ట్విట్టర్ యూజర్లు(Twitter Users) టెస్లా సీఈవో ఎలోన్ మస్క్‌ని (Tesla CEO Elon Musk) 43 బిలియన్ డాలర్లకు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌కి బదులుగా శ్రీలంకను కొనుగోలు చేయాలని కోరుతున్నారు. స్వాతంత్ర్యం పొందిన ప్పటి నుంచి అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని శ్రీలంక ఎదుర్కొంటోందని చెబుతున్నారు. ట్విట్టర్ ప్లాట్‌ఫారమ్‌లోని చాలా మంది వినియోగదారులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన దేశాన్ని రక్షించమని టెక్ బిలియనీర్‌ను కోరారు.
ఈ సందర్భంగా ట్విట్టర్ (Twitter) లో ఓ యూజర్ చేసిన ట్వీట్లో..‘ఎలోన్ మస్క్, మీరు ఏదైనా కొనాలనుకుంటే శ్రీలంకను కొనండి. ట్విట్టర్‌ని వదిలివేయండి’ అని పేర్కొన్నారు.
మరో ట్విట్టర్ యూజర్ చేసిన ట్వీట్లో.. ‘@elonmusk, మీరు శ్రీలంకను 43 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? బోగాలా వద్ద కూడా మీ @Teslaకు ఉపయోగపడే ప్రపంచంలోనే అత్యుత్తమ గ్రాఫైట్ మా వద్ద ఉంది’ అని రాశారు.
Digital Life: మరణించాక.. సోషల్ మీడియా ఖాతా ఏమవుతుంది.. డేటా ఎక్కడ ఉంటుంది
43 బిలియన్ డాలర్లు చెల్లించేందుకు సిద్ధం
ఇటీవల ట్విట్టర్‌ను కొనగోలు చేసేందుకు ఎలోన్ మస్క్ ఆఫర్ ప్రకటించారు. ప్రస్తుతం ట్విట్టర్లో వాటాదారుగా ఉన్న ఎలోన్మస్క్.. మిగతా వాటాలనూ కొనుగోలు చేస్తానని ప్రకటించారు. బిలియనీర్ కంపెనీలో 100 శాతం కొనుగోలు చేయడానికి ఒక్కో షేరుకు 54.20 డాలర్లు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇందుకు 43 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.3.22 లక్షల కోట్లు)కుపైగా చెల్లిస్తానని ఆఫర్ చేశాడు.
వాస్తవానికి ట్విట్టర్‌ని కొనుగోలు చేయగలనా? లేదా? అనే అంశంపై తనకు స్పష్టత లేదని.. కచ్చితంగా తెలియదని ఎలోన్ మస్క్ అంగీకరించారు.
తన ప్రారంభ ఆఫర్ తిరస్కరణకు గురైతే ప్లాన్ B ఉందని చెప్పారు. అందేంటో మాత్రం ప్రకటించలేదు. హోస్టైల్ టేకోవర్ దిశగా మస్క్ వెళ్లే అవకాశం ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎలోన్ మస్క్ ట్విట్టర్లో అతి పెద్ద వాటాదారుగా ఉన్నందున.. ఆ సంస్థ యాజమాన్యం నిర్ణయాలతో సంబంధం లేకుండా కంపెనీని సొంతం చేసుకొనే అవకాశం ఉందని చెబుతున్నారు. నేరుగా ఇతర వాటాదారులతో సంప్రదించి ఒప్పందాలు చేసుకోవచ్చని అంటున్నారు.
ఇంతలో మస్క్ ద్వారా ట్విట్టర్‌ను కొనుగోలు చేయాలనే అయాచిత, కట్టుబడి లేని ప్రతిపాదనను అనుసరించి దాని డైరెక్టర్ల బోర్డు పరిమిత వ్యవధి వాటాదారుల హక్కుల ప్రణాళికను ఏకగ్రీవంగా ఆమోదించినట్లు ట్విట్టర్ ప్రకటించింది.
Samsung Smart Phone: శామ్సంగ్ నుంచి అదిరిపోయే ఫోన్.. లేటెస్ట్ ఫీచర్స్ ఇవే
దీనికి సంబంధించి ట్విట్టర్ విడుదల చేసిన ప్రకటనలో.. ‘రైట్స్ ప్లాన్ తరచుగా 'పాయిజన్ పిల్' అని పిలుస్తారు. అన్ని వాటాదారులకు తగిన నియంత్రణ ప్రీమియం చెల్లించకుండా లేదా బోర్డుకు సమాచారం ఇవ్వడానికి తగిన సమయాన్ని అందించకుండా బహిరంగ మార్కెట్ ద్వారా ఏదైనా సంస్థ, లేదా వ్యక్తి ట్విట్టర్ నియంత్రణను పొందే సంభావ్యతను తగ్గిస్తుంది. వాటాదారుల ప్రయోజనాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి’. అని పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Elon Musk, Srilanka, Tesla Motors, Twitter