LEAD: విద్యార్థులు మొబైల్ లోనే కంప్యూటర్ కోడింగ్ నేర్చుకునే ఛాన్స్.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ముంబాయికి చెందిన ఎడ్ టెక్ LEAD కీలక ప్రకటన చేసింది. మొబైల్ ఆధారిత కోడింగ్ మరియు కంప్యుటేషనల్ స్కిల్స్(CCS) ప్రోగ్రామ్ ను లాంఛ్ చేయనున్నట్లు తెలిపింది.

  • Share this:
    ఆన్లైన్ క్లాసులకు విపరీతంగా డిమాండ్ పెరుగుతున్న వేళ ముంబాయికి చెందిన ఎడ్ టెక్ LEAD కీలక ప్రకటన చేసింది. మొబైల్ ఆధారిత కోడింగ్ మరియు కంప్యుటేషనల్ స్కిల్స్(CCS) ప్రోగ్రామ్ ను లాంఛ్ చేయనున్నట్లు తెలిపింది. 2 వేలకు పైగా ఉన్న తమ భాగస్వాములైన ప్రైవేటు స్కూల్స్ కు 1 నుంచి 8వ తరగతి విద్యార్థుల కోసం ఈ ప్రోగ్రామ్ లాంఛ్ చేయనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ CCS ప్రోగ్రాం పాఠశాలల్లో కంప్యూటర్ తరగతులను విప్లవాత్మకంగా మారుస్తుందని సంస్థ తెలిపింది. మరియు 21 వ శతాబ్ధపు అత్యాధునిక నైపుణ్యాలతో విద్యార్థులకు చిన్న వయస్సులోనే శిక్షణ ఇస్తుంది. విద్యార్థులు తమ ఫోన్లలోని ‘LEAD’ యాప్ ద్వారా CSS ప్రోగ్రామ్ తరగతులకు ఆన్లైన్లో హాజరు కావచ్చు. తద్వారా ఆన్లైన్లోనే క్లాస్ రూం అనుభూతిని పొందవచ్చని సంస్థ తెలిపింది. LEAD యాప్ ప్రధాన లక్ష్యం భారత దేశంలోని విద్యార్థులకు హై క్వాలిటీ కంటెట్ తో పాటు మంచి సులభంగా నేర్చుకునేలా అందించడమే అని కంపెనీ తెలిపింది. ఈ యాప్ జాతీయ విద్యా విధానం 2020 సూచనలకు అనుగుణంగా పని చేస్తుందని సంస్థ తెలిపింది. జాతీయ విద్యావిధానం డిజిటల్ అక్షరాస్యత మరియు టెక్నాలజీని స్కూల్స్ లో పెంపొందించాలని సూచించిన విషయం తెలిసిందే. విద్యార్థులకు ప్రతీ గ్రేడ్ లెవల్ లో కోడింగ్ స్కిల్స్ పెంపొందించాలని తెలిపింది.

    లీడ్ కో ఫౌండ్ మరియు సీఈఓ అయిన సుమీత్ మెహతా మాట్లాడుతూ.. క్లాస్ రూంలో CSS ను తాము మొదటగా అమలు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులను కోడింగ్ లో భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. మిడిల్ క్లాస్ కుటుంబాలకు కూడా కంప్యూటర్ కోడింగ్ ను అందుబాటులోకి తెచ్చేలా ఈ ప్రోగ్రామ్ ను రూపొందించామన్నారు. ఈ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులు వెబ్ సైట్లు, గేమ్స్, యాప్స్ తయారు చేయొచ్చు. లీడ్ చీఫ్ ప్రొడక్ట్ అండ్ లెర్నింగ్ ఆఫీసర్ రికు సయూజ్ మాట్లాడుతూ.. మా CCS ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌తో, సాంప్రదాయిక పాఠశాలల్లో పిల్లలు నేర్చుకునే విధానాన్ని మార్చడం మరియు డిజిటల్ ప్రపంచంలో మరియు సాంకేతికలో ముందు ఉండడానికి వీలు కల్పించడం మేము లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

    తమ చొరవ పాఠశాలల్లో కోడింగ్‌ను ప్రవేశపెట్టాలనే ప్రభుత్వ దృష్టికి అనుగుణంగా ఉందన్నారు. మరియు భవిష్యత్తు కోసం కె -12 విద్యార్థులను సిద్ధం చేస్తుందన్నారు. లీడ్‌ టెక్నాలజీ, పాఠ్యాంశాలు మరియు బోధనలను సమగ్ర బోధన మరియు అభ్యాస వ్యవస్థగా మిళితం చేస్తుంది. తద్వారా దేశవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థుల అభ్యాసం మరియు ఉపాధ్యాయ పనితీరు మెరుగుపడుతుంది. 20 రాష్ట్రాల్లో టైర్ 2 నుండి టైర్ 4 నగరాలతో సహా 400 కి పైగా నగరాల్లో 8 లక్షల + విద్యార్థులతో 2000+ పాఠశాలలతో లీడ్ భాగస్వామ్యం.
    Published by:Nikhil Kumar S
    First published: