భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వెహికిల్ (Electric vehicle) హవా ఉండబోతుంది. దాదాపుగా అన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ వెహికిల్ తయారీలో దిగాయి. ఈ నేపథ్యంలో మార్కెట్‌లో రాబోతున్న కొత్త మోడల్స్ గురించి తెలుసుకోండి. ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ బ్రాండ్ అయిన హీరో ఎలక్ట్రిక్ (Hero Electric) ఇండియాలో మరో ఎలక్ట్రిక్ టూవీలర్‌ను (Electric Two Wheeler) లాంఛ్ చేసింది. హీరో ఎడ్డీ (Hero Eddy) పేరుతో లేటెస్ట్ మోడల్‌ను పరిచయం చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ (Electric Scooter) ఎక్స్ షోరూమ్ ధర కేవలం రూ.72,000 మాత్రమే. స్టైలిష్ డిజైన్, ఆకట్టుకునే ఫీచర్స్‌తో హీరో ఎడ్డీ ఆకట్టుకుంటుంది. పట్టణాల్లో ఉండేవాళ్లు చిన్నచిన్న అవసరాలకు, దగ్గర్లోని ప్రాంతాలకు వెళ్లేందుకు హీరో ఎడ్డీ ఎలక్ట్రిక్ టూవీలర్ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఎలక్ట్రిక్ టూవీలర్లకు డిమాండ్ ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని కంపెనీలు పోటాపోటీగా ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లను రిలీజ్ చేస్తున్నాయి.
Instagram Features: ఇన్‌స్టాగ్రామ్‌లో మీ ఈమెయిల్ ఐడీ మార్చాలా.. ఇలా చేయండి!
మూడు ఎలక్ట్రిక్ బైక్స్..
భారతదేశానికి చెందిన ఈవీ స్టార్టప్ ఇగ్నిట్రాన్ మోటోకార్ప్ నుంచి మూడు ఎలక్ట్రిక్ బైక్స్ (Electric Bikes) లాంఛ్ అయ్యాయి. సైబాగ్ యోడ (Cyborg Yoda), సైబాగ్ జీటీ 120 (Cyborg GT 120), సైబాగ్ బాబ్-ఇ (Cyborg Bob-e) మోడల్స్‌ని పరిచయం చేసింది ఇగ్నిట్రాన్ మోటోకార్ప్. వేర్వేరు ప్రైస్ రేంజ్‌లో ఈ ఎలక్ట్రిక్ బైక్స్ లాంఛ్ అయ్యాయి. సైబాగ్ యోడ ఎలక్ట్రిక్ బైక్ ధర రూ.1,84,999 కాగా, సైబాగ్ జీటీ 120 ఎలక్ట్రిక్ టూవీలర్ ధర రూ.1,64,999. ఇక తక్కువ ధరలో సైబాగ్ బాబ్-ఇ మోడల్ రూ.1,14,999 ధరతో లాంఛ్ అయింది. ఈ మూడు బైకులకు సబ్సిడీ లభిస్తుంది. కాబట్టి ధర తగ్గుతుంది. అయితే ధర ఎంత తగ్గుతుందన్నది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీ పైన ఆధారపడి ఉంటుంది. బుకింగ్స్ తేదీని కంపెనీ ప్రకటించనుంది.
కొమాకి సంస్థ నుంచి..
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ కొమాకి ఎలక్ట్రిక్ వెహికల్స్ దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్‌ను విడుదల చేసింది. జనవరి 26 నుండి కంపెనీకి చెందిన అన్ని డీలర్‌షిప్‌లలో ఎలక్ట్రిక్ బైక్ అందుబాటులో ఉంటుంది. ఇది గార్నెట్ రెడ్, డీప్ బ్లూ , జెట్ బ్లాక్ అనే మూడు విభిన్న రంగుల్లో అందుబాటులో ఉంచనుంది. ఈ బైక్ ధర రూ. 1.68 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. Komaki రేంజర్ పెద్ద వీల్స్ తో పాటు సాధారణ క్రూయిజర్ బైక్‌లా కనిపిస్తోంది. బైక్ గ్లోసీ క్రోమ్‌తో అలంకరించబడిన రెట్రో-థీమ్ రౌండ్ LED హెడ్‌ల్యాంప్‌లతో పనిచేస్తోంది. ఇవి డ్యూయల్ క్రోమ్‌తో కూడిన రౌండ్ షేప్ ల్యాంప్స్‌తో రానుంది.
Windows 11: అదిరిపోయే ఫీచర్స్.. అంతకు మించి యూజర్ ఫ్రెండ్లీ.. విండోస్ 11 ప్రత్యేకతలు!
మహీంద్రా గ్రూప్ నుంచి
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. ఈ రంగంలోకి అనేక ప్రముఖ ఆటోమొబైల్(Auto mobile) కంపెనీలతో పాటు స్టార్టప్‌లు(Startups) అడుగుపెడుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్‌తో మహీంద్రా గ్రూప్‌తో(Mahindra Group) చేతులు కలిపింది. దేశంలో పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్‌ను తీర్చడానికి మహీంద్రా గ్రూప్‌కు చెందిన మధ్యప్రదేశ్‌లోని(Madhya Pradesh) పితంపూర్ ప్లాంట్‌లో హీరో ఎలక్ట్రిక్ బైక్‌లను ఉత్పత్తి చేసేందుకు ఒప్పందం కుదిరింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Electric Bikes