ్చింది. యు అనే ట్యాబ్‌లో ఫాలో అవుతున్న వ్యక్తుల కంటెంట్‌ కనిపించాలి. కానీ ఎక్కువగా ర్యాండమ్‌ యూజర్లు చేసిన ట్వీట్‌లు కనిపిస్తున్నాయి. చాలా మంది వినియోగదారులు ఈ పరిస్థితిని గమనించే ఉంటారు.

First published:

Tags: Elon Musk, Twitter

ఉత్తమ కథలు