ELECTIONS 2019 RATE YOUR MP MLA AND LEADERS IN NETA LEADERS REPORT CARD MOBILE APP KNOW HOW SS
Neta App: మీ లీడర్‌కు మీ స్మార్ట్‌ఫోన్‌లో రేటింగ్ ఇవ్వొచ్చు ఇలా...
Neta App: మీ లీడర్‌కు మీ స్మార్ట్‌ఫోన్‌లో రేటింగ్ ఇవ్వొచ్చు ఇలా...
(image: Playstore)
Neta - Leaders Report Card' Mobile App | నేత యాప్‌లో ప్రధాన మంత్రితో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల జాబితా ఉంటుంది. అంతేకాదు... గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థుల పేర్లు కూడా ఉంటాయి.
దేశమంతా లోక్‌సభ ఎన్నికల సందడి కనిపిస్తోంది. నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో నేతల హడావుడి కూడా మొదలైంది. ఏప్రిల్ 11న తెలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. మరి మీ ప్రాంతంలో పోటీ చేస్తున్న లీడర్ గురించి మీకు ఎంత తెలుసు? ఎన్నికల్లో ఓటు వేయడం కంటే ముందే మీరు ఆ లీడర్‌కు రేటింగ్ ఇచ్చే ఛాన్స్ వస్తే మీకు వదులుకుంటారా? ఎన్నికల వరకు ఆగకుండా ముందే మీ నేత ప్రోగ్రెస్ కార్డును మీరే డిసైడ్ చేయొచ్చు. ఇందుకోసం మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఓ స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు. మీ లీడర్‌కు రేటింగ్ ఇచ్చే అవకాశం కల్పిస్తోంది నేత యాప్. 'నేత-లీడర్స్ రిపోర్ట్ కార్డ్' యాప్‌ను గతేడాది లాంఛ్ చేశారు. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్, ఐఓఎస్‌లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
నేత యాప్‌లో ప్రధాన మంత్రితో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల జాబితా ఉంటుంది. అంతేకాదు... గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థుల పేర్లు కూడా ఉంటాయి. మీ ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేస్తే మీ లీడర్ల జాబితా కనిపిస్తుంది. వారి ఆదాయం, ఆస్తుల వివరాలు కూడా ఉంటాయి. ఆ లీడర్లలో మీరు ఎవరికైనా రేటింగ్ ఇవ్వొచ్చు. రేటింగ్ మాత్రమే కాదు సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు. సర్వేల్లో పాల్గొనొచ్చు. ఎక్కువ రేటింగ్ యూజర్లకు 'స్టార్ సిటిజన్' గుర్తింపు లభిస్తుంది. నేత యాప్‌ను ఇప్పటికే 5 లక్షల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు.
'నేత-లీడర్స్ రిపోర్ట్ కార్డ్' యాప్ మాత్రమే కాదు వెబ్సైట్ కూడా ఉంది. ఆ వెబ్సైట్లో కూడా మీరు లీడర్లకు రేటింగ్ ఇవ్వొచ్చు. మీకు రేటింగ్ ఇవ్వడం ఇష్టం లేకపోతే మీ లీడర్లకు వచ్చిన రేటింగ్ కూడా తెలుసుకోవచ్చు.
Photos: చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్... Redmi Go ధర రూ.4,499 మాత్రమే...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.