మార్కెట్లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికిల్(Electric Vehicles) జోరు కనపబడుతోంది. ప్రముఖ సంస్థలు ఈవీ తయారీలో పోటీ పడుతున్న తరణంలో బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వేహికల్ స్టార్టప్ సింపుల్ ఎనర్జీ(Simple Energy) దేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్(Scooter) ప్రవేశపెట్టింది. తమిళనాడు(Tamilnadu)లోని హోసూర్ లోని ప్లాంట్లో ఎలక్ట్రిక్ వెహికిల్ తయారీ దారు తన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ల (Simple One Electric Scooter)ను రూపొందించింది. రూ.1.10 లక్షల ధర వద్ద ఈవీని ప్రవేశపెట్టింది. కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ ను రూ.1,947 రీఫండ్ చేయగల ప్రీ బుకింగ్(Booking) ధరకు బుకింగ్ చేసుకోవచ్చని ప్రకటించింది. భారతీయ స్వాతంత్ర దినోత్సవాన్ని గుర్తుగా ఈ ప్రీ బుకింగ్ రీఫండ్ ధరను ప్రకటించడం విశేషం.
ఈవీ కంపెనీ రాబోయే మూడు నుంచి ఏడు నెలల్లో దేశవ్యాప్తంగా 300కి పైగా పబ్లిక్ ఫాస్ట్ ఛార్జర్లను కూడా ఇన్ స్టాల్(Install) చేస్తుంది. మొదటి దశలో ఈ ఏడాది ఒక మిలియన్ వాహనాల వార్షిక ఉత్పత్తి సామర్ధ్యం కలిగి ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.ఢిల్లీ, గోవా, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుతోపాటు మరో 13 రాష్ట్రాల్లో ఈ-స్కూటర్ అందుబాటులోకి ఉంటుంది.
ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లు(Features) ఇవే..
- ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఆరు కిలోల బరువుతో 4.8 కిలోవాట్స్ గల పోర్టబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ ఉంది.
- సులభంగా బ్యాటరీని చార్జ్ చేయడానికి ఇందులో డిటాచబుల్, పోర్టబుల్ ఫెసిలిటీ ఉన్నాయి.
- కేవలం నిమిషం వ్యవధిలో 2.5 కిలోమీటర్ల రేంజ్ వరకు స్కూటర్ ను ఛార్జ్ చేసుకోవచ్చు.
- ఈ-స్కూటర్ ను సింగిల్ ఛార్జ్ చేస్తే ఎకో మోడ్ లో 203 కిలోమీటర్ల దూరం వెళ్లవచ్చని సంస్థ తెలిపింది.
- ఇండియన్ డ్రైవ్ సైకిల్(ఐడీసీ) పరిస్థితుల్లో 236 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.
- స్కూటర్ గరిష్ట వేగం గంటకు 105 కిలోమీటర్లు ఉంటుంది. ఇది కేవటం నాలుగు సెకన్ల లోపు 50 కిలోమీటర్ల వేగాన్ని అందుకొనే సామర్థ్యం ఉంది. స్కూటర్ కు 4.5 కెడబ్ల్యు పవర్ అవుట్ పుట్, 72 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఉంది.
- 30 లీటర్లబూట్ సామర్థ్యం, 12 అంగుళాల వీల్స్, 7 అంగుళాల కస్టమైజబుల్ డిజిటల్ డ్యాష్ బోర్డ్, ఆన్ బోర్డ్ నావిగేషన్, జియో ఫెన్సింగ్ ఈ స్కూటర్ సొంతం.
- ఎస్ఓఎస్ మెసేజ్, డాక్యుమెంట్(Document) స్టోరేజీ, టైర్ ప్రజర్ మానిటరింగ్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీ స్కూటర్కు అదనపు ఆకర్షణనిస్తున్నాయి.
- రెడ్, వైట్, బ్లాక్, బ్లూ నాలుగు రంగుల్లో స్కూటర్ వినియోగదారులకు లభించనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Electric Bikes, New electric bike