ఎవరైనా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారా?... ఈ యాప్ ద్వారా నేరుగా ECకి ఫిర్యాదు చేయండి...

సామాజిక బాధ్యత కలిగిన ప్రతీ పౌరుడు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లేలా ‘సివిజిల్’ యాప్ రూపకల్పన... గోప్యంగా సమాచారం ఇచ్చిన వారి వివరాలు... 5 నిమిషాల నిడివి తగ్గకుండా వీడియోలు పంపాల్సి ఉంటుంది...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 17, 2019, 11:46 AM IST
ఎవరైనా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారా?... ఈ యాప్ ద్వారా నేరుగా ECకి ఫిర్యాదు చేయండి...
సివిజిల్ యాప్
  • Share this:
దేశంలో సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. మొత్తంగా ఏడు దశల్లో ఈ ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా ప్రకటించారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికల నిర్వహణ ఉంటుందని చెప్పారు. కర్నాటక, మణిపూర్, రాజస్థాన్, త్రిపుర రాష్ట్రాల్లో రెండు దశల్లో.. అస్సాం, చత్తీస్ గఢ్‌ రాష్ట్రాల్లో మూడు దశల్లో.. జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో నాలుగు దశల్లో.. జమ్మూకశ్మీర్‌లో ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. బీహార్, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ్‌బెంగాళ్ రాష్ట్రాల్లో ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి, అనేక రకాల చట్టవిరుద్దమైన కార్యక్రమాలకు పాల్పడుతూ ఉంటారు చాలామంది నాయకులు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులు పంపిణీ చేయడం దగ్గర్నుంచి... దొంగచాటుగా మద్యం, చీరలు, ఇతర వస్తువులనుపంపిణీ చేస్తుంటారు. ఇలాంటి విషయాలు తెలిసినా... ఎవ్వరికీ ఫిర్యాదు చేయాలో తెలియక, చూస్తూ పోతుంటారు చాలామంది. కొన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా... వారు కూడా పట్టించుకోరనే అపోహా లేదా అనుమానం ఉంటాయి. అయితే ఇకపై అలా చూస్తూ పోవాల్సిన పని లేదు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా ఓ యాప్ ద్వారా నేరుగా ఎన్నికల కమిషన్‌కు జరుగుతున్న అక్రమాల గురించి ఫిర్యాదు చేయొచ్చు.
Android Apps, EC App cVigil Smart phone Apps, cvigil app download, cvigil app user guidelines, Android Apps for Smart phone, Election Commission App for Voters, General Elections 2019 apps, Poll code Violation cVigil, Election Code 2019, election dates 2019 schedule, voter help line app, poll my vote app, know my vote app, మొబైల్ యాప్స్, ఆండ్రాయిడ్ యాప్స్, ఎలక్షన్ కమిషన్ యాప్, ఈసీ యాప్ సివిజిల్, ఎన్నికల యాప్ cVigil, ఓటర్ హెల్ప్ లైన్, ఎన్నికల షెడ్యూల్, లోక్‌సభ ఎన్నికల తేదీలు, నా ఓటు ఎక్కడ, ఎన్నికల కోడ్ ఉల్లంఘన
సామాజిక బాధ్యత ప్రతీ సామాన్యపౌరుడు ఇక అక్రమాలపై తిరగబడవచ్చు..

ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఏ కార్యక్రమాలు జరిగినా... సామాజిక బాధ్యత కలిగిన ప్రతీ పౌరుడు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లేలా ‘సివిజిల్’ అనే యాప్ తీసుకొచ్చింది ఎలక్షన్ కమిషన్. చట్టవ్యతిరేకంగా జరిగే మద్యం, డబ్బులు, ఇతర వస్తువుల పంపిణీని అడ్డుకోవడంతో పాటు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడంలో భాగం కావచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగించేవారందరూ సివిజిల్ యాప్ వాడొచ్చు. ప్లేస్టోర్ నుంచి ఈ యాప్ ఇన్‌్టాల్ చేసుకుంటే... ఫోన్ నెంబర్, ఇతర వివరాలు ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న ఫోన్‌నెంబర్‌కు OTP వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే యాప్ యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత మీ దృష్టికి వచ్చిన కోడ్ ఉల్లంఘనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీసి... నేరుగా ఎన్నికల సంఘానికి పంపవచ్చు. సమాచారం పంపిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది.

election dates 2019, schedule election 2019, lok sabha election date , code of conduct 2019 election ,date 2019 election ,dates 2019 election, dates election 2019, date election date, lok sabha election, chief election commissioner of india आचार संहिता , 2019 elections , 2019 date chief election commissioner of india, 2019 election commissioner of india , election news model code of conduct, mp election date 2019 , aachar sanhita, 2019 lok sabha election dates ,election date declared 2019 ,election 2019 dates, model code of conduct 2019 date, लोकसभा चुनाव , general election 2019 dates in india
ఎలక్షన్ కమిషన్ చీఫ్ కమిషనర్ సునీల్ అరోరా

ఎన్నికల సంఘానికి సమాచారం అందిన కొద్ది సమయంలోనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుంటారు. వీడియోలు, ఫోటోలు పంపిన ప్రదేశం GPS ద్వారా ఎన్నికల సంఘానికి అందుతుంది. దాని ఆధారంగా సంబంధిత జిల్లా యంత్రాంగానికి సమాచారం అందుతుంది. సమాచారం అందిన తర్వాత ఎంత త్వరగా వీలైత అంత తక్కువ సమయంలో చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన, ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటారు. ఈ యాప్ ఎన్నికలు జరిగే సమయంలో మాత్రమే పనిచేస్తుంది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన సమయం నుంచి, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ యాక్టివ్‌గా ఉంటుంది. సమాచారం ఇచ్చే వ్యక్తులు 5 నిమిషాల నిడివి తగ్గకుండా వీడియోలు పంపాల్సి ఉంటుంది. అంతేకాకుండా సంఘటన జరిగిన తర్వాత సాధ్యమైనంత త్వరగా సమాచారం అందించాల్సి ఉంటుంది. కెమెరాలో తీసిన ఫోటోలు, వీడియోలు పంపడానికి వీలు కాదు. నేరుగు యాప్‌లోనే ఫోటోలు గానీ, వీడియోలు గానీ రికార్డు చేయాల్సి ఉంటుంది.

First published: March 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు