Transil e1s | మీరు కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అది కూడా ఎలక్ట్రిక్ సైకిల్ కోసం ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు శుభవార్త. ప్రస్తుతం పలు కంపెనీలు ఈ విభాగంలో కొత్త కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నాయి. ఎలక్ట్రిక్ టూవీలర్ (Electric Vehicle) మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ఇబైక్‌గో తాజాగా కొత్త ఎలక్ట్రిక్ సైకిల్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ట్రాన్సిల్ ఇ1 ఎస్ పేరుతో కొత్త మోడల్‌కు లాంచ్ చేసింది. ట్రాన్సిల్ బ్రాండ్ కిందనే ఇంకా ఇతర ఎలక్ట్రిక్ వెహికల్స్ (EV) కూడా లాంచ్ చేస్తామని కంపెనీ పేర్కొంది.
ట్రాన్సిల్ ఇ1 ఎస్ బైసైకిల్ ప్రిబుకింగ్స్ రానున్న రోజుల్లో ప్రారంభం అవుతాయని కంపెనీ తెలిపింది. మూడు రంగుల్లో ఈ ఎలక్ట్రిక్ సైకిల్ కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. దీని ధర రూ. 44,999గా ఉంది. స్వల్ప దూరం ప్రయాణించే వారికి ఈ ట్రాన్సిల్ ఇ1 ఎస్ ఎలక్ట్రిక్ సైకిల్ అనువుగా ఉంటుందని కంపెనీ పేర్కొంటోంది. ఇందులో లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుందని తెలిపింది. అలాగే స్మార్ట్ బీఎంఎస్ ఫీచర్ కూడా ఉందని పేర్కొంది.
వావ్.. ఆఫర్ అంటే ఇదే.. ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటే రూ.25,000 డిస్కౌంట్!
తక్కువ బరువు, గట్టితనం వంటివి ఈ సైకిల్ ప్రత్యేకత అని కంపెనీ పేర్కొంటోంది. అలాగే ఇతర హై క్వాలిటీ హర్డ్‌వేర్‌ను ఈ సైకిల్‌లో ఉపయోగించామని తెలిపింది. తక్కువ మెయింటెనెన్స్ కాస్ట్ ఉంటుందని పేర్కొంది. రోజుకు 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించే వారికి ఈ స్కూటర్ అనువుగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ సైకిల్ రన్నింగ్ కాస్ట్ కిలోమీటరుకు కేవలం 5 పైసలు కన్నా తక్కువే అని కంపెనీ పేర్కొంటోంది. అందువల్ల కొత్త ఇసైకిల్ కొనుగోలు చేయాలని భావించే వారికి దీన్ని పరిశీలించొచు.
ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే వారికి శుభవార్త.. ఏకంగా 6 ఆఫర్లు, భారీ తగ్గింపు పొందండిలా!
ఇకపోతే ఇబైక్‌గో అనే కంపెనీ 2018లో ప్రారంభం అయ్యింది. ఇండియన్ ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్‌లో 2 శాతం మార్కెట్ వాటాను లక్ష్యంగా నిర్దేశించుకుంది. దేశవ్యాప్తంగా వంద పట్టణాల్లో 2 లక్షల ఇబైక్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. మరోవైపు మార్కెట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరిగింది. చాలా మంది ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేస్తున్నారు.
ఓలా, టీవీఎస్, హీరో ఎలక్ట్రిక్, ఏథర్ వంటి పలు కంపెనీలు అమ్మకాల్లో అదరగొడుతున్నాయి. అయితే ఓలా, ఏథర్ వంటి పలు కంపెనీల స్కూటర్ల ధర రూ.లక్షకు పైగానే ఉంది. అయితే హీరో ఇస్కూటర్ల ధర అందుబాటులో ఉంది. ఇంకా పలు స్టార్టప్స్ తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తున్నాయి. అందువల్ల మీరు మీకు నచ్చిన మోడల్‌ను ఎంపిక చేసుకొని కొనుగోలు చేయొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bycycle, E-bicycle, E-cycle, Electric bike, Electric Scooter, Electric Vehicles