హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Samsung: ఫెస్టివల్ సీజన్‌లో దుమ్మురేపిన శామ్‌సంగ్.. ఇది మాములు దూకుడు కాదు..

Samsung: ఫెస్టివల్ సీజన్‌లో దుమ్మురేపిన శామ్‌సంగ్.. ఇది మాములు దూకుడు కాదు..

Big Billion Days: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ షురూ.. ఈ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్లపై దుమ్మురేపే ఆఫర్లు

Big Billion Days: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ షురూ.. ఈ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్లపై దుమ్మురేపే ఆఫర్లు

Samsung: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లను అందించిన మొదటి రోజు శామ్‌సంగ్ భారీ సంఖ్యలో స్మార్ట్‌ఫోన్లను విక్రయించి రికార్డు సాధించింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఇండియా (India)లో ఫెస్టివల్ సీజన్‌ (Festival Season) ను బాగా క్యాష్ చేసుకుంటున్నాయి వివిధ ఎలక్ట్రానిక్ బ్రాండ్స్. పండుగల సందర్భంగా ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్(Flipkart) ద్వారా చాలా కంపెనీలు తక్కువ ధరకే తమ ప్రొడక్ట్స్‌ సేల్ చేస్తూ భారీ లాభాలను నమోదు చేస్తున్నాయి. దీనివల్ల తక్కువ సమయంలోనే మంచి బిజినెస్ జరుగుతోంది. ఈ క్రమంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లను అందించిన మొదటి రోజు శామ్‌సంగ్ (Samsung) భారీ సంఖ్యలో స్మార్ట్‌ఫోన్లను విక్రయించి రికార్డు సాధించింది. ఈ దక్షిణ కొరియా టెక్నాలజీ దిగ్గజం ఏకంగా ఆఫర్ల మొదటి రోజు ఈ రెండు ప్లాట్‌ఫామ్స్‌లో 12 లక్షలకు పైగా గెలాక్సీ డివైజ్‌లను విక్రయించి, భారతదేశంలో కొత్త రికార్డును సృష్టించింది.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో స్పెషల్ ఆఫర్లు, డిస్కౌంట్ల కారణంగా గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లు ఎక్కువగా అమ్ముడుపోయినట్లు శామ్‌సంగ్ తెలిపింది. ఫెస్టివల్ సేల్స్‌లో బాగా డిమాండ్ ఉన్న డివైజ్‌లలో కంపెనీ గెలాక్సీ సిరీస్ ఫోన్లు టాప్ ప్లేస్‌లో నిలిచాయి. అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్‌ యాన్యువల్ ఫెస్టివల్ సేల్‌ మొదటి రోజు ఏకంగా రూ.1,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన 12 లక్షల గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లను విక్రయించినట్లు శామ్‌సంగ్ ఇండియా ఆదివారం తెలిపింది.

* అమ్మకాల్లో రికార్డు

పండుగ సీజన్ కోసం శామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్ల ధరలను 17 నుంచి 60 శాతం వరకు తగ్గించింది. దీనికి తోడు ఈకామర్స్ ప్లాట్‌ఫామ్స్ అందిస్తున్న బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌తో ఫోన్ల ధరలు భారీగా తగ్గాయి. దీంతో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మొదటి రోజున నమోదైన సేల్స్‌లో శామ్‌సంగ్ నంబర్ 1 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా నిలిచింది. ఈ ప్లాట్‌ఫామ్‌ నుంచి అమ్ముడైన ప్రతి మూడు స్మార్ట్‌ఫోన్లలో ఒక గెలాక్సీ డివైజ్ ఉంది. వీటిలో గెలాక్సీ M13 బెస్ట్ సెల్లర్‌గా ఉందని శామ్‌సంగ్ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ మొదటి రోజున నమోదైన సేల్స్‌లో, ఈ ప్లాట్‌ఫామ్‌లో తమ మార్కెట్ షేర్‌ రెట్టింపు అయినట్లు శామ్‌సంగ్ తెలిపింది.

* భారీగా తగ్గిన ధరలు

తాజా ఆఫర్లలో ప్రీమియం రేంజ్ అయిన గెలాక్సీ S22 సిరీస్‌పై కంపెనీ 17 నుంచి 38 శాతం వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది. శామ్‌సంగ్ గెలాక్సీ S22 అల్ట్రా, గెలాక్సీ S22, గెలాక్సీ S20 FE 5G, గెలాక్సీ M53, గెలాక్సీ M33, M32 ప్రైమ్ ఎడిషన్, గెలాక్సీ M13 వంటి స్మార్ట్‌ఫోన్ల ధరలను భారీగా తగ్గించింది. ఫెస్టివల్ సీజన్ అమ్మకాలను ఘనంగా ప్రారంభించిన శామ్‌సంగ్.. 5G డివైజ్‌లతో పాటు మొత్తం స్మార్ట్‌ఫోన్ సేల్స్‌లో టాప్‌ ప్లేస్‌కు చేరుకోవడం లక్ష్యంగా దూసుకెళ్తోంది.

ఇది కూడా చదవండి : అక్టోబర్ 1 నుంచి 5జీ సేవలు.. ముందుగా ఈ 13 ప్రాంతాల్లో అందుబాటులో!

‘ఆన్‌లైన్ ఫెస్టివల్ సేల్స్ మొదటి రోజున శామ్‌సంగ్ ఇండియాలో 12 లక్షలకు పైగా గెలాక్సీ డివైజ్‌లను విక్రయించింది. ఇది భారతదేశంలో కొత్త రికార్డు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అందిస్తున్న ఆఫర్లతో ధరలు తగ్గాయి. ప్రస్తుతం అత్యంత డిమాండ్ ఉన్న డివైజ్‌లుగా శామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్లు నిలుస్తున్నాయి. శామ్‌సంగ్ 24 గంటల్లో రూ.1,000 కోట్లకు పైగా విలువైన గెలాక్సీ డివైజ్‌లను విక్రయించింది’ అని శామ్‌సంగ్ ఇండియా ప్రకటించింది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Amazon Great Indian Festival Sale, Flipkart Big Billion Days, Samsung, Samsung Galaxy

ఉత్తమ కథలు