హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

eSIM: ఇ-సిమ్ అంటే ఏంటి..? ఐఫోన్లలో ఎయిర్‌టెల్, జియో ఇ-సిమ్‌ను(Jio eSIM) ఎలా యాక్టివేట్ చేయాలి..?

eSIM: ఇ-సిమ్ అంటే ఏంటి..? ఐఫోన్లలో ఎయిర్‌టెల్, జియో ఇ-సిమ్‌ను(Jio eSIM) ఎలా యాక్టివేట్ చేయాలి..?

eSIM: ఇ-సిమ్ అంటే ఏంటి? ఐఫోన్లలో ఎయిర్‌టెల్, జియో ఇ-సిమ్‌ను(Jio eSIM) ఎలా యాక్టివేట్ చేయాలి..?

eSIM: ఇ-సిమ్ అంటే ఏంటి? ఐఫోన్లలో ఎయిర్‌టెల్, జియో ఇ-సిమ్‌ను(Jio eSIM) ఎలా యాక్టివేట్ చేయాలి..?

యాపిల్ 2018లో లాంచ్ చేసిన ‘వాచ్ 3 LTE’ ప్రొడక్ట్‌లో మొదటిసారి eSIM సపోర్ట్‌ను ప్రవేశపెట్టింది. తర్వాత ఈ టెక్నాలజీని ఐఫోన్లకు కూడా విస్తరించింది. ఐఫోన్లలో డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ ఫెసిలిటీని పొందేందుకు యూజర్లు ఒక ఫిజికల్ సిమ్ కార్డ్, ఒక eSIMను ఉపయోగించుకునే అవకాశం ఇచ

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

టెక్ దిగ్గజం యాపిల్(Apple) ఇటీవల ఐఫోన్ 14 సిరీస్‌ను లాంచ్(iPhone Series) చేసింది. ఎన్నో అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో(Advanced Features) వచ్చిన ఈ డివైజ్‌ US మోడల్స్‌లో సిమ్ కార్డ్ స్లాట్‌ను కంపెనీ పూర్తిగా తొలగించింది. అంటే ఐఫోన్ 14 సిరీస్ డివైజ్‌లలో ఫిజికల్ సిమ్ స్లాట్ ఉండదు. కానీ ఇండియా, ఇతర దేశాల్లో రిలీజ్(Release) అయ్యే డివైజ్‌లలో మాత్రం సిమ్ కార్డ్ స్లాట్‌ ఉంటుంది. భవిష్యత్తులో కంపెనీ నుంచి రానున్న అన్ని డివైజ్‌లలో సిమ్ కార్డ్ స్లాట్స్ తీసివేసి, కొత్తగా ఇ-సిమ్ సపోర్ట్‌ను అందించాలని యాపిల్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఇ-సిమ్(E Sim) అంటే ఏంటి? ఐఫోన్లలో జియో, ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌ల ఇ-సిమ్స్‌ను ఎలా యాక్టివేట్ చేయాలి? వంటి వివరాలు తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి : ఫ్లిప్‌కార్ట్‌లో హోటల్ రూమ్ కూడా బుక్ చేయొచ్చు... కొత్త సర్వీస్ ప్రారంభం

యాపిల్ 2018లో లాంచ్ చేసిన ‘వాచ్ 3 LTE’ ప్రొడక్ట్‌లో మొదటిసారి eSIM సపోర్ట్‌ను ప్రవేశపెట్టింది. తర్వాత ఈ టెక్నాలజీని ఐఫోన్లకు కూడా విస్తరించింది. ఐఫోన్లలో డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ ఫెసిలిటీని పొందేందుకు యూజర్లు ఒక ఫిజికల్ సిమ్ కార్డ్, ఒక eSIMను ఉపయోగించుకునే అవకాశం ఇచ్చారు. అయితే ఇండియాలో eSIM టెక్నాలజీ ఇంతకు ముందు నుంచే ఉంది. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు ఐఫోన్ల కోసం ఇ-సిమ్ సేవలను అందిస్తున్నాయి. కానీ చాలామంది స్మార్ట్‌ఫోన్ యూజర్లకు eSIMలను ఉపయోగించడం గురించి తెలియదు. అసలు ఇండియన్ ఐఫోన్ యూజర్లు చాలామంది ఇ-సిమ్‌ను యాక్టివేట్ చేయరు. తాజాగా యాపిల్ US కస్టమర్ల కోసం తీసుకొచ్చిన ఐఫోన్ 14 సిరీస్‌లో eSIM మాత్రమే ఉండటంతో, దీనిపై చాలామంది దృష్టి పెడుతున్నారు.

