ఆ వాహనాలకు కేంద్రం బంపర్ ఆఫర్.. రిజిస్ట్రేషన్ ఫీజును రద్దు చేస్తూ..

Electric Vehicles: పర్యావరణహిత వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ముసాయిదా ప్రకటన పేర్కొంది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 20, 2019, 2:28 PM IST
ఆ వాహనాలకు కేంద్రం బంపర్ ఆఫర్.. రిజిస్ట్రేషన్ ఫీజును రద్దు చేస్తూ..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలనుకునేవారికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించనుంది. ఆ వాహనాలపై రిజిస్ట్రేషన్ ఫీజును రద్దు చేయాలని మోదీ సర్కారు ప్రతిపాదించింది. ఈ మేరకు బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందుకోసం సెంట్రల్ మోటర్ వెహికిల్స్ రూల్స్ (సీఎంవీఆర్) 1989 చట్టాన్ని సవరించినట్లు తాజా డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ పేర్కొంది. బ్యాటరీతో నడిచే వాహనాలకు రిజిస్ట్రేషన్ చార్జీల నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పింది. ఈ మేరకు నిబంధన 81లో మార్పులు చేయనున్నట్లు వెల్లడించింది. పర్యావరణహిత వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ముసాయిదా ప్రకటన పేర్కొంది. కాలుష్యం ఉద్గారాలు వెదజల్లని ఈవీ వాహనాల వినియోగాన్ని భారీగా పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే 2030 తర్వాత కేవలం ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలకు మాత్రమే అనుమతి ఇవ్వాలని నీతి అయోగ్ కూడా సూచనలు చేసిందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే విద్యుత్ ఆధారిత వాహనాల వైపు వాహనదారులు చూసేలా రిజిస్ట్రేషన్ చార్జీలను ఎత్తివేయాలని ప్రతిపాదించింది.

కొత్త వాహనాల రిజిస్ట్రేషన్, పాత వాహనాల రెన్యువల్ కోసం కూడా ఎలాంటి చెల్లింపులు చేయనక్కర్లేదని స్పష్టం చేసింది. ఎలక్ట్రిక్ టూ వీలర్లతో పాటు త్రీ వీలర్, ఫోర్‌ వీలర్ మిగతా అన్ని విద్యుత్తు ఆధారిత వాహనాలకు ఇది వర్తిస్తుందని ప్రకటించింది. కాగా, తమ ఈ నిర్ణయంపై నెల రోజుల లోపు అభిప్రాయాలను తెలుపవచ్చని రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Published by: Shravan Kumar Bommakanti
First published: June 20, 2019, 2:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading