హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Mobile Battery Explode: ఫోన్ బ్యాటరీ పేలి ఎనిమిది నెలల పాప మృతి.. ఈ పాపం ఎవరిది..?

Mobile Battery Explode: ఫోన్ బ్యాటరీ పేలి ఎనిమిది నెలల పాప మృతి.. ఈ పాపం ఎవరిది..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Mobile Battery Explode: ఛార్జింగ్ పెట్టిన ఫోన్ల బ్యాటరీలు పేలిపోతూ మనుషుల ప్రాణాలను తీసేస్తున్నాయి. తాజాగా ఇలాంటి దుర్ఘటన మరొకటి జరిగి అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

సెల్ ఫోన్స్ బ్యాటరీలు పేలడం కొత్తేం కాదు. అయితే గతంలో మొబైల్ బ్యాటరీలు పేలినా.. ఆ ఫోన్ ఓనర్లు స్వల్ప లేదా తీవ్రమైన గాయాలతో ప్రాణాలతో బయటపడేవారు. కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. ఈ బ్యాటరీలు పేలిపోతూ మనుషుల ప్రాణాలను తీసేస్తున్నాయి. తాజాగా ఇలాంటి దుర్ఘటన మరొకటి జరిగి అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని బరేలీ (Bareilly)లో ఎనిమిది నెలల పసికందు మొబైల్ బ్యాటరీ పేలుడు కారణంగా తీవ్ర గాయాల పాలై కన్నుమూసింది.

వివరాల్లోకి వెళితే.. యూపీలోని బరేలీలో సునీల్ కుమార్ కశ్యప్ అనే 30 ఏళ్ల కార్మికుడు తన భార్యాపిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. వీరు ప్రస్తుతం కన్‌స్ట్రక్షన్‌ జరుగుతున్న ఒక ఇంట్లో నివసిస్తున్నారు. ఇంకా ఇంటి నిర్మాణం పూర్తి కాలేదు కాబట్టి ఈ ఇంటికి కరెంట్ కనెక్షన్ అందించలేదు. దీనితో వారు ప్రస్తుతానికి ఒక సోలార్ ప్లేట్, బ్యాటరీ సహాయంతో కరెంటు పొందుతున్నారు. మొబైల్స్ కూడా ఛార్జ్ చేస్తున్నారు.

ఈ క్రమంలో సునీల్ ఆరు నెలల క్రితం ఒక కీప్యాడ్ ఫోన్‌ను కొనుగోలు చేశాడు. ఈ ఫోన్ బ్యాటరీ కొద్ది నెలల్లోనే బాగా ఉబ్బింది. సెప్టెంబర్ 11న అంటే ఆదివారం నాడు సునీల్ కుమార్ భార్య కుసుమ ఆ మొబైల్‌కు సోలార్ ప్యానెల్ ప్లగ్ ద్వారా ఛార్జింగ్ పెట్టి ఇంటి బయటికి వెళ్లింది. ఆ సమయంలో కశ్యప్ పనికి వెళ్లాడు. అతని కుమార్తెలు నేహా, నందిని ఇంట్లో ఉన్నారు.

అయితే ఆ మొబైల్‌ను 8 నెలల పాప నేహా పడుకున్న బెడ్‌పైనే ఉంచారు. కొంత సమయం తర్వాత ఈ ఫోన్ బ్యాటరీ ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలింది. దీంతో నులక మంచంతో పాటు, దాని పైనే నిద్రిస్తున్న పసికందు శరీరంపై తీవ్రమైన కాలిన గాయాలు కనిపించాయి. పాప ప్రాణాలను కాపాడేందుకు కుసుమ హుటాహుటిన ఆసుపత్రికి తరలించింది. గాయాల తీవ్రత అధికంగా ఉండటం, మెరుగైన చికిత్స అందకపోవడంతో ఆ చిన్నారి మరణించింది.

ఇది కూడా చదవండి : ఆండ్రాయిడ్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఆ ఆప్షన్‌లు అందుబాటులోకి తీసుకురానున్న గూగుల్ ..

* పోలీసుల వాదన

కాగా తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్లే ఈ విషాదం చోటు చేసుకుందని.. ఈ ఘటనలో ఎలాంటి కేసు నమోదు కాలేదని ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు. కీప్యాడ్ ఫోన్ ఇలా పేలుతుందని తాను ఊహించలేదని.. తన వల్లే తన కుమార్తె చనిపోయిందని మీడియాతో చెబుతూ మృతురాలి తల్లి కుసుమ కన్నీరుమున్నీరైంది. కశ్యప్ సోదరుడు అజయ్ కుమార్ ఈ దుర్ఘటనపై స్పందించాడు. యూఎస్‌బీ కేబుల్‌తో ఫోన్‌ ఛార్జర్ వచ్చిందని, అయితే ఆ కేబుల్ అడాప్టర్‌కు సరిగా కనెక్ట్ కాలేదని, అందుకే అది పేలిపోయిందని చెప్పాడు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Mobile phones, Smart phones, Tech news, Uttar pradesh

ఉత్తమ కథలు