* ESIM అంటే ఏంటి?

eSIM పూర్తి పేరు ఎంబెడెడ్-సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్. ఇది డివైజ్‌లో ఉండే వర్చువల్ SIM కార్డ్ అని చెప్పుకోవచ్చు. ఇది ఫిజికల్ SIM కార్డ్‌కు డిజిటల్ కాపీ మాత్రమే. ఇ-సిమ్‌ వాడితే ఇంటర్నెట్ స్పీడ్, సెల్యులార్ నెట్‌వర్క్ క్వాలిటీ ప్రత్యేకంగా పెరుగదు. ఈ విషయంలో అసలు eSIMకి ఎలాంటి సంబంధం ఉండదు. అలాగే ఒకే మొబైల్ నంబర్‌పై ఒక eSIM, ఫిజికల్ SIM రెండింటినీ తీసుకోవడం కుదరదు. eSIM యాక్టివేట్ అయిన తర్వాత యూజర్ల ఫిజికల్ SIM కార్డ్ పని చేయదు. ఈ టెక్నాలజీకి సపోర్ట్ చేసే డివైజ్‌లలోనే ఇ-సిమ్‌ను వాడటం సాధ్యమవుతంది. eSIMలు డిజిటల్ విధానంలో యాక్టివేట్ అవుతాయి. జియో, ఎయిర్‌టెల్ లేదా Vi వంటి ఆపరేటర్ల ద్వారా సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్ లేదా SIM కార్డ్ డేటా డిజిటల్‌గా ట్రాన్స్‌ఫర్ అవుతుంది.

* ఫిజికల్ కార్డులకు భిన్నంగా..

eSIMలను మామూలు SIM కార్డుల మాదిరిగా వేరే డివైజ్‌లకు మార్చుకోవడం కుదరదు. అంటే యూజర్లు eSIMని మార్చుకోవాలనుకుంటే, టెలికాం ఆపరేటర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. మరో ఫోన్‌తో eSIMని వాడటం కుదరదు. అయితే అదే eSIMను స్మార్ట్‌ఫోన్‌తో పెయిర్ చేసిన స్మార్ట్‌వాచ్‌తో షేర్ చేయవచ్చు. అంటే యాపిల్ వాచ్ LTE మోడల్స్, యాపిల్ ఐఫోన్లలో ఒకే ఫోన్ నంబర్‌తో eSIMలను యాక్టివేట్ చేయవచ్చు.

* ఐఫోన్లలో ఎయిర్‌టెల్ ఇ-సిమ్‌ను ఎలా యాక్టివేట్ చేయాలి?

మీ డివైజ్‌ (ఐఫోన్) నుంచి “eSIM registered email id” అని టైప్ చేసి 121కి మెసేజ్ పంపాలి. మీ ఇమెయిల్ ఐడీ వ్యాలీడ్ అయితే, ప్రాసెస్‌ కన్ఫర్మ్ చేయడానికి ఎయిర్‌టెల్ 121కి ఒక SMS పంపుతుంది. ఇప్పుడు eSIM రిక్వెస్ట్ కోసం 60 సెకన్లలోపు మీరు ఇచ్చిన మెయిల్‌ నుంచి “1” అని టైప్ చేసి రిప్లై ఇవ్వండి. ఒకవేళ మీ ఇమెయిల్ ID చెల్లనిది అయితే, ఎయిర్‌టెల్ ఈ ప్రాసెస్‌ను రీస్టార్ చేసుకునే ఆప్షన్ ఇస్తుంది. eSIM రిక్వెస్ట్ ఆప్షన్‌ పెట్టుకున్న తర్వాత, ఎయిర్‌టెల్ అధికారులు టెలిఫోన్ ద్వారా కాల్ చేసి, వివరాలను కన్ఫర్మ్ చేసుకుంటారు. మీరు ఫైనల్ కన్సెంట్ ఇచ్చిన తర్వాత.. మీ మెయిల్ ఐడీకి QR కోడ్ వివరాలను సెండ్ చేస్తారు. ఇప్పుడు మీరు QR కోడ్‌ను స్కాన్ చేస్తే.. ఈ ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది. అయితే ఎయిర్‌టెల్ eSIM యాక్టివేట్ అవ్వడానికి దాదాపు 2 గంటలు పడుతుంది.

