హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Smartphone Sales: ఇదేం కొనుడురా అయ్యా.. స్మార్ట్‌ఫోన్స్‌ను బీభత్సంగా కొనేస్తున్న జనం!

Smartphone Sales: ఇదేం కొనుడురా అయ్యా.. స్మార్ట్‌ఫోన్స్‌ను బీభత్సంగా కొనేస్తున్న జనం!

 ఇదేం కొనుడురా అయ్యా.. స్మార్ట్‌ఫోన్స్‌ను బీభత్సంగా కొనేస్తున్న జనం!

ఇదేం కొనుడురా అయ్యా.. స్మార్ట్‌ఫోన్స్‌ను బీభత్సంగా కొనేస్తున్న జనం!

Flipkart Sale | స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు భారీగా పెరిగాయి. జనాలు ఎగబడి మరి కొనేస్తున్నారు. నిమిషానికి 1000కి పైగా ఫోన్లు విక్రయం అవుతున్నాయి. అంటే ఏ స్థాయిలో ఫోన్లను కొనుగోలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

    Amazon Sale | పండుగ సీజన్ ముందు దిగ్గజ ఈకామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే సేల్‌తో కస్టమర్ల ముందుకు వచ్చాయి. అమెజాన్ (Amazon) గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నిర్వహిస్తూ ఉంటే.. ఫ్లిప్‌కార్ట్ (Flipkart) మాత్రం బిగ్ బిలియన్ డేస్ సేల్‌తో ముందుకు వచ్చింది. ఈ రెండు ఫెస్టివ్ సేల్స్ ఈ నెల చివరి వరకు అందుబాటులో ఉంటాయి. ఇందులో భాగంగా పలు రకాల ప్రొడక్టులపై అదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

    ఈకామర్స్ సంస్థలు సేల్ ప్రారంభమైన నాలుగు రోజుల్లోనే ఏకంగా భారీ సంఖ్యలో స్మార్ట్‌ఫోన్లను విక్రయించాయి. నిమిషానికి రూ.1100 ఫోన్లు విక్రయమయ్యాయి. మొత్తంగా నాలుగు రోజుల్లో రూ. 11 వేల కోట్ల విలువైన ఫోన్లు అమ్ముడుపోయాయి. కన్సల్టింగ్ సంస్థ రెడ్‌సీర్ ఈ విషయాలను వెల్లడించింది.

    పీపీఎఫ్, సుకన్య సమృద్ధి స్కీమ్స్‌లో డబ్బులు పెట్టే వారికి కేంద్రం షాక్!

    దాదాపు 60 నుంచి 70 లక్షల మొబైల్ ఫోన్లు 4 రోజుల్లోనే విక్రయమయ్యాయని ఈ సంస్థ పేర్కొంటోంది. గ్రాస్ మర్చండైజ్ వాల్యూమ్‌లో ఏకంగా 10 రెట్లు పెరుగుదల నమోదు అయ్యిందని తెలిపింది. ఈకామర్స్ అమ్మకాల్లో ఫోన్ల విక్రయాలే సింహ భాగం ఉన్నాయని పేర్కొంది. మొబైల్స్ విభాగం మంచి పనితీరు చూపిస్తోందని, చాలా మంది కొత్త ఫోన్లకు అప్‌గ్రేడ్ అవుతున్నారని, వాల్యూ ఆఫర్లు వచ్చినప్పుడు వాటిని సొంతం చేసుకుంటున్నారని రెడ్‌సీర్ వివరించింది. ప్రీమియం ఫోన్లు అయిన ఐఫోన్ 12, ఐఫోన్ 13, వన్‌ప్లస్ మోడళ్ల వల్ల మొబైల్ అమ్మకాలు పెరిగాయని తెలిపింది.

    కొత్త సిమ్ కార్డు తీసుకుంటున్నారా? ఈ తప్పులు చేస్తే రూ.50 వేలు జరిమానా, ఏడాది జైలు శిక్ష

    మొబైల్ కేటగిరి తర్వాత ఫ్యాషన్ కేటగిరిలో అధిక పెరుగుదల నమోదు అయ్యిందని పేర్కొంది. 4.5 రెట్లు పెరుగుదల కనిపించిందని తెలిపింది. డెయిలీ యావరేజ్ జీఎంవీ రూ.5,500 కోట్లుగా ఉందని వెల్లడించింది. టైర్ 2 పట్టణాల్లో కొనుగోళ్లు జోరందుకుకోవడంతో ఈకామర్స్ విక్రయాలు కూడా పెరుగుతున్నాయని పేర్కొంది.

    మొత్తంగా చూస్తే ఈకామర్స్ పోర్టల్స్‌లో డెయిలీ యావరేజ్ జీఎంవీ 5.4 రెట్లు పెరిగిందని, దేశవ్యాప్తంగా 5- 5.5 కోట్ల మంది ఆన్‌లైన్ షాపర్స్ కొనుగోళ్లు చేస్తున్నారని వివరించింది. ఈకామర్స్ సంస్థలు రూ.24,500 కోట్ల విలువైన అమ్మకాలు నిర్వహించాయని పేర్కొంది. గత ఏడాది కన్నా ఈసారి అమ్మకాలు ఎక్కువగా జరిగాయని తెలిపింది. ఇకపోతే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ ఇక కేవలం ఒక్క రోజు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. అందువల్ల మీరు కూడా షాపింగ్ చేయాల్సి ఉంటే.. ఇప్పుడే అందుబాటులో ఉన్న బెస్ట్ ఆఫర్లు సొంతం చేసుకోండి.

    Published by:Khalimastanvali Khalimastanvali
    First published:

    Tags: Amazon, Amazon Great Indian Festival Sale, Flipkart, Flipkart Big Billion Days, Mobile phones, Smartphones

    ఉత్తమ కథలు