EGG GANG Record: ఒక గుడ్డు... 3 కోట్ల 74 లక్షల లైకులు... ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలనం

Instagram Record | ఎవరో నారింజ రంగులో ఉన్న ఓ గుడ్డు ఫోటోను పోస్ట్ చేశారు. అంతే... ఆ పోస్టుకు లైకుల మీద లైకులు వచ్చేశాయి. అది కూడా నిమిషాల్లో. కొన్ని గంటల్లోనే ఇన్‌స్టాగ్రామ్‌లో పాత రికార్డులన్నీ చెరిగిపోయాయి.

news18-telugu
Updated: January 15, 2019, 9:28 AM IST
EGG GANG Record: ఒక గుడ్డు... 3 కోట్ల 74 లక్షల లైకులు... ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలనం
Instagram Record: గుడ్డుకు రెండున్నర కోట్ల లైకులు... ఏముంది అందులో? image: world_record_egg/instagram
news18-telugu
Updated: January 15, 2019, 9:28 AM IST
గుడ్డుకు రెండున్నర కోట్ల లైకులు వచ్చాయంటే నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారిన పోస్ట్ ఇది. ఆ పోస్ట్‌లో ఏమీ లేదు. జస్ట్ ఓ గుడ్డు ఉంది అంతే. ఆ పోస్ట్‌కు ఇప్పటి వరకు 3,74,77,334 లైకులు వచ్చాయి. అంటే మూడు కోట్ల 74 లక్షల 77 వేల 334 లైకులు అన్నమాట. ఒక పోస్టుకు ఇన్ని లైకులు సాధించడం ఆన్‌లైన్ సెలబ్రిటీలకే సాధ్యం కాలేదు. కానీ ఓ గుడ్డుకు ఇన్ని లైకులు రావడం అందరికీ షాకిస్తోంది. సంచలనంగా మారింది. ఈ ఒక్క రికార్డే కాదు... ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటివరకు అత్యధిక లైకులు వచ్చిన పోస్టు కూడా ఈ గుడ్డుదే. అంతకుముందు ఈ రికార్డు కైలీ జెన్నర్ పేరు మీద ఉండేది. ఆమె పోస్టుకు కోటి 80 లక్షల లైకులు వచ్చాయి. అదే ఇప్పటివరకు ఉన్న రికార్డు. కానీ ఇప్పుడా రికార్డును ఈ గుడ్డు పోస్టు చెరిపేసింది. ఆ గుడ్డు పోస్ట్ ఇదే.



 






View this post on Instagram




 

Let’s set a world record together and get the most liked post on Instagram. Beating the current world record held by Kylie Jenner (18 million)! We got this 🙌 #LikeTheEgg #EggSoldiers #EggGang


A post shared by EGG GANG 🌍 (@world_record_egg) on





ఇన్ని లైకులు వచ్చాయి కాబట్టి ఆ గుడ్డులో ఏదైనా విశేషం ఉందేమో అనుకుంటున్నారా? ఎలాంటి విశేషం లేదు. అది జస్ట్ ఓ గుడ్డు మాత్రమే. రాత్రి ఎవరో నారింజ రంగులో ఉన్న ఓ గుడ్డు ఫోటోను పోస్ట్ చేశారు. అంతే... ఆ పోస్టుకు లైకుల మీద లైకులు వచ్చేశాయి. అది కూడా నిమిషాల్లో. కొన్ని గంటల్లోనే ఇన్‌స్టాగ్రామ్‌లో పాత రికార్డులన్నీ చెరిగిపోయాయి. ఇప్పటికీ ఆ గుడ్డుకు లైకుల మీద లైకులు వచ్చేస్తున్నాయి. ఈ స్టోరీ రాసే సమయానికి 3,74,77,334 లైకులు వచ్చాయి. ప్రస్తుతం ఎన్ని లైక్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే ఆ పోస్ట్ క్లిక్ చేసి చూడొచ్చు.



ఇన్ని రికార్డులు సృష్టిస్తున్న ఈ గుడ్డు పోస్ట్ పెట్టింది ఎవరో కూడా తెలియదు. world_record_egg యూజర్ నేమ్‌తో గుడ్డు ఫోటో పోస్ట్ చేసి 'ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక మంది లైక్ చేసిన పోస్ట్‌గా అందరం కలసి రికార్డు సృష్టిద్దాం. ప్రస్తుతం కైలీ జెన్నర్(1.8 కోట్లు) పేరు మీద ఉన్న రికార్డు చెరిపేద్దాం' అని కామెంట్ పెట్టారంతే. ఇంకేముంది... ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లు ఇలా లైకుల వర్షం కురిపించారు. కైలీ జెన్నర్ రికార్డ్ చెరిపేశారు. ఆ విషయం తెలుసుకున్న కైలీ జెన్నర్ ఏం చేసిందో తెలుసా? సరిగ్గా అలాంటి గుడ్డునే పగలగొట్టేసింది. ఆ పోస్టుకు 1,36,14,765 వ్యూస్ రావడం మరో విశేషం.



 




View this post on Instagram




 

Take that little egg


A post shared by Kylie (@kyliejenner) on





ఇంటర్నెట్ అంటే ఇంతే. నెటిజన్లు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. ఏ విశేషం లేని గుడ్డును ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికమంది లైక్ చేసిన పోస్టుగా రికార్డు క్రియేట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఇవి కూడా చదవండి:

AADHAR NEWS: ఆధార్ కార్డు పోయిందా? ఇలా రీప్రింట్ చేసుకోవచ్చు

JALLIKATTU: 'జల్లికట్టు' వెనకున్న ఆసక్తికర చరిత్ర ఏంటో తెలుసా?

TRAI Good News: నెలకు రూ.153 చెల్లిస్తే 100 ఫ్రీ లేదా పే ఛానెళ్లు

REDMI 6 PRO: రూ.11,499 విలువైన ఫోన్ రూ.1,058 ధరకే... ఎలా కొనాలో తెలుసుకోండి

SBI CARD: ఎస్‌బీఐ ఏటీఎం కార్డు నుంచి డేటా కొట్టేస్తారు జాగ్రత్త
First published: January 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...