టెక్నాలజీ(Technology) రోజు రోజుకూ మన జీవనంలో భాగమవుతోంది. ఎన్నో పనులను సులభం చేసేందుకు సహకరిస్తుంది. మనం చేసే పని కన్నా ఎంతో ఉత్తమంగా చేసి మనకు అందించడంలో టెక్నాలజీది కీలక పాత్ర అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం మార్కెట్‌లోకి ఎలక్ట్రిక్ టూత్ బ్రెష్(Electric Tooth Brush) అదే పళ్లు తోముతుంది.. మార్కెట్‌లో ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌లులు వస్తున్నాయి. షియోమి, సోనిక్ కంపెనీలు ఈ బ్రెష్‌లను ప్రవేశపెట్టాయి. ఈ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌లు పళ్లను శుభ్రంగా అన్ని వైపుల నుంచి బ్రష్ చేస్తాయి. దీని ధర మార్కెట్‌లో రూ.1500.
మార్కెట్‌లోని ఎక్కువ ఆదరణ పొంఉతున్న సోనక్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ఫీచర్స్ చూద్దాం. అధునాతమనైన సుపీరియర్ సోనీ టెక్నాలజీతో ఈ టూత్ బ్రష్‌ను తయారు చేశారు. పళ్లు చాలా శుభ్రంగా అవ్వాలంటే కావాల్సింది ఎక్కువ సేపు మృదువుగా రుద్దడం. ఈ సోనిక్ ఎలక్ట్రిక్( Sonic Electric) బ్రష్ నిమిషానికి 40 వేల స్ట్రోక్‌లు చేస్తూ పళ్లను శుభ్రం చేస్తుంది. ఈ బ్రష్ దంతాల అమరికకు అనుకూలంగా ఉండేలా రూపొందించారు. ఈ బ్రష్ కిట్‌లో మెషిన్‌తో పాటు ఐదు స్పెషల్ నైలాన్ డ్యుపోంట్ హెడ్స్ లభిస్తాయి. ఇవి పళ్లను నీట్ చేసేందుకు దోహదం చేస్తాయి.
ఈ ఎలక్ట్రిక్ బ్రష్‌లో పళ్లుతోమే పద్ధతులు కూడా ఉన్నాయి. వైటెనింగ్, క్లీనింగ్, సెన్సిటివ్, పాలిషింగ్, మసాజ్ ఆప్షన్‌లను ఇచ్చారు. ఈ బ్రష్‌ను రెండు నిమిషాల సమయం చాలు మీ పళ్లను ఎంతో శుభ్రంగా చేస్తుంది. ఈ బ్రష్ చార్జింగ్ కెపాసిటీ(Charging Capacity) చాలా బాగుంది. నాలుగు గంటలు చార్జింగ్ పెడితే 25 రోజులు వినియోగించుకోవచ్చు. ఇందులో మరో ఫీచర్ కూడా ఉంది. మనం వినియోగిస్తున్న ప్రతీ 30 సెకండ్లకు క్లీన్ చేయాల్సిన ప్రదేశాన్ని మార్చమని అలర్ట్ (Alert) చేస్తుంది. మనం రెండు నిమిషాల తర్వాత ఆపినా ఆపకపోయినా బ్రషింగ్ ఆటోమెటిక్‌గా ఆగిపోతుంది. తిరిగి వినియోగించిప్పుడు మనం చివరగా వినియోగించిన బ్రషింగ్ ఆప్షన్‌ను ప్రారంభిస్తుంది. అవసరం అయితే మార్చుకోవచ్చు. దీనిని వినియోగించేటప్పుడు ఎలాంటి సమస్య రాదనిన సోనిక్ బ్రష్ తయారీ దారులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gadget