MLHP Posts In Telangana: 32 జిల్లాల వ్యాప్తంగా మిడ్‌ లెవెల్‌ పోస్టుల భర్తీ.. ఏ ఏ జిల్లాకు ఎన్ని పోస్టులున్నాయంటే..

ఐఫోన్ 14లో ఎయిర్‌టెల్ eSIMను యాక్టివేట్ చేయడానికి.. మీ డివైజ్‌లోని సెట్టింగ్స్ నుంచి Wifi నెట్‌వర్క్‌కు కనెక్ట్ అవ్వండి. ఆ తర్వాత మొబైల్ నెట్‌వర్క్‌పై క్లిక్ చేసి, ‘Advanced’ ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి. అడ్వాన్స్‌డ్ సెట్టింగ్స్‌లో యాడ్ క్యారియర్‌పై క్లిక్ చేసి, QR కోడ్‌ను స్కాన్ చేసే ఆప్షన్‌ను ఎంచుకోండి. దీని ద్వారా కోడ్‌ను స్కాన్ చేసిన తర్వాత, డౌన్‌లోడ్ బటన్‌పై క్లిక్ చేసి, ప్రక్రియను పూర్తి చేయండి.

ఐఫోన్లలో జియో ఇ-సిమ్‌ను ఎలా యాక్టివేట్ చేయాలి?

ఐఫోన్ 14 సిరీస్‌తో పాటు పాత తరం ఐఫోన్లకు జియో eSIM సపోర్ట్ ఉంది. అయితే యాపిల్ డివైజ్‌లు iOS 12.1 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్‌లో రన్ అయితేనే ఈ సేవలు పొందవచ్చు. ఈ ఐఫోన్లలో జియో ఇ-సిమ్‌ను యాక్టివేట్ చేసుకోవడానికి.. సెట్టింగ్స్‌కు వెళ్లి ‘జనరల్‌’పై క్లిక్ చేయండి. రిజల్ట్స్‌లో కనిపించే EID, IMEI నంబర్స్ నోట్ చేసుకోండి. తర్వాత eSIM యాక్టివేషన్ అవసరమయ్యే డివైజ్ నుంచి.. GETESIM అని టైప్ చేసి, EID నంబర్, IMEI నంబర్‌ టైప్ చేయండి. ఈ టెక్స్ట్‌ను 199కి SMS చేయండి. ఇప్పుడు 19 అంకెల eSIM నంబర్, eSIM ప్రొఫైల్ కాన్ఫిగరేషన్ వివరాలు నోటిఫికేషన్‌లో వస్తాయి.

ఇప్పుడు SIMCHG, తర్వాత 19 అంకెల eSIM టైప్ చేసి 199కి SMS చేయండి. రెండు గంటల్లో దీనికి సంబంధించిన అప్‌డేట్ వస్తుంది. అప్పుడు కన్ఫర్మేషన్ కోసం ‘1’ అని 183కి SMS చేయాలి. తర్వాత మీకు ఆటోమేటెడ్ కాల్ వస్తుంది. కాల్‌లో 19 అంకెల eSIM నంబర్ అడుగుతుంది. మీరు ఆ నంబర్‌ను ఎంటర్ చేస్తే, కన్పర్మేషన్ సక్సెస్ అవుతుంది.

Telangana District Posts: తెలంగాణలోని ఈ జిల్లాల్లో MLHP పోస్టులకు నోటిఫికేషన్.. దరఖాస్తు చేసుకోండిలా..

ఇప్పుడు ప్రొఫైల్‌ను కాన్ఫిగర్ చేయాలనే నోటిఫికేషన్‌ వస్తే.. దానిపై క్లిక్ చేసి, డేటా ప్లాన్‌ ఇన్‌స్టాల్ చేసే ఆప్షన్‌ను ఎంచుకోండి. నోటిఫికేషన్‌ రాకపోతే.. సెట్టింగ్స్‌కు వెళ్లి, ‘జియో డేటా ప్లాన్ రెడీ టు బి ఇన్‌స్టాల్డ్’ ట్యాబ్‌పై క్లిక్ చేసి, ‘కంటిన్యూ’ ఆప్షన్‌ను ఎంచుకోండి. ఇప్పుడు మీ Jio eSIM యాక్టివేట్ అవుతుంది.

First published:

Tags: 5g technology, Esim, Science and technology, Sim card, Technology

ఉత్తమ కథలు