Home /News /technology /

ELON MUSK COMPANY IN INDIA HAS BEEN ORDERED BY THE DEPARTMENT OF TELECOMMUNICATIONS TO STOP TAKING STARLINK INTERNET PRE REGISTRATIONS FULL DETAILS HERE PRV

Star link India: ఎలన్ ​మస్క్​కు భారత్​ షాక్​.. శాటిలైట్​ ఇంటర్నెట్​ రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలంటూ ఆదేశాలు.. ఎందుకంటే?

ఎలన్ మస్క్​ (ఫైల్​)

ఎలన్ మస్క్​ (ఫైల్​)

భారత్​లో స్టార్​లింక్​ రిజిస్ట్రేషన్లు అంతా సవ్యంగా సాగుతోందనుకున్న క్రమంలో ఎలన్ ​మస్క్ (Elon musk)​కు భారత్​ షాక్​ ఇచ్చింది. ముందస్తు ఆర్డర్లు తీసుకోవడాన్ని ప్రభుత్వం అడ్డుకుంది. ఎందుకంటే..

కొత్త ఉపగ్రహాలతో పాటు నెట్‌వర్క్‌ల ఆప్టిమైజేషన్‌ల ద్వారా ప్రపంచంలోని ప్రతిమూలకూ స్పీడ్ ఇంటర్నెట్‌ను అందించడానికి స్టార్‌లింక్ (Star link) సంస్థ శరవేగంగా పనిచేస్తోంది. ఒక్క జులై నెలలోనే ఇండియాలో స్టార్‌లింక్ (star link india) బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లను వేలాది మంది తీసుకున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా స్టార్‌ లింక్ బ్రాడ్‌బ్యాండ్ (broadband) యూజర్ల సంఖ్య 90,000 దాటింది. ఈ నేపథ్యంలో ఓక్లా డేటా కంపెనీ.. స్టార్‌లింక్ స్పీడ్ కు సంబంధించిన డేటా విడుదల చేసింది. అయితే స్పీడ్‌టెస్ట్ ఇంటెలిజెన్స్ ప్రకారం.. యూఎస్‌లో స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సగటు డౌన్‌లోడ్ వేగం 97.23Mbps కాగా.. అప్‌లోడ్ వేగం 13.89Mbps గా ఉంది. యూఎస్‌లో వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ సగటు డౌన్‌లోడ్ వేగం 115.22Mbps కాగా.. అప్‌లోడ్‌ల వేగం 17.18Mbps. దీన్నిబట్టి శాటిలైట్, వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ల వేగం దాదాపు సమానంగా ఉందని తెలుస్తోంది. కాగా, అంతా సవ్యంగా సాగుతోందనుకున్న క్రమంలో ఎలన్ ​మస్క్ (Elon musk)​కు భారత్​ షాక్​ ఇచ్చింది. ముందస్తు ఆర్డర్లు తీసుకోవడాన్ని ప్రభుత్వం అడ్డుకుంది. ఎందుకంటే..

లైసెన్స్‌ లేకుండా..

ఇండియాలో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ (satellite Internet) సేవలతో ఆకట్టుకోవాలన్న ఎలన్‌ మస్క్‌ (Elon musk) ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యాయి.  లైసెన్స్‌ లేకుండా స్పేస్‌ఎక్స్‌ స్టార్‌లింక్‌ ప్రీ ఆర్డర్స్‌ (Pre orders) తీసుకోవడాన్ని కేంద్రం తప్పుపట్టింది. స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌ సేవలకు భారత్‌లో ఇంకా లైసెన్స్‌ (license) లభించలేదన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ 99 డాలర్ల (రూ.7,400)తో బేటా వెర్షన్‌ సేవలను అందించనున్నట్లు, ఆర్డర్లకు  (Orders)దరఖాస్తు పెట్టుకోవాలంటూ భారతీయులను కోరింది.  ముందస్తు ఆర్డర్లు వచ్చినట్లు స్టార్‌లింక్‌ భారత్‌ హెడ్‌ సంజయ్‌ భార్గవ ఈ మధ్యే వెల్లడించారు . ఈ క్రమంలోనే టెలికమ్యూనికేషన్స్‌ విభాగం (Department of Telecommunications (DoT).. స్టార్‌ లింక్‌ సేవలపై అభ్యంతరాలు లేవనెత్తింది.

అంతేకాదు ఇక్కడి రెగ్యులేటర్‌ ఫ్రేమ్‌ వర్క్‌కు అనుగుణంగా పని చేయాల్సిందేనని, డాట్‌ అనుమతులు తప్పనిసరని, లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకోవాలని స్పేస్‌ఎక్స్‌కు టెలికమ్యూనికేషన్స్‌ విభాగం సూచించింది. అంతేకాదు స్టార్‌ లింక్‌ను ఎవరూ బుక్‌ చేసుకోవద్దంటూ జనాలకు టెలికమ్యూనికేషన్స్‌ విభాగం సూచించింది.

స్టార్​లింక్​ నో రియాక్షన్​..

టెలి కమ్యూనికేషన్స్‌ (tele communications) విభాగం నిర్ణయంపై  స్పందించేందుకు స్టార్‌లింక్‌ భారత్‌ హెడ్‌ సంజయ్‌ భార్గవ నిరాకరించారు. అయితే స్టార్‌ లింక్‌ వెబ్‌సైట్‌ ప్రకారం.. వచ్చే ఏడాది నుంచి భారత్‌లో సేవలను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక భారత్‌లో స్టార్‌లింక్‌కు మొదటి నుంచే ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో స్పేస్‌ఎక్స్‌ బిడ్‌ (space X bids)ను తిరస్కరించాలని కోరుతూ బ్రాడ్‌బాండ్‌ అసోసియేషన్‌లోని వన్‌వెబ్, అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌ తదితర కంపెనీలు ట్రాయ్‌, ఇస్రోలకు లేఖలు రాశాయి.

300Mbps వేగంతో ఇంటర్నెట్ సేవలు..

గ్లోబల్ శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థ అయిన హ్యూస్‌నెట్ సగటు డౌన్‌లోడ్ వేగం 19.73Mbps కాగా.. వయాశాట్ డౌన్‌లోడ్ వేగం 18.13Mbps మాత్రమే ఉండటం గమనార్హం. అమెరికా కాకుండా ఇతర దేశాల్లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ డౌన్‌లోడ్ స్పీడ్ ఇంకా ఎక్కువగా ఉందట. భారతదేశంలో అందుబాటులోకి రాకముందే.. వినియోగదారులందరికీ 300Mbps వేగంతో ఇంటర్నెట్ సేవలు అందిస్తామని కంపెనీ హామీ ఇవ్వడం శుభవార్తగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో వంటి హోమ్ బ్రాడ్‌బ్యాండ్ కంపెనీలు 30Mbps - 1Gbps స్పీడ్‌ల మధ్య మాత్రమే ప్లాన్‌లను అందిస్తున్నాయి.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Elon Musk, Internet, Latest Technology, Registrations, Space, Telecom

